Actor Sharwanand : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో శర్వానంద్ ఒకడు. ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తను కూడా హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకొని మంచి సూపర్ హిట్ ఫిలిమ్స్ చేశాడు. శర్వానంద్ కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకొని తనకంటూ ఒక మంచి గుర్తింపును సాధించుకున్నాడు.
ఇకపోతే కేవలం నటుడు గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా సినిమాను చేశాడు శర్వా. అయితే ఆ సందర్భంలో శర్వా తన మనీ అంతటినీ కోల్పోయాడు. అయితే దాన్నుంచి తేరుకోవడానికి శర్వానంద్ కి దాదాపు ఆరేళ్లు పట్టింది. ఆరేళ్లు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు శర్వానంద్. ఇండస్ట్రీలో శర్వానంద్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకటి రానా, రెండు రామ్ చరణ్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ కి శర్వానంద్ కి మధ్య ఉండే బాండింగ్ వేరే లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. రామ్ చరణ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ వలనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక యాడ్లో కూడా అప్పట్లో నటించాడు శర్వానంద్.
ఇకపోతే శర్వానంద్ రీసెంట్ టైమ్స్ లో “ఒకే ఒక జీవితం” అనే సినిమాతో మంచి సూపర్ హిట్ ను అందుకున్నాడు. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఆ సినిమా విమర్శకులు ప్రశంసలు అందుకోవటంతో పాటు కమర్షియల్ గా కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేసిన మనమే సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఒక సందర్భంలో యంగ్ హీరోస్ అంతా ఒకేసారి పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. రానా నుంచి మొదలుపెడితే నిఖిల్, నితిన్ వంటి హీరోలందరూ కూడా కరోనా టైంలోనే చాలా తక్కువ మంది సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్నారు.
Also Read : Horror Movies In Youtube : భయంకరమైన హారర్ సినిమాలు.. ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి..
ఇకపోతే రీసెంట్ గా శర్వానంద్ కూడా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడైన సంగతి తెలిసిందే. రక్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శర్వానంద్. ఇకపోతే శర్వానంద్ పుట్టినరోజు నాడే తనకి కూడా ఒక కూతురు పుట్టింది. తనకు లీలాదేవి అని పేరును పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం లీలాదేవి తోపాటు తన కుటుంబ సభ్యులు అంతా కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టిటిడి టెంపుల్ వద్ద భోజనాలు పెట్టారు. కేవలం భోజనాలు పెట్టడం మాత్రమే కాకుండా శర్వానంద్ స్వయంగా అక్కడ వడ్డించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మామూలుగా కొంతమంది హీరోలకి నెగిటివ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. వాళ్లు కొన్ని సందర్భాల్లో ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ శర్వానంద్ విషయానికి వస్తే అందరి హీరోల అభిమానులు శర్వాను ఇష్టపడతారు. దీనికి శర్వా వ్యక్తిత్వం కూడా కొంతమేరకు కారణమని చెప్పొచ్చు.
Also Read : Rajamouli: జక్కన్న డైరెక్షన్లో సినిమా చేసినా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిన హీరోలు వీళ్లే..!