BigTV English

Tvs Jupiter 110: సరికొత్త మార్పులతో జూపిటర్ 110 రెడీ.. లాంచ్ ఎప్పుడంటే..?

Tvs Jupiter 110: సరికొత్త మార్పులతో జూపిటర్ 110 రెడీ.. లాంచ్ ఎప్పుడంటే..?

Tvs Jupiter 110 launch on august 22: దేశీయ మార్కెట్‌లో టీవీఎస్ కంపెనీకి ప్రత్యేక క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ కంపెనీ స్కూటర్లపై వాహన ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో టీవీఎస్ జూపిటర్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. అందువల్ల టీవీఎస్ కంపెనీ త్వరలో అంటే ఆగస్టు 22న ‘జూపిటర్ 110’ స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ స్కూటర్‌ అప్‌డేటెడ్‌‌తో వస్తుంది. కొన్ని మార్పులు చేర్పులను ఇందులో చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 125 సిసి కంటే ఇది పూర్తి కొత్త లుక్‌, డిజైన్‌లో అందుబాటులోకి వస్తుంది. దీనిని సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.


కాగా కంపెనీ ఇటీవలే తన లైనప్‌లో ఉన్న ఎన్‌టర్క్ స్కూటర్‌ను అప్‌డేటెడ్ కలర్ ఆప్షన్‌లలో చిన్న చిన్న మార్పులతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు కంపెనీ తన ఫేమస్ స్కూటర్ అయిన జూపిటర్‌ని 110 సిసి విభాగంలో రిలీజ్ చేయడానికి సిద్ధం అయింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. కానీ తాజాగా కొన్ని లీక్‌లు బయటకొచ్చాయి. వాటి ప్రకారం.. ఈ స్కూటర్ ఫ్రంట్ సైడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ల్‌ను అందించారు. అయితే ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఈ స్కూటర్‌ కొత్త లుక్, డిజైన్‌తో కనిపించనుంది.

Also Read: మార్కెట్‌లోకి మరో కొత్త బైక్.. జావా యెజ్డి 42 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!


కాగా ఈ స్కూటర్ ఫ్రంట్ సైడ్‌లో చాలా మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇది కాకుండా సైడ్, రియర్ డిజైన్‌లలో మరికొన్ని మార్పులు చేశారు. దీనికోసం వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీవీఎస్ కంపెనీ కూడా పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ స్కూటర్‌ను తీసుకు వస్తుంది. దీని ద్వారా ఎక్కువ సేల్స్ జరుగుతాయని కంపెనీ భావిస్తుంది. కాగా టీవీఎస్ జూపిటర్ 2013లో తొలిసారిగా రిలీజ్ అయింది. ఎంతో మంది నుంచి ఈ స్కూటర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ 109.7 సిసి ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 7.77 బిహెచ్‌పి పవర్, 8.8 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. రాబోయే ఈ జూపిటర్ 110 స్కూటర్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్‌‌విటీ ఫీచర్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఈ స్కూటర్ మరెన్ని అప్‌డేటెడ్ ఫీచర్లతో వస్తుందో. ఇక జూపిటర్ 125 స్కూటర్ ధర విషయానికొస్తే.. ఇది రూ.77,100 నుంచి రూ.92,700 ధర మధ్య అందుబాటులో ఉంది.

Tags

Related News

Google Pixel 10: గూగుల్ పిక్సెల్ 10 భారీ ఆఫర్స్‌తో భారత్‌లో లాంచ్. ధర ఎంతో తెలుసా?

BSNL New Plan: జస్ట్ రూ. 319కే 65 డేస్ వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా కూడా..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025.. స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ ఆఫర్స్!

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

రిటైర్ అయ్యాక ప్రతి నెలా 1 లక్ష రూపాయల పెన్షన్ కావాలా..అయితే ఇలా ఇన్వెస్ట్ చేయండి..?

BSNL Offer: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!

Big Stories

×