BigTV English

Ultraviolette F77 Mach 2: భారీ అప్‌గ్రేడ్స్‌‌తో అల్ట్రావయలెట్‌ ఎఫ్ 77 మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్‌ లాంచ్.. ఫుల్ ఛార్జింగ్‌తో పరుగులే పరుగులు..!

Ultraviolette F77 Mach 2: భారీ అప్‌గ్రేడ్స్‌‌తో అల్ట్రావయలెట్‌ ఎఫ్ 77 మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్‌ లాంచ్.. ఫుల్ ఛార్జింగ్‌తో పరుగులే పరుగులు..!

ultraviolette f77 mach 2 Launched: ప్రముఖ బైక్ తయారీ కంపెనీ అల్ట్రావయలెట్ 2023లో Ultraviolette F77 బైక్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు తన లైనప్‌లోని ‘అల్ట్రావయలెట్ ఎఫ్ 77 మాక్ 2’ని రూపొందించింది. ఇది కొన్ని కీలక అప్డేట్స్‌‌తో పాటు కీలక కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. కాగా Ultraviolette F77 బైక్‌ మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ultraviolette f77 mach 2 బైక్ మొత్తం తొమ్మిది కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అవి లైటింగ్ బ్లూ, ఆప్టర్‌బర్నర్ ఎల్లో, కాస్మిక్ బ్లాక్, స్టెల్లార్ వైట్, ఆస్టరాయిడ్ గ్రే, సూపర్‌సోనిక్ సిల్వర్, ప్లాస్మా రెడ్, టర్బో రెడ్, స్టెల్త్ గ్రే వంటి కలర్ ఆప్షన్లను కలిగి ఉంది.


మాక్‌ 2లో 3 స్టెప్ రీజెన్ బ్రేకింగ్ సిస్టమ్ అందించబడింది. ఇది బ్రేకింగ్ టైంలో కోల్పోయిన శక్తిని అధిక గ్రాన్యులర్ కంట్రోలర్‌కు అనుమతిస్తుంది. ఈ బైక్‌లో ఏబీఎస్ ఫీచర్‌ను అందించారు. దీంతోపాటు రీజెన్ బ్రేకింగ్, న్యూ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో కలిసి బాగా వర్క్ చేస్తాయి. అంతేకాకుండా ఈ కొత్త బైక్‌లో 4 స్టెప్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను కూడా అందించారు. ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది జారే పరిస్థితులు లేదా తడిగా ఉన్న సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: అల్ట్రావయోలెట్ మ్యాక్ 2 బుకింగ్స్ స్టార్ట్.. ఈ బైక్ రెండు ట్రక్కులను లాగగలదు!


అలాగే హిల్ హోల్డ్ సెటప్ కూడా ఉంది. ఇంకా ఇందులో క్రాష్ అలర్ట్‌లు, పార్క్ అసిస్ట్, ఫైండ్ మై ఆప్షన్, రైడ్ అనలిటిక్స్, ఛార్జ్ లిమిట్, లాక్‌డౌన్, డీప్ స్లీప్/ వెకేషన్ మోడ్ వంటి మరిన్ని టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు ఇందులో ఉన్నాయి. కాగా ఈ బైక్‌లో 10.3 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ అందించారు. దీని కారణంగా ఈ బైక్‌ బ్యాటరీకి ఫుల్‌గా ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 323 కి.మీ మైలేజీ అందిస్తుంది. కాగా ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా అందించారు. దీని ద్వారా 45 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం ఛార్జింగ్ కావడానికి సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే ఈ కొత్త Mach 2 బైక్ 2.8 సెకన్లలో 0 నుంచి 60km/h, 7.7 సెకన్లలో 0 నుంచి 100km/h చేరుకుంటుంది.

ఇక ఈ బైక్ రైడింగ్ విషయానికొస్తే.. అల్ట్రావయలెట్ మాక్ 2 బైక్ సీటింగ్ పొజిషన్ ఇంతక ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్‌గా ఉంది. దీని కొత్త 4వే ట్రాక్షన్ కంట్రోల్ సెటప్‌ అధిక వేగాన్ని అందుకుంటుంది. అలాగే సస్పెన్షన్ సెటప్ ఎప్పటిలాగే చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. కాగా అల్ట్రావయలెట్ ఎఫ్ 77 బైక్ స్టాండర్డ్ వెర్షన్ రూ.2.99 లక్షలు, రీకాన్ వెర్షన్ రూ.3.99 లక్షల ధరలో అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

DMart: డిస్కౌంట్స్ అని డిమార్ట్ కు వెళ్తున్నారా? ఆదమరిస్తే మోసపోవడం పక్కా!

Dmart Offers: డిమార్ట్ సిబ్బంది చెప్పిన సీక్రెట్ టిప్స్.. ఇలా చేస్తే మరింత చౌకగా వస్తువులు కొనేయొచ్చు!

GST Slabs: జీఎస్టీలో సంస్కరణలు.. ఇకపై రెండే స్లాబులు, వాటికి గుడ్ బై

లోన్ క్లియర్ అయ్యిందా..అయితే వెంటనే ఈ డాక్యుమెంట్స్ తీసుకోకపోతే భారీ నష్టం తప్పదు..

బంగారంలో మాత్రమే కాదు ఇకపై ఈ లోహంలో కూడా పుత్తడిని మించిన లాభం రావడం ఖాయం..

ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలని ఉందా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి..

Big Stories

×