Guppedantha Manasu: అవును. మీరు వింటుంది నిజమే.. గుప్పెడంత మనసు సీరియల్ ముగియనుంది. సీరియల్స్ లో టాప్ రేటింగ్ లో కొనసాగుతుంది గుప్పెడంత మనసు. కుమార్ పంతం దర్శకత్వం వహిస్తున్న ఈ సీరియల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
రిషి, వసుధార, జగతి, మహేంద్ర, శైలేంద్ర అనే పాత్రలు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాయో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రిషిధారకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గత కొన్నేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ సీరియల్ కు ఎండ్ కార్డు పడనుంది. ఈ మధ్యలో సీరియల్ లో చాలా మార్పులు వచ్చాయి.
రిషికి హెల్త్ బాగాలేని కారణంగా ఒక మూడు నెలలు సీరియల్ నుంచి తప్పుకున్నాడు. అప్పుడు సీరియల్ ఫ్యాన్స్ రిషి ఎప్పుడు వస్తాడు.. ? అంటూ యాజమాన్యాన్ని కామెంట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక దీంతో మేకర్స్ .. మళ్లీ రిషిని తీసుకువచ్చారు. ఇక అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. రిషి తిరిగి వచ్చాడు అంటూ సంబురాలు చేసుకున్నారు. అయితే ఈ సంబురాల సంతోషం ఎంతోసేపు నిలవలేదు.
గుప్పెడంత మనసు సీరియల్ షూటింగ్ ముగిసింది. రిషి ఆకా ముకేశ్ గౌడకు కన్నడ బిగ్ బాస్ నుంచి ఆఫర్ రావడంతో మరో మూడు నెలలు హౌస్ లోనే ఉంటాడు. అందుకే చేసేది ఏమి లేక సీరియల్ కు ముగింపు పలకనున్నారు. ఇక వసుధార ఆకా రక్ష సైతం తెలుగు బిగ్ బాస్ లో కనిపిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని తెలుస్తోంది. ఆమెకు ఒక సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని, దాని కోసం డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. షూటింగ్ అయిపోయినా.. సెప్టెంబర్ వరకు ఈ సీరియల్ కంటిన్యూ కానుంది. మరి ఈ కాంబో.. మళ్లీ ఎన్నాళ్లకు రిపీట్ అవుతుందో చూడాలి.