Mental Health: ఉరుకుల పరుగుల జీవితం చదువుల ఒత్తిడి.. ఉద్యోగ బాధ్యతలు.. ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ సమస్యలు కారణం ఏదైనా మనశ్శాంతిని దూరం చేస్తున్నాయి. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా. లోలోపల ఎంతోమంది ఆందోళనతో సతమతమవుతున్నారు. నిద్ర సరిగా పట్టకపోవడం చిన్న విషయాలకే చిరాకు రావడం ఎప్పుడూ దిగులుగా ఉండటం ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించకపోవడం ఇలాంటి మార్పులను తేలిగ్గా తీసుకోకూడదు. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగితే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మానసిక సమస్యలు రావడం బలహీనత కాదు. వాటి గురించి మాట్లాడటం తప్పు అంతకంటే కాదు. మనసులోని బాధను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం తగినంత నిద్రపోవడం రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం ఒత్తిడిని తగ్గించడంలో సాయపడతాయి. ముఖ్యంగా పిల్లలు, యువత ఎదుర్కొంటున్న ఒత్తిడిని కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి. వాళ్లను తిట్టడం, ఇతరులతో పోల్చడం కాకుండా.. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి.
గుర్తుంచుకోండి.. ఆరోగ్యంగా ఉండటమంటే శరీరం మాత్రమే కాదు.. మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. మనసు బాగుంటేనే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యంపై మాట్లాడుదాం మనవాళ్లకు అండగా నిలుద్దాం.
Also read: ఎల్‌నినో ఎఫెక్ట్.. రాష్ట్రంలో కరువు ఛాయలు.. ఈనెల 12న మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ!