Actor Sivaji: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారిలో సీనియర్ నటుడు శివాజీ (Sivaji) ఒకరు. ఆర్టిస్ట్ గా విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు . ఇకపోతే గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శివాజీ ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరోసారి ఫామ్ లోకి వచ్చారు. బిగ్ బాస్ అనంతరం ఈయన పెద్ద ఎత్తున సినిమాలలోను వెబ్ సిరీస్ లలోను నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా శివాజీ తెల్ల కాగితం (Tellakagitham ) ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన వేదికపై మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఒక సినిమా కోసం కొంతమంది నటీనటులను ఎంపిక చేసుకోగా వారు ఆ పాత్రలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే అవి సూపర్ సక్సెస్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా శివాజీ వదులుకున్న ఒక సినిమా మంచి సక్సెస్ అయిందని తాజాగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి శివాజీ వదులుకున్న ఆ సూపర్ హిట్ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..
పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప (Pushpa)సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాలో నటించిన నటీనటులకు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమాలో తనకు మంగళం శీను(Mangalam Seenu) క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చిందని అయితే కొన్ని కారణాల వల్ల తాను వదులుకున్నానని శివాజీ ఈ సందర్భంగా తెలియజేశారు.
మంగళం శీను పాత్ర ఆయనకు రాసిపెట్టి ఉంటే మనకెలా వస్తుంది ఏదైనా రాసిపెట్టి ఉండాలని మనకు ఆ పాత్ర రాసి పెట్టలేదు అంటూ శివాజీ ఈ సందర్భంగా మంగళం శీను పాత్ర మిస్ చేసుకున్న విషయాన్ని తెలియజేయడంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది తెలిసిన అభిమానులు మంగళం శీను పాత్రలో మీరు నటించి ఉంటే మరో లెవల్లో ఉండేది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మంచి సినిమాని మిస్ చేసుకున్నారు అంటూ శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ఇక ఈయన ఇటీవల కోర్టు సినిమాలో మంగపతి పాత్ర ద్వారా విలన్ గా ప్రేక్షకు ముందుకు వచ్చారు. మంగళం శీను పాత్ర మిస్ అయిన మంగపతి పాత్ర మాత్రం ఈయనకు చాలా మంచి గుర్తింపును తీసుకువచ్చిందని చెప్పాలి. ఇక ఇటీవల శివాజీ నటించిన ఎపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ తండ్రిగా శివాజీ నటించారు.
Also Read: తాతయ్యకు అదిరిపోయే కానుక ఇచ్చిన ఉపాసన.. వెల్లువిరిసిన ఆధ్యాత్మికత!