E-Paper
Advertisement

రూ.4,000 పెట్టుబడితో రూ.2.85 లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో మైండ్ బ్లోయింగ్ స్కీమ్!

రూ.4,000 పెట్టుబడితో రూ.2.85 లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో మైండ్ బ్లోయింగ్ స్కీమ్!
Advertisement

Post Office RD Scheme: ఈ రోజుల్లో పొదుపు అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కష్టించి సంపాదించిన డబ్బును.. సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ఇందులో చాలా ముఖ్యం. ఇందుకు పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్వయంగా గ్యారెంటీ ఇవ్వడం వల్ల ఇందులో పెట్టుబడిదారుల సొమ్ముకు పూర్తి భద్రత లభించనుంది. అలాగే ప్రతి నెలా క్రమం తప్పకుండా కొద్ది మొత్తాన్ని దాచుకోవడం ద్వారా ఐదేళ్ల కాలంలో పెద్ద మొత్తాన్ని సొంతం చేసుకోవచ్చు.

నెలకు రూ. 4,000 పొదుపు చేస్తే..

ఒకవేళ మీరు ఈ పథకంలో నెలకు రూ. 4,000 చొప్పున ఐదేళ్ల పాటు (60 నెలలు) జమ చేస్తే.. పెట్టుబడి రూ. 2.40 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ఈ పథకంపై లభిస్తున్న 6.7 శాతం వడ్డీ రేటు ప్రకారం.. ఐదేళ్ల కాలంలో దాదాపు రూ. 45,463 రాబడి రానుంది. అంటే స్కీమ్ కాలవ్యవధి పూర్తయ్యేసరికి సుమారు రూ. 2,85,463 సొమ్మును పెట్టుబడిదారులు పొందొచ్చు. రోజుకు కేవలం రూ. 133 చొప్పున పక్కన పెట్టి ఐదేళ్ల కాలంలో ఈ భారీ మెుత్తాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. కాబట్టి ఖాతా తెరిచే సమయంలో వడ్డీరేటును ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే బెటర్.

ముందస్తు విత్ డ్రా సౌకర్యం

Advertisement

ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతాలో ఒకసారి పెట్టుబడి పెట్టడం ప్రారభించిన తర్వాత.. అవసరమైన సమయాల్లో విత్ డ్రా సైతం చేసుకోవచ్చు. అయితే  ఇందుకు కనీసం 12 నెలల పాటు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ వ్యవధి పూర్తైన తర్వాత డిపాజిటర్లు తమ ఖాతాలో ఉన్న మొత్తంలో 50 శాతం వరకు రుణంగా పొందే వెసులుబాటు లభిస్తుంది. అయితే ఈ రుణంపై ఆర్డీ వడ్డీ రేటు కంటే 2 శాతం అదనపు వడ్డీ వసూలు చేస్తారు. ఈ అప్పును ఒకేసారి లేదా వాయిదా పద్దతుల్లో చెల్లించవచ్చు. అలాగే ఖాతా తెరిచిన మూడేళ్ల తర్వాత పెట్టుబడి మెుత్తాన్ని విత్ డ్రా చేసుకునే వెసులుబాటును సైతం పోస్టాఫీస్ కల్పిస్తోంది. అయితే ఆ సమయంలో సాధారణ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు మాత్రమే చెల్లించనున్నారు.

Also Read: Airtel యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. రూపాయి ఖర్చు లేకుండా యాపిల్ టీవీ+, iCloud ఫ్రీ!

ఈ పథకం ఎవరికి అనుకూలం?

Advertisement

ఒకేసారి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టలేక ప్రతి నెలా కొద్ది మెుత్తంలో పొదుపు చేయాలని భావించే మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లల చదువులు, వివాహ ఖర్చులు, భవిష్యత్తులో చేయబోయే పెద్ద కొనుగోళ్ల కోసం ప్రణాళికాబద్ధంగా డబ్బు దాచుకోవాలనుకునే వారికి ఇది సురక్షితమైన మార్గంగా నిలుస్తుంది.

గమనిక: ఈ కథనం మీ అవగాహన కోసం మాత్రమే. ప్రభుత్వం కాలానుగుణంగా వడ్డీ రేట్లు, ఉపసంహరణ నిబంధనలలో మార్పులు చేస్తూ ఉంటుంది. పొదుపు ప్రారంభించే ముందు అధికారిక వర్గాల ద్వారా తాజా వివరాలను సరిచూసుకుంటే మంచిది.

Also Read: ఏడాదంతా ఫ్రీ కాల్స్, 5G డేటా.. Airtel, Jio, Viలో బెస్ట్ ప్లాన్స్ ఇవే.. ఎంజాయ్ పండగో!

Tags

Related News

యుపిఐ ఎండిఆర్ తప్పుడు నిర్ణయం, మళ్లీ క్యాష్ వైపు దేశం.. మాజీ నీతి ఆయోగ్ చీఫ్ వార్నింగ్

మీ ముఖాన్ని అద్దెకు ఇస్తారా? కొత్త పార్ట్ టైమ్ బిజినెస్ గురూ

అక్టోబర్ ఒకటి నుండి FDలపై కొత్త రూల్స్.. ఎక్కడైనా ఒకటే వడ్డీ, బల్స్ అయితే ఆ రూటే వేరు

40 ఏళ్ల వయసులో రూ.80 లక్షలు సేవింగ్స్.. రూ.1 లక్ష నెలజీతంతో ఇలా సాధ్యం

మహిళలకు తీపికబురు.. దిగొస్తున్న బంగారం ధర, ఇవాళ మార్కెట్లో ఎలా ఉన్నాయి?

IIM MBA విద్యార్థి దుస్థితి.. 250పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు

బ్రాండెడ్ vs జనరిక్.. తక్కువ ధరకే లభించే జనరిక్ మందులు.. నిజంగా పనిచేస్తాయా?

Big Stories

Advertisement
×