Tanveer Ahmed On Ind vs JPN T20 Axar Patel wide controversy: టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. లైవ్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌పై రౌడీయిజం చేశారని టీమిండియా ప్లేయర్లను ఉద్దేశించి సీరియస్ అయ్యారు. లేకపోతే టీమిండియా చిత్తుగా ఓడిపోయేందంటూ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లెక్క ప్రకారం, టీమిండియాపై జపాన్ విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి.
టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ సందర్బంగా వైడ్ వివాదం తెరపైకి వచ్చింది. టీమిండియా విధించిన 32 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో జపాన్ దూకుడుగా ఆడింది. ఇక చివరి ఓవర్ లో 6 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో అక్షర్ పటేల్ బౌలింగ్ కు దిగాడు. అతడు వేసిన 3వ బంతి వైడ్ అయింది. జపాన్ ఆటగాడు అలెగ్జాండర్ షిరాయ్-పాట్‌మోర్ రివర్స్ స్వీప్ ఆడిన క్రమంలో వైడ్ గా ప్రకటించారు అంపైర్. దీనిపై అక్షర్ పటేల్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గొడవకు దిగారు. దీంతో రిప్లై చూసిన అంపైర్….అలెగ్జాండర్ షిరాయ్-పాట్‌మోర్ రివర్స్ స్వీప్ ఆడిన విషయాన్ని గ్రహించి, నాట్ వైడ్ గా ప్రకటించారు. దీంతో టీమిండియా 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే వైడ్ అయి ఉంటే, మ్యాచ్ డ్రా అయ్యేది.
బాపూ అక్షర్ పటేల్ వైడ్ బాల్ వివాదంపైనే తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైవ్ మ్యాచ్‌లో అంపైర్‌పై రౌడీయిజం చేశారు..లేకపోతే టీమిండియా చిత్తుగా ఓడిపోయేందంటూ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పినట్లుగానే జపాన్ పిచ్ లో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారని విమర్శలు చేశారు. జపాన్ సాధారణ బౌలింగ్ చేసినప్పటికీ, టీమిండియా బ్యాటర్లు చెత్తగా, పస లేకుండానే ఆడారని వివరించారు. చివరి ఓవర్ లో టీమిండియా ఓడిపోయే ప్రమాదం ఉందని, వైడ్ డ్రామాలు ఆడినట్లు ఆరోపణలు చేశారు. అంపైర్ పీకపై కత్తి పెట్టి, మరీ.. వైడ్ క్యాన్సిల్ చేయించారని నిప్పులు చెరిగారు. ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే, టీమిండియా ఆగడాలకు బ్రేకులు వేయలేమని తెలిపారు. ఈ అంశంపై తానే స్వయంగా ఐసీసీకి లేఖ కూడా రాస్తానని వార్నింగ్ ఇచ్చారు.
9.3 balls – Umpire gives wide balls.
Axar Patel & Shreyas Iyer – Appeal it's not wide.
Japan batsmen try to hit a big shot while reverse sweep shot.
Rule is when batsmen try to hit a big shot in reverse sweep. It's not a wide ball.
Umpire reverse his decision.…
— VIKAS (@Vikas662005) September 22, 2026