E-Paper
Advertisement

బంగారంలో అసలు పసుపు రంగే ఉండదా? మరి ఈ దగదగ మెరుపు వెనుక రహస్యం ఏంటి?

బంగారంలో అసలు పసుపు రంగే ఉండదా? మరి ఈ దగదగ మెరుపు వెనుక రహస్యం ఏంటి?
Advertisement

Gold Color Mystery: మన చుట్టూ ఉండే లోహాల్లో చాలా వరకు ఒకే విధమైన రంగును కలిగి ఉంటాయి. అల్యూమినియం, ఇనుము, వెండి వంటివన్నీ దాదాపు ఒకే రకమైన మెరుపునుతో ఆకట్టుకుంటాయి. కానీ ఒక్క బంగారం మాత్రం భిన్నంగా పసిడి వర్ణంతో దగ దగ మెరిసిపోతుంటుంది. అసలు బంగారం పసుపు రంగులో ఉండటానికి గల శాస్త్రీయ కారణాలు? దాని పరమాణు నిర్మాణం? దాని మెరుపు వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.

కాంతి పరావర్తనమే కారణం

సాధారణంగా వస్తువుల రంగులను చూడటంలో కాంతిదే ప్రధాన పాత్ర. సూర్యకాంతిలో అనేక రంగులు మిళితమై ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంతి ఏదైనా వస్తువుపై పడినప్పుడు.. ఆ వస్తువు కొన్ని రంగులను తనలో కలుపుకొని మరికొన్నింటిని వెనక్కి (పరావర్తనం) పంపుతుంది. ఆ పరావర్తనం చెందిన కాంతి మన కంటిని చేరినప్పుడు మన మెదడు ఆ వస్తువు రంగును గుర్తిస్తుంది. ఈ క్రమంలోనే వెండి, అల్యూమినియం వంటి లోహాలు తమపై పడే దృశ్య కాంతిలోని (Visible light) అన్ని రంగులను సమానంగా వెనక్కి పంపుతాయి. అందుకే అవి తెల్లగా లేదా వెండి రంగులో కనిపిస్తాయి. కానీ బంగారం అలా అన్ని రంగులనూ సమానంగా పరావర్తనం చేయదని నివేదికలు చెబుతున్నాయి.

నీలం పీల్చుకుని.. పసుపును ప్రతిబింబిస్తూ..

Advertisement

సాధారణంగా బంగారంపై కాంతి పడినప్పుడు అది మిగతా లోహాల కంటే భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఇది తనపై పడే కాంతిలో నుంచి నీలం, ఊదా (వైలెట్) రంగులను ఎక్కువగా పీల్చుకుంటుంది. అదే సమయంలో ఎరుపు, నారింజ, పసుపు రంగులను వెనక్కి పంపుతుంది. అలా పరావర్తనం చెందిన రంగుల మిశ్రమ కాంతి కంటికి చేరడం వల్లనే బంగారం పసుపు రంగులో కనిపిస్తుంది. నిజానికి బంగారంలో ప్రత్యేకంగా పసుపు రంగు పదార్థమేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. కాంతిని పీల్చుకునే, పరావర్తనం చేసే దాని సహజ స్వభావమే ఈ పసిడి వెలుగులకు కారణమని స్పష్టం చేస్తున్నారు.

బంగారం.. పరమాణు నిర్మాణం

బంగారానికి ఈ ప్రత్యేక స్వభావం రావడానికి దాని పరమాణు (Atomic) నిర్మాణం ప్రధాన కారణంగా తెలుస్తోంది. బంగారం పరమాణు సంఖ్య 79. అంటే దీని కేంద్రకంలో (Nucleus) 79 ప్రోటాన్లు ఉంటాయి. ఇది చాలా బరువైన కేంద్రకం కావడం వల్ల తన దగ్గరలోని ఎలక్ట్రాన్లను చాలా బలమైన శక్తితో తనవైపు లాక్కుంటుంది. దీనివల్ల ఆ ఎలక్ట్రాన్లకు ఇతర లోహాల్లో లేని విలక్షణమైన శక్తి స్థాయిలు (Energy levels) ఏర్పడతాయి. కాంతి పడినప్పుడు ఈ ఎలక్ట్రాన్లు ఒక శక్తి స్థాయి నుంచి మరొక దానికి వేగంగా మారిపోతాయి. ఈ ప్రక్రియే బంగారం ఏ రంగును పీల్చుకోవాలి, ఏ రంగును వెనక్కి పంపాలో నిర్ధారిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం

Advertisement

బంగారం రంగు వెనుక అల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన ‘సాపేక్షతా సిద్ధాంతం’ (Theory of Relativity) కూడా దాగి ఉంది. బంగారం వంటి బరువైన పరమాణువుల్లో ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ అత్యంత వేగంగా, దాదాపు కాంతి వేగానికి సమానంగా తిరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాపేక్షతా ప్రభావాలు పనిచేయడం ప్రారంభించి ఎలక్ట్రాన్ల శక్తి స్థాయిలను మారుస్తాయి. ఈ మార్పుల వల్లే ఎలక్ట్రాన్లు నీలం రంగు కాంతిని పీల్చుకునే విధానం మారుతుంది. ఒకవేళ ఈ సాపేక్షతా ప్రభావమే లేకపోతే బంగారం కూడా మిగతా లోహాల తరహాలోనే వెండి రంగులోనే కనిపించేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: బిల్ గేట్స్ హెచ్చరించిన మరుసటి రోజే.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ షాక్.. 60 వేల మందికి బైఅవుట్ ఆఫర్!

పసిడి స్వచ్ఛతను బట్టి రంగులో మార్పు

అయితే బంగారం స్వచ్ఛత, ఆభరణాల తయారీ సందర్భంగా కలిపే ఇతర లోహాలను బట్టి పసిడి రంగులో స్వల్ప మార్పులు వస్తుంటాయి. పూర్తి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం నిండైన పసుపు రంగులో కనిపిస్తుంది. అయితే ఆభరణాల తయారీ కోసం 22 క్యారెట్ల బంగారంలో వెండి, రాగి వంటి లోహాలను కలుపుతారు కాబట్టి.. దీనివల్ల రంగులో స్వల్ప మార్పును గమనించివచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆభరణాల తయారీలో రాగి శాతాన్ని ఎక్కువ చేస్తే ఆ బంగారం కాస్త గులాబీ లేదా ఎరుపు ఛాయ (రోజ్ గోల్డ్) లోకి మారుతుందని తెలియజేస్తున్నారు.

Also Read: టోల్ ప్లాజా సమీపంలో నివసిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్!

Tags

Related News

ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్.. దీపావళి కానుకగా కార్లు అందజేత.. ఈ కంపెనీకి హాట్సాఫ్ చెప్పాల్సిందే!

‘ఏఐ దెబ్బకు మరో 5 ఏళ్లలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలుండవు.. వ్యవసాయం చేసుకోవడం బెటర్’

బిల్ గేట్స్ హెచ్చరించిన మరుసటి రోజే.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ షాక్.. 60 వేల మందికి బైఅవుట్ ఆఫర్!

రూ.40ల పెరుగు కోసం ఆశపడితే.. ఏకంగా రూ.98,000 పోయాయ్.. కస్టమర్ కేర్ పేరుతో దారుణ మోసం!

రూ.25 వేల జీతమా? నెలకు ఎంత పొదుపు చేస్తే సేఫ్? నిపుణులు చెప్పే సూపర్ ప్లాన్ ఇదే!

అమ్మబాబోయ్.. రూ.10 టీతో నెలకు రూ.9 లక్షల సంపాదన.. ఉద్యోగం కంటే టీ కొట్టే బెటరేమో!

ఫ్రెషర్లకు కూడా స్కిల్స్, అనుభవం అడుగుతున్న కంపెనీలు.. మరి మొదటి అవకాశం ఎవరిస్తారు?

Big Stories

Advertisement
×