BigTV English

Vidhi Shanghvi: 4 లక్షల కోట్ల ఫార్మా సామ్రాజ్యానికి వారసురాలు, ఇంతకీ ఎవరీ విధి శాంఘ్వీ?

Vidhi Shanghvi: 4 లక్షల కోట్ల ఫార్మా సామ్రాజ్యానికి వారసురాలు, ఇంతకీ ఎవరీ విధి శాంఘ్వీ?

 Vidhi Shanghvi Sun Pharma: విధి శాంఘ్వీ.. భారతీయ మేటి యువ పారిశ్రామికవేత్తలలో ఒకరుగా కొనసాగుతున్నది. దేశంలోని అత్యంత సంపన్నమైన హెల్త్‌ కేర్ బిలియనీర్ దిలీప్ షాంఘ్వీ కుమార్తె విధి షాంఘ్వీ. తన సోదరుడు అలోక్ శాంఘ్వీతో కలిసి ఆమె తండ్రి రూ. 4.35 లక్షల కోట్ల హెల్త్ కేర్ సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిస్తున్నది. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్‌ గా తండ్రిబాటలో సాగుతున్నది. షాంఘ్వీ కన్స్యూమర్ హెల్త్‌ కేర్, న్యూట్రిషన్ అండ్ ఇండియా డిస్ట్రిబ్యూషన్‌కు హెడ్ గా కొనసాగుతున్నది. గత దశాబ్ద కాలంగా కంపెనీకి సంబంధించిన వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నది.


విధి శాంఘ్వీ గురించి..

సన్ ఫార్మా సంస్థ అధినేత దిలీప్ షాంఘ్వీ కుమార్తె విధి శాంఘ్వీ. ఆమె ప్రతిష్టాత్మకమైన వార్టన్ స్కూల్ ఆఫ్ యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సన్ ఫార్మా కంపెనీ స్థాపించిన క్లినికల్ స్టేజ్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ సన్ ఫార్మా అడ్వాన్స్‌ డ్ రీసెర్చ్ కంపెనీ లిమిటెడ్(SPARC)లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నారు. తన తండ్రి స్థాపించిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.


ప్రపంచంలో నాలుగో అతిపెద్ద జెనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ   

దిలీప్ షాంఘ్వీ స్థాపించిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద స్పెషాలిటీ జెనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా కొనసాగుతోంది. దీని నికర విలువ రూ. 4.35 లక్షల కోట్లు. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో మంచి క్వాలిటీ కలిగిన సరసమైన ఔషధాలను అందిస్తున్నది.

ముఖేష్ అంబానీతో విధికి అనుబంధం

విధి శాంఘ్వీ గోవా పారిశ్రామికవేత్తలు శివ్, రంజన సల్గావ్కర్‌ కుమారుడు వివేక్ సల్గావ్కర్‌ ను పెళ్లి చేసుకున్నది.   ముఖేష్ అంబానీ సోదరీ దీప్తి సల్గావ్కర్ తో రంజనా సల్గావ్కర్ కు బంధుత్వం ఉంది. రెండు వ్యాపార కుటుంబాల మధ్య బంధుత్వం ఉంది. విధి శాంఘ్వీ తమ వ్యాపార విస్తరణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖేష్ అంబానీని కలిసి ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు తీసుకుంటుందనే ప్రచారం ఉంది. ఆయన ఇచ్చిన సూచనలను విధి కచ్చితంగా తమ వ్యాపార విస్తరణలో ఉపయోగించుకుంటుంది అంటారు ఆమె సన్నిహితులు. మొత్తంగా ఆమె తీసుకునే నిర్ణయాలు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీను ప్రగతిపథంలో నడిచేలా ఉపయోగపడుతున్నాయంటున్నారు.

గూగుల్ ట్రెండ్స్ లో విధి శాంఘ్వీ

ఇక విధి శాంఘ్వీ గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో ఉన్నట్లు గూగుల్ వెల్లడించింది. విధి శాంఘ్వీ సన్ ఫార్మా అనే పదం సుమారు 10 వేల కంటే ఎక్కువ సెర్చింగ్ వర్డ్స్ లో టాప్ 11లో ఉన్నట్లు గూగుల్ తెలిపింది. భారత్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల్లో విధి శాంఘ్వీ ఒకటిగా తేల్చింది. సన్ ఫార్మాను ముందుకు నడిపించడంతో పాటు సోషల్ మీడియాలో ఈ యువ బిజినెస్ వుమెన్ ట్రెండ్ కావడం విశేషం.

Read Also: మీ పాన్ నెంబర్ ను ఎన్ని రకాలుగా దుర్వినియోగం చేస్తారో తెలుసా? జాగ్రత్త.. లేకపోతే!

Related News

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

BSNL Sim Post Office: పోస్టాఫీసులో BSNL సిమ్.. ఇక గ్రామాలకూ విస్తరించనున్న సేవలు

Big Stories

×