E-Paper
Advertisement

రేపు 10 గంటలపాటు రైళ్లు బంద్, 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

రేపు 10 గంటలపాటు రైళ్లు బంద్, 57 మెట్రో స్టేషన్లు మూసివేత!
Advertisement

ఢిల్లీలో అక్టోబర్ 10న జరగనున్న సీజేపీ ఆందోళనల నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు రాకపోకలు సాగించే అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

సెంట్రల్ ఢిల్లీలో భారీ రోడ్డు ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ తెలిపారు. గత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని.. ఈ సారి ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టమన్నారు.

57 మెట్రో స్టేషన్ల మూసివేత

Advertisement

ఈ నిరసనల సమయంలో సున్నితమైన ప్రాంతాలకు ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చే ప్రమాదం ఉందని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 9:00 గంటల నుంచి శనివారం వరకు దాదాపు 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను (DMRC) జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాన్స్‌పోర్ట్) రజ్నీష్ గుప్తా కోరారు. పరిస్థితులను బట్టి ఆయా స్టేషన్ల గుండా వెళ్లే మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని కూడా తగ్గించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా జన్‌పథ్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, మండి హౌస్, సుప్రీం కోర్ట్, కశ్మీర్ గేట్, చాందినీ చౌక్, ఐఎన్ఏ, హౌజ్ ఖాస్ వంటి ముఖ్యమైన మెట్రో స్టేషన్లు మూసివేయనున్నారు.

Also Read: ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

Tags

Related News

భయంకర పాము ఆకారంలో గుహ.. ఎక్కడుందో తెలుసా?

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?

బస్ డిపోకు వెళ్లాల్సిన పనిలేదు.. మీ కాలనీ నుంచే దసరా స్పెషల్ బస్సులు!

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

Big Stories

Advertisement
×