E-Paper
Advertisement

ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే మీరు చేయాల్సిన పనులు ఇవే!

ఏటీఎం కార్డు పోయిందా? వెంటనే మీరు చేయాల్సిన  పనులు ఇవే!
Advertisement

ATM card:  రోజూవారీ జీవితంలో డెబిట్ లేదా ఏటీఎం కార్డుల వాడకం ఎంత పెరిగిందో, వాటి ద్వారా మోసాలు జరిగే ప్రమాదం కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. మీ ఏటీఎం కార్డ్ పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా లేదా సైబర్ మోసం జరిగిందని గుర్తించినా మనం చేసే మొదటి పని కస్టమర్ కేర్‌కు కాల్ చేసి లేదా బ్యాంకింగ్ యాప్ ద్వారా కార్డును బ్లాక్ చేయడం. కార్డు బ్లాక్ చేయడం వల్ల హ్యాకర్లు నేరుగా కొత్త ట్రాన్ాసక్షన్స్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ.. చాలా మంది ఇక్కడితో అంతా సేఫ్ గా ఉందని భావించి పెద్ద పొరపాటు చేస్తారు. కార్డును బ్లాక్ చేసిన తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు మీ అకౌంట్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి, అకౌంట్ సేఫ్టీ కోసం మీరు వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఆటో-డెబిట్, యూపీఐ లింక్‌:

చాలా మంది తమ ఏటీఎం/డెబిట్ కార్డులను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, వివిధ యూపీఐ యాప్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంలకు డబ్బు పంపించడానికి ఆటో-డెబిట్ సేవలకు లింక్ చేసి ఉంచుతారు. మీరు కేవలం కార్డ్ పోయినప్పుడు డెబిట్ కార్డును మాత్రమే బ్లాక్ చేసి ఉంటారు. కానీ ఈ ఆటోమేటిక్ సబ్‌స్క్రిప్షన్లు లేదా థర్డ్-పార్టీ యాప్స్‌లో సేవ్ అయిన కార్డ్ వివరాలు అలాగే ఉండిపోతాయి. కాబట్టి.. వెంటనే మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లోకి వెళ్లి ఏయే యాప్స్‌కు మీ కార్డ్ లింక్ అయి ఉందో చెక్ చేసి వాటిని తొలగించాలి. లేదంటే మీ కార్డ్ బ్లాక్ అయినా సబ్స్క్రిప్షన్ల ద్వారా డబ్బులు కట్ అయ్యే ప్రమాదం ఉంది.

2. అధికారులకు కంప్లైంట్:

Advertisement

ఫోన్ కాల్ ద్వారా లేదా యాప్ ద్వారా కార్డ్ బ్లాక్ చేయడం అనేది మంచి పనే. దీని తర్వాత మీరు మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి లేదా అధికారిక ఈమెయిల్ ద్వారా మీ కార్డు ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఒక కంప్లైంట్ రాసి ఇవ్వాలి. ఒక వేళ మీ కార్డ్ పోయి ఉంటే ఎఫ్ఐఆర్ కాపీ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in) లో కంప్లైంట్ చేసిన రిఫరెన్స్ నంబర్‌ను బ్యాంకుకు ఇవ్వడం చాలా ముఖ్యం. ఇది భవిష్యత్తులో జరిగే సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

Also Read: డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

3. మొబైల్ బ్యాంకింగ్ :

Advertisement

మీ ఏటీఎం కార్డు పోయిందంటే.. కేవలం ప్లాస్టిక్ కార్డు మాత్రమే కాదు, మీ అకౌంట్‌కు సంబంధించిన పర్సనల్ డేటా సమాచారం కూడా ఎవరి చేతికో చిక్కి ఉండే.. అవకాశం ఉంది. ముఖ్యంగా పిన్ నంబర్ లేదా యూజర్ ఐడీ వంటి వివరాలు రిస్క్‌లో పడొచ్చు. దీనిని నివారించడానికి.. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పాస్‌వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్ , మొబైల్ బ్యాంకింగ్ ఎం-పిన్ లను వెంటనే మార్చుకోవాలి. అలాగే.. మీ జీమెయిల్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ సెక్యూరిటీని కూడా ఒకసారి చెక్ చేయడం మంచిది.

4. బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ :

కార్డును బ్లాక్ చేయడానికి ముందు లేదా కొద్ది రోజుల క్రితం మీ అకౌంట్ నుంచి ఎలాంటి అనధికారిక ట్రాన్సాక్షన్స్ జరిగాయో లేదో చెక్ చేయడానికి పూర్తి అకౌంట్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తరచూ చిన్న మొత్తంలో డబ్బులు కట్ అవుతున్నాయా లేదా అని గమనించాలి. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే, దానిని వెంటనే బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. అనధికార ట్రాన్సాక్షన్స్ జరిగిన 3 రోజుల్లోగా బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Related News

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి చేస్తున్న పసిబిడ్డ.. ప్రపంచంలోనే అతిపిన్న వయసు ఇన్వెస్టర్

ఆటో డ్రైవర్ పిల్లల స్కూల్ ఫీజు రూ.1.5 లక్షలు.. భార్య ఎలా సాయం చేస్తోందంటే

రూ.92 లక్షల ట్యాక్స్ చెల్లించాను.. ఇప్పుడు ఉద్యోగం ఊడింది.. దిక్కుతోచని స్థితిలో టెకీ

నెలకు రూ.2,000 SIP పెట్టబడితో రూ.10 లక్షల కార్పస్.. ఇలా చేస్తే సాధ్యమే?

తగ్గేది లేదంటున్న పసిడి, మదుపరుల చూపుతో పైపైకి పరుగులు, మార్కెట్లో ధరల మాటేంటి?

ఇండియన్ ఐటీ కంపెనీలపై అమెరికా కొరడా.. గ్రీన్ కార్డ్ PERM ప్రాసెస్ నిలిపివేత! టెక్కీలకు కోలుకోలేని దెబ్బ

యూపీఐ లావాదేవీల వ్యవహారం.. సంక్రాంతి తర్వాతే అంటున్న ట్రేడర్లు, ఆలోచనలో ఎన్‌పీసీఐ

Big Stories

Advertisement
×