Brahmamudi serial today Episode: రాజ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి తను అడ్మిట్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకుంటాను అంటుంది యామిని. అసలు రాజ్‌ను ఎందుకు హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి అనుకుంటున్నావు.. డాక్టర్ అంతా నార్మల్ గానే ఉంది. మెడిసిన్స్ వాడితే సరిపోతుంది అన్నారు కదా..? అని వాళ్ల డాడ్ అడగ్గానే.. యామిని సరిపోదు డాడీ.. రాజ్‌కు గతం గుర్తు రాక రోజు తన గురించి ఆలోచిస్తున్నారు. అందుకే తన గతం గుర్తు చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. దీంతో వైదేహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. తన గతం ఏంటో నువ్వే చెప్తావా..? అని అడుగుతుంది. దీంతో నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు మామ్ నేను పరిచయం చేసేది. నేను సృష్టించిన రాజ్ గతాన్ని. నేను చెప్పబోయే కట్టుకథను రాజ్ రేపటి నుంచి నమ్మడం మొదలు పెడతాడు.
తను చదువుకున్న స్కూల్, కాలేజ్ అన్ని కొత్తగా పరిచయం చేయబోతున్నాను. నేను సృష్టించిన జ్ఞాపకాలే ఇకపై తన జీవితంలో జరిగిన సంఘటనలు అవుతాయి. మేము కలిసి చదువుకున్నాం.. కలిసి పెరిగాం. కలిసి తిరిగాం అని ఎప్పేడైతే రాజ్ నమ్మడం మొదలెపెడతాడో అప్పుడే రాజ్ నన్ను నమ్మడం మొదలు పెడతాడు. అని చెప్తుండగానే.. డోర్ దగ్గర రాజ్ వచ్చి నిలబడి ఉండటం చూసి యామిని కంగారు పడుతుంది. అంతా విన్నాడేమోనని భయపడుతుంది. దగ్గరకు వచ్చిన రాజ్ ఏంటి డిష్కషన్ అని అడుగుతాడు. ఏం లేదు బావ రేపు నిన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి అని చెప్తుంది. సరే అంటూ నేను ఆ అమ్మాయిని జాయిన్ చేసింది కూడా అదే హాస్పిటల్ లో వెళితే ఆ అమ్మాయి గురించి కూడా తెలుసుకోవచ్చు అని మనసులో అనకుంటాడు రాజ్.
ఇంట్లో అపర్ణ ఏడుస్తూ.. అసలే రాజ్ దూరమయ్యాడని బాధపడుతుంటే కావ్య ప్రవర్తన నన్ను ఇంకా బాధపెడుతుందండి అంటుంది. దీంతో సుభాష్ కూడా నాకు అదే అర్థం కావడం లేదు అపర్ణ. కావ్యకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కావడం లేదు అంటాడు. దీంతో ఇందిరాదేవి ఒరేయ్ సుభాష్ నీ అనుభవంలో ఎన్నో ఆటోపోటుల చూశారు. ఎన్నో బాధలు పడ్డారు. అలాంటిది కొడుకు దూరం అయ్యాడు అనేసరికి ఇలా చతికిల పడిపోయారు. కానీ ఆ పిచ్చిది ఎన్ని చూసిందిరా..? చిన్నవయసులో మొగుడు దూరం అయ్యాడన్న బాధలో ఉండిపోయిందిరా..? అసలు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకు ఏ ఆనందం దొరికింది చెప్పు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని మొగుడు దూరం పెట్టాడు.
ఇష్టం లేని కోడలు వచ్చిందని అపర్ణ దూరం పెట్టింది. అన్ని అర్థం చేసుకుని ఇద్దరు ఒక్కటయ్యేలోపు ఇలా జరిగింది. ఇప్పుడు ఒంటరిగా అయిపోయేటప్పటికీ ఇదంతా ఒక కలలా అనుకుంటుంది. ఇందాకా తను మాట్లాడిన మాటలకు నాకే ఎక్కడో అనిపించింది. నా మనవడు ఎక్కడో బతికే ఉన్నాడేమో అనిపించింది. పెద్దవాళ్లుగా తనకు మనమే అండగా నిలబడాలి. ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. మెల్లమెల్లగా రాజ్ లేడన్న నిజాన్ని తనకు చెప్పాలి అంటుంది. అపర్ణ మాత్రం కావ్యను చూస్తుంటే తను మారుతుందన్న నమ్మకం నాకు కలగడం లేదు అత్తయ్య. ఎప్పటికైనా రాజ్ తిరిగి వస్తాడన్న నమ్మకంతోనే జీవితాంతం అలాగే బతికేస్తుందేమోనని అనిపిస్తుంది అని అందరూ బాధపడతారు.
స్వప్న, అప్పు ఇద్దరు కలిసి కావ్య దగ్గరకు వెళ్తారు. ఇంట్లో అందరూ నీ గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే.. నువ్వేం పట్టనట్టుగా అలా ఎలా ఉండగలుగుతున్నావే అని అడుగుతుంది స్వప్న. దీంతో కావ్య మహా అయితే ఏమనుకుంటారు నాకు పిచ్చి ఎక్కింది అనుకుంటారు అంటుంది. దీంతో స్వప్న కోపంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలిపోతాయి. అంటుంది. దీంతో కావ్య అక్క ఇంట్లో వాళ్లు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నా కళ్లతో నేను చూసిందే నేను నమ్ముతాను. ఈరోజు నన్ను తప్పు పట్టిన వాళ్లే ఆయన్ని నేను తీసుకొచ్చిన రోజు వాళ్లు ఎంత పెద్ద తప్పు చేశారో వాళ్లకే అర్తం అవుతుంది అనగానే.. అంటే ఇప్పటికీ రాజ్ బతికే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా.? అని స్వప్న అడగ్గానే కావ్య అదే కద అక్కా నేను చెప్తుంది..
అనగానే.. స్వప్న కోపంగా నేను ఇంతలా చెప్తున్నా మొండిగా వాదిస్తావేంటి..? అంటూ కొట్టబోతే.. అప్పు ఆపేస్తుంది. ఒకవేళ కావ్య అక్క చెప్పినట్టు బావ బతికే ఉంటే.. కాసేపు మనం కావ్య అక్కలా ఆలోచిద్దాం.. అక్క చెప్తున్నట్టు బావ బతికే ఉంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పు అంటుంది. అయితే ఇప్పుడేం చేద్దాం చెప్పు అంటుంది స్వప్న. పై అధికారులతో మాట్లాడి కేసు రీ ఓపెన్ చేయిస్తా.. కేసులో నిజానిజాలేంటో తెలుసుకుందాం. అని చెప్తుంది. దీంతో అప్పు ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తెలుసుకునే లోపు నేను మా ఆయన్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను అని చెప్తుంది కావ్య.
హాల్లో రాజ్ ఫోటో పెట్టి పూలు పెట్టి దీపం వెలిగించబోతుంది రుద్రాణి. అందరూ అది చూసి షాక్ అవుతారు. ఇందిరాదేవి వచ్చి రుద్రాణిని తిడుతుంది. కావ్య మనసు ఎందుకు కష్టపెట్టాలని చూస్తున్నావు అంటూ నిలదీస్తుంది. దీంతో రుద్రాణి మన బిడ్డకు జరిపించాల్సిన కార్యం ఆ కావ్య మాటలు పట్టుకుని చేయకపోతే తన ఆత్మకు శాంతి ఎలా చేకూరుతుంది అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో అందరూ రుద్రాణిని తిడతారు. అయితే రాజ్ బతికే ఉన్నాడా అని మీరు నిరూపిస్తారా..? అని రుద్రాణి అడిగితే ఎవ్వరూ పలకరు. దీంతో రుద్రాణి దీపం వెలిగించబోతుంటే.. కావ్య వచ్చి ఆపేస్తుంది. రుద్రాణి చేతిని మెలిక తిప్పుతుంది కావ్య. మా ఆయనే బతికే ఉన్నాడు అంటే నీకు అర్థం కావడం లేదా..? ఎంత ధైర్యం ఉంటే మా ఆయన ఫోటో ముందు దీపం వెలిగిస్తున్నావు అంటూ గొంతు పట్టుకుని చంపేయబోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?