E-Paper
Advertisement

‘ఏఐ దెబ్బకు మరో 5 ఏళ్లలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలుండవు.. వ్యవసాయం చేసుకోవడం బెటర్’

‘ఏఐ దెబ్బకు మరో 5 ఏళ్లలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలుండవు.. వ్యవసాయం చేసుకోవడం బెటర్’
Advertisement

Software Engineer Fears AI| కంప్యూటర్ ముందు కూర్చొని కోడింగ్ చేసే ఉద్యోగానికి బదులుగా పొలంలో వ్యవసాయం చేయాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఈ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇప్పుడు ఇదే ఆలోచన చేస్తున్నారు.

దాదాపు పదేళ్ల అనుభవం ఉన్న ఆయన, మరో 5 నుంచి 10 ఏళ్లలో రెగులర్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఉండకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. సొంతంగా పంటలు పండించుకోవడం లేదా వ్యవసాయం చేయడం ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో వెల్లడించారు. ఆయన అభిప్రాయాలు ఇప్పుడు టెక్ రంగంలో ఏఐ ప్రభావంపై చర్చకు దారితీశాయి.

ఏఐ వేగాన్ని అందుకోవడం కష్టం

Advertisement

రెడ్డిట్‌లోని r/ClaudeCode కమ్యూనిటీలో ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన అభిప్రాయాలను షేర్ చేశారు. ఏఐ టెక్నాలజీ వేగంగా మారుతుండటంతో దానికి అనుగుణంగా ముందుకు సాగడం చాలా కష్టమని, ప్రయత్నిస్తూ అలసిపోతున్నానని ఆయన తెలిపారు. టెక్నాలజీ అభివృద్ధిని ఉద్యోగులు అర్థం చేసుకుని దానికి అలవాటు పడగలిగే వేగాన్ని అందుకోలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మనుషులు ఏఐతో పోటీ పడగలరా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. అందుకే వ్యవసాయం చేయడం లేదా సొంతంగా ఆహారాన్ని పండించుకోవడం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రెగులర్ ఉద్యోగాలు దొరకడం కష్టమవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పనులు కూడా ఏఐ చేయగలదా?

గత ఏడాది కాలంలో ఏఐపై తన అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయని ఆ ఇంజినీర్ తెలిపారు. గతంలో ఏఐ కోడింగ్ చేయగలిగినా, క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను రూపొందించడానికి అనుభవజ్ఞులైన ఇంజినీర్లు అవసరమని భావించేవారు.
కానీ ఇప్పుడు ఏఐ సిస్టమ్స్ రూపకల్పన వంటి క్లిష్టమైన పనులను కూడా చేయగలుగుతోందని ఆయన పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే మెరుగైన ఫలితాలు అందిస్తోందని అభిప్రాయపడ్డారు.
వెబ్‌సైట్లు నిర్మించడం, వీడియో గేమ్స్ అభివృద్ధి చేయడం, సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ప్రారంభించడం వంటి పనులకు భవిష్యత్తులో ఎంత విలువ ఉంటుందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. తాము అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీనే తమ ఉద్యోగాలకు ముప్పుగా మారవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.

రెడ్డిట్‌లో భిన్నాభిప్రాయాలు

Advertisement

ఈ పోస్టుపై పలువురు స్పందించారు. ఏఐకి దూరంగా ఉండటం కంటే, దాన్ని ఉపయోగించడం నేర్చుకుని కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారాలని ఒక నెటిజన్ సూచించారు.
మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కామెంట్ చేస్తూ.. నాలుగేళ్ల క్రితమే వ్యవసాయం కోసం భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తన వద్ద వందకు పైగా కోళ్లు, గొర్రెలు, తేనెటీగల పెంపకం, పండ్ల తోట, కూరగాయల తోట ఉన్నాయని వివరించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో పోలిస్తే వ్యవసాయం కష్టమైనదే అయినా, ఎక్కువ సంతృప్తినిస్తోందని చెప్పారు.
మరో నెటిజన్ కూడా తన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ స్నేహితుల్లో చాలామంది వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అవసరమవుతుందని, అందువల్ల వ్యవసాయం ఉపయోగకరమైన ప్రత్యామ్నాయం కావచ్చని అభిప్రాయపడ్డారు.

Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు

ఏఐతో ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవుతాయా?

ఏఐ వల్ల 5 ఏళ్లలో లేదా 10 ఏళ్లలో ఉద్యోగాలు పూర్తిగా అంతరించిపోతాయని ఈ చర్చ నిరూపించడం లేదు. భవిష్యత్తులో ఉద్యోగాలపై ప్రభావం టెక్నాలజీ అభివృద్ధి, కంపెనీల నిర్ణయాలు, ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది.
వ్యవసాయం కూడా కష్టపడి పనిచేయడం, అనుభవం, పెట్టుబడి, ప్రణాళిక అవసరమయ్యే రంగమే. అయినప్పటికీ, ఈ చర్చ భవిష్యత్తు ఉద్యోగాలపై టెక్ నిపుణుల్లో పెరుగుతున్న ఆందోళనను స్పష్టంగా చూపిస్తోంది.

Also Read: జాబ్ ఇంటర్వ్యూలో ఏఐ స్కిల్స్ గురించి అడిగితే ఏం చెప్పాలి? కంపెనీలు మీ నుంచి ఆశించే సమాధానం ఇదే

Related News

ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్.. దీపావళి కానుకగా కార్లు అందజేత.. ఈ కంపెనీకి హాట్సాఫ్ చెప్పాల్సిందే!

బంగారంలో అసలు పసుపు రంగే ఉండదా? మరి ఈ దగదగ మెరుపు వెనుక రహస్యం ఏంటి?

బిల్ గేట్స్ హెచ్చరించిన మరుసటి రోజే.. ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ షాక్.. 60 వేల మందికి బైఅవుట్ ఆఫర్!

రూ.40ల పెరుగు కోసం ఆశపడితే.. ఏకంగా రూ.98,000 పోయాయ్.. కస్టమర్ కేర్ పేరుతో దారుణ మోసం!

రూ.25 వేల జీతమా? నెలకు ఎంత పొదుపు చేస్తే సేఫ్? నిపుణులు చెప్పే సూపర్ ప్లాన్ ఇదే!

అమ్మబాబోయ్.. రూ.10 టీతో నెలకు రూ.9 లక్షల సంపాదన.. ఉద్యోగం కంటే టీ కొట్టే బెటరేమో!

ఫ్రెషర్లకు కూడా స్కిల్స్, అనుభవం అడుగుతున్న కంపెనీలు.. మరి మొదటి అవకాశం ఎవరిస్తారు?

Big Stories

Advertisement
×