BigTV English

Voice Command Ticket Booking: వాయిస్ కమాండ్‌తో రైలు టికెట్ బుకింగ్.. ఎలా పనిచేస్తుందంటే..

Voice Command Ticket Booking: వాయిస్ కమాండ్‌తో రైలు టికెట్ బుకింగ్.. ఎలా పనిచేస్తుందంటే..

Voice Command Train Ticket Booking| దూరప్రయాణాలకు రైలు టికెట్ బుక్ చేసుకోవాలంటే వెబ్ సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి, అందులో తేదీ, ఏ ట్రైన్, ఎక్కడి వెళ్లాలి, ఏ స్టేషన్ నుంచి బోర్డింగ్ చేయాలి. ఎక్కడ దిగాలి అన్నీ వివరాలు నింపాలి. చివర్లో టికెట్ పేమెంట్ కోసం డెబిట్ కార్టు లేదా యూపిఐ పేమెంట్ కోసం అదొక ప్రక్రియ. ఈ ప్రక్రియ నంతా యూజర్లు టైప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడా సమస్య లేకుండా వాయిస్ కమాండ్ తో రైలు టికెట్ బుకింగ్, టికెట్ పేమెంట్ జరిగిపోతుంది.


దేశంలో యూపిఐ టెక్నాలజీని నియంత్రిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ), ఇండియన్ రైల్వేస్, కో రోవర్ అనే టెక్నాలజీ కంపెనీ.. ఈ మూడు సంస్థలు కలిసి ముంబై లో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ 2024 లో రైలు టికెట్ బుకింగ్ కోసం వాయిస్ తో యూపిఐ పేమెంట్ చేసేవిధంగా ఒక ఫీచర్ లాంచ్ చేశారు. దీన్ని కన్వర్జేషనల్ వాయిస్ పేమెంట్స్ అని అంటారు. రైలు టికెట్ బుకింగ్ చేసుకునే యూజర్ తన యుపిఐ ఐడి, లేదా మొబైల్ నెంబర్ ని వాయిస్ తో చెప్పి టికెట్ పేమెంట్ సులువుగా పూర్తి చేయవచ్చు. ఈ సిస్టమ్ మొబైల్ నెంబర్ తో డిఫాల్ట్ గా లింక్ ఉన్న యుపిఐ ఐడిని కనెక్ట్ చేసి సంబంధిత యూపిఐ యాప్ పేమెంట్ ప్రారంభిస్తుంది.

Also Read:  మీ దగ్గర టికెట్ ఉన్నా ట్రైన్‌లో నుంచి టీటీ దింపేయొచ్చు.. ఎందుకో తెలుసా?


కన్వర్జేషనల్ వాయిస్ పేమెంట్ ఎలా పనిచేస్తుందంటే..
ఈ కొత్త వాయిస్ కమాండ్ ఫీచర్ ఐఆర్‌సిటిసి లోని ఏఐ అసిస్టెంట్ ఆస్క్ దిశతో లింక్ అయి ఉంటుంది. యూజర్లు టికెట్ బుక్ చేసుకోవడం, పేమెంట్ చేసే సమయంలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి వాయిస్ కమాండ్ టికెట్ బుకింగ్ ఏఐ ఫీచర్ ఇది. యూజర్లకు టికెట్ బుకింగ్ సమయంలో ఒక ఫ్రెండ్లే అనుభూతినిస్తుంది. పైగా లావాదేవీ కూడా చాలా త్వరగా పూర్తవుతుంది.

కోరోవర్ కంపెనీ భారత్ జిపిటి కనుగొన్న ఈ ఏఐ టెక్నాలజీ వాయిస్ అసిస్టెంట్ హిందీ, గుజరాతీ, సహా ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి ఉంటుంది. యూపిఐ పేమెంట్ తోపాటు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, ఇలా అన్ని రకాల పేమెంట్స్ కూడా ఈ వాయిస్ ఫీచర్ ద్వారా పూర్తిచేయొచ్చు.

Also Read: మీ IRCTC అకౌంట్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి టికెట్స్ బుక్ చేస్తే జైలుకు వెళ్తారా? నిజం ఏమిటి?

ఎన్‌పిసిఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విశాల్ ఆనంద్ మాట్లాడుతూ.. ”డిజిటల్ పేమెంట్స్ రంగంలో పౌరులకు మరింత సులువైన పద్ధతిగా వాయిస్ కమాండ్ బుకింగ్ ఉపయోగపడుతుంది. నిజానికి 2023లోనే యూపిఐ 123 పేరుతో ఈ వాయిస్ కమాండ్ టెక్నా లజీని తీసుకొచ్చాం. కానీ పూర్తిస్థాయి వినియోగం ఈ సంవత్సరం నుంచే మొదలవుతుంది” అని అన్నారు.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×