BigTV English

Telangana in Top: ఫ్యామిలీ ప్లానింగ్‌లో తెలంగాణే టాప్.. వామ్మో, అన్ని కండోమ్‌లు వాడేశారా!

Telangana in Top: ఫ్యామిలీ ప్లానింగ్‌లో తెలంగాణే టాప్.. వామ్మో, అన్ని కండోమ్‌లు వాడేశారా!

Telangana in Top: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ పద్దతులను.. దక్షిణాది రాష్ట్రాలు విరివిగా ప్రచారం చేశాయి. ఈ ప్రభావంతో ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. తాజాగా ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు.. సోషియో ఎకానమి సర్వేలో వెల్లడైంది. గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ హెల్త్ సెమినార్ సదస్సులో భాగంగా.. నాన్ కమ్యనిటీ డిసీజెస్ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలపై ప్రశంసలు లభించినట్లు.. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే చాలామంది కుటుంబ నియంత్రణ కోసం ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఆపరేషన్లకంటే.. కండోమ్ లను ఎక్కువగా ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడైంది. ఫ్యామిలీ ప్లానింగ్ గణాంకాలను ప్రభుత్వం 2024-25 సోషియో ఎకానమీ బుక్ లెట్‌లో పొందుపరిచింది.


తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ పద్దతులపై వైధ్య ఆరోగ్య శాఖ అధికారులు.. నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. కనీసం వారంలో ఒకరోజు ఆరోగ్య స్థాయి కేంద్రపరిధిలోని జంటలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారికి ఎంత మందిని పిల్లలు కనాలి..? మొదటి బిడ్డకు.. రెండో బిడ్డకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి. సంతోనోత్పత్తి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి పరిస్థితులపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల పరిధిలో సుమారు ఎనిమిది వేల మంది ఏఎన్ఎంలు, ముప్ఫై ఏడు వేల మంది ఆశావర్కర్లు చొరవ తీసుకుని.. కుటుంబ నియంత్రణ ప్రక్రియలో భాగంగా.. ఎంతో శ్రద్ధతో పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఆదేశాలమేరకు సమర్ధవంతంగా కృషి చేస్తున్నారని వెల్లడించారు.

ఇక ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవానుకునే జంటలకు మెడికల్ ఆఫీసర్ స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రెండు, మూడు సార్లు చర్చించుకున్న తర్వాత.. కుటుంబ సభ్యుల సమ్మతంతో.. వారికి ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఎక్స్ పీరియన్స్ ఉన్న స్టాఫ్‌తో సర్జరీలు చేపిస్తున్నారు. అయితే సర్జిరీ చేసిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహరం తీసుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.


Also Read: రాయితో బెదిరించాడు.. అందుకే చూపించా.. పేపర్ లీక్‌లో బిగ్ ట్విస్ట్

ఇక ఫ్యామిలీ ప్లానింగ్‌లో భాగంగా.. 1,35,713 మంది కండోమ్‌లను ఉపయోగిస్తున్నట్లు.. సోషియో ఎకానమి సర్వేలో వెల్లడైంది. దీంతో పాటు మరో 1,10,016 మంది పిల్స్, మరో 13,676 మంది అంత్రా ఇంజెక్షన్స్ వాడినట్లు పేర్కొన్నారు. అందులో 67,464 మంది మహిళలు ట్యూబెక్టమీ, 1006 మంది మగవారు వ్యాసెక్టమీ స్టెరిలైజేషన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలసీలు, నిర్ణయాల వల్ల మొత్తంగా.. సంతానోత్పత్తి రేటు తగ్గినట్లు సోషియో ఎకానమి సర్వేలో పేర్కొంది. ఒక స్త్రీ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లల్ని కంటున్నారనేది టీ ఎఫ్ ఆర్‌లో లెక్కిస్తారు. జాతీయ స్థాయిలో చూస్తే.. టీ ఎఫ్​ ఆర్ 2.0 ఉండగా, తెలంగాణ లో 1.5 ఉన్నట్లు శాంపిల్ రీసెర్చ్ సర్వే 2020 రిపోర్టు ప్రకారం తెలిసింది. గవర్నెమెంట్ ఆస్పత్రిలో డెలివరీలు పెరగడం, ఆరోగ్యానికి సంబంధించి కార్యక్రమాలు పరిపూర్ణంగా చేయడంతోనే.. ఇది సాధ్యమైందని  సోషియో ఎకానమీ సర్వేలో వెల్లడించింది.

 

 

Tags

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×