BigTV English

Vivek Oberoi: కోట్లలో కలెక్షన్స్ వస్తేనే హిట్, ఓపెన్‌గా చెప్పుకునే స్వేచ్ఛ లేదు.. బాలీవుడ్ హీరో హాట్ కామెంట్స్

Vivek Oberoi: కోట్లలో కలెక్షన్స్ వస్తేనే హిట్, ఓపెన్‌గా చెప్పుకునే స్వేచ్ఛ లేదు.. బాలీవుడ్ హీరో హాట్ కామెంట్స్

Vivek Oberoi: ఈరోజుల్లో ఒక సినిమా విడుదల అవ్వగానే అది ఎంతమంది ప్రేక్షకులకు నచ్చింది అనే విషయాన్ని పక్కన పెడితే.. తరువాతి రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేదానిపైనే ఫోకస్ పెరిగింది. కలెక్షన్స్ పరంగానే సినిమాలు హిట్టా కాదా అని డిసైడ్ చేసేస్తున్నారు. దాని వల్ల ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ కూడా పెరిగింది. ఒక మూవీ విడుదలయిన తరువాతి రోజే అది రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించింది అంటూ పోస్టర్లు విడుదల అవుతున్నాయి. ఒకప్పుడు ఈ కలెక్షన్స్‌ను ప్రేక్షకులు నమ్మినా కూడా ఇప్పుడు అవి ఫేక్ అనే విషయం వారికే క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్‌పై ఒక బాలీవుడ్ హీరో కూడా స్పందించాడు. తనే వివేక్ ఓబ్రాయ్.


అలాంటి సినిమాలు లేవు

‘కంపెనీ’, ‘సాథియా’ లాంటి సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు వివేక్ ఓబ్రాయ్ (Vivek Oberoi). ప్రస్తుతం తను వెండితెరపై యాక్టివ్‌గా లేకపోయినా ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా బిజీ అయిపోయాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ ఓబ్రాయ్.. ఈ కలెక్షన్స్ ట్రెండ్‌పై స్పందించాడు. దీనిపై తన అభిప్రాయం ఏంటో మొదటిసారి బయటపెట్టాడు. తను హీరోగా నటించిన ‘సాథియా’ మూవీ విడుదలయ్యి 22 ఏళ్లు అయ్యింది. ఈరోజుల్లో అలాంటి సినిమాలు రావడం లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు వివేక్. అంతే కాకుండా కలెక్షన్స్ వల్లే మూవీ హిట్ అని డిసైడ్ అవ్వడంపై కూడా మాట్లాడాడు.


Also Read: కంగనా ‘ఎమర్జెన్సీ’కి మరో ఎదురుదెబ్బ.. ఆ దేశంలో రిలీజ్ బ్యాన్, ఎందుకంటే.?

ప్యాషన్ పోయింది

‘‘మన అమ్మ, అమ్మమ్మతో సినిమాల గురించి మాట్లాడితే అది వారికి ఒక ఎమోషన్. వాళ్లు ఒక సినిమాను గుర్తుచేసుకొని, అది వారికి ఇష్టమని, దాంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు. సక్సెస్ అంటే అదే అని నేను భావిస్తాను. మిగతావన్నీ కేవలం లెక్కలు. ఈరోజుల్లో మనం ఎక్కువగా సోషల్ మీడియా స్క్రోల్ చేయడంలో బిజీ అయిపోయాం. రూ.100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు సాధించడం వల్ల సినిమా హిట్ అని చెప్పే ఇతరుల అభిప్రాయాలు వింటున్నాం. దానివల్ల ప్యాషన్ అనేది పూర్తిగా పోయింది’’ అని ఓపెన్‌గా కామెంట్స్ చేశాడు వివేక్ ఓబ్రాయ్. వివేక్ చెప్పేది నిజమే అని బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. సౌత్ ప్రేక్షకులు సైతం ఫీలవుతున్నారు.

నిజాన్ని చెప్పలేం

‘‘ఈరోజుల్లో ఒక సినిమా గురించి ప్రేక్షకులు తమ ఒపీనియన్ చెప్పడం కూడా కష్టమయిపోయింది. ఉదాహరణకు ఒక సినిమా చూసి అది నాకు నచ్చలేదు అని చెప్తే.. దానికి రూ.500 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అదెలా నచ్చలేదు? అని ప్రేక్షకులు ఎదురుప్రశ్నలు వేస్తున్నారు. సినిమాల్లో క్రియేటివిటీ, దానికి జరిగే బిజినెస్.. ఈ రెండు అంశాలు విడదీయలేనంతగా ఒక్కటయిపోయాయి. అభిప్రాయాలు అనేవి ముఖ్యంగా కాదు. బాక్సాఫీస్ కలెక్షన్స్ వల్లే ఆ సినిమా ఎంత బాగుందో అనేది నిర్ణయించబడుతుంది. లాపతా లేడీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో నాకు తెలియదు కానీ నాకు ఆ సినిమా నచ్చింది’’ అంటూ నిజాయితీగా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు వివేక్ ఓబ్రాయ్.

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×