UI The Movie: సినిమా.. కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమే కాదు. చాలామందికి మోటివేషన్. ఎంతమంది చెప్పినా మారని కొందరు.. కొన్ని సినిమాలు చూసి మారారు. బయట జరిగేదే సినిమాల్లో చూపించేవారు కొందరు అయితే.. భవిష్యత్తు ఇలానే ఉంటుంది అని చూపించేవారు కొందరు. అసలు మనిషి ఇలా ఎందుకు ఉండకూడదు అని చూపించేవారు మరికొంతమంది. ఈ ఆలోచలన్నీ ఒక మనిషి మెదడులో ఉంటే.. ఆయననే ఉపేంద్ర అంటారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు.
అర్జున్ రెడ్డి సినిమా చూసి ఈ జనరేషన్ కుర్రోళ్లు బట్టలు చింపేసుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీని మార్చిన సినిమా అన్నారు. ఇక బాలీవుడ్ లో అనిమల్ సినిమా చూసి.. ఇదెక్కడి మాస్ రా మావా అనుకున్నారు. కానీ ఈ రెండు సినిమాలు తెరకెక్కించిన సందీప్ కు గురువు ఉపేంద్ర. ఇలాంటి సినిమాలు అప్పట్లోనే ప్రేక్షకులకు అందించాడు. ఒక ‘ఉపేంద్ర’, ‘రా’, ‘ఏ’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఉన్న సమాజం గురించి అప్పుడే ఉపేంద్ర చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలు కనుక ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది అని చెప్పొచ్చు.
Jani Master: బెయిల్ పై వచ్చిన కొన్ని రోజులకే.. మరొక లేడీ డ్యాన్సర్ తో జానీ మాస్టర్.. వీడియో వైరల్
ఉపేంద్ర ఏ సినిమా తెరకెక్కించిన అందులో ఒక యూనిక్ కథ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆయన తన మార్క్ చూపించే కథలతో రాలేదు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత ఉప్పీ.. UI ది మూవీ అంటూ వస్తున్నాడు. ఉపేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం UI ది మూవీ. లహరి ఫిల్మ్స్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్స్ పై జి మనోహరన్ – శ్రీకాంత్ కెపి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ చిత్రం నుంచి వార్నర్ అనే ట్యాగ్ లైన్ తో ఒక వీడియో ను రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 2040 లో దేశం ఎలా ఉండబోతుంది అనేది ఉప్పీ ఇందులో చూపించాడు. ఆకలితో అలమటించే ప్రజలు.. ఒకరినొకరు చంపుకొనేవరకు వెళ్లడం.. ఫోన్స్ , సోషల్ మీడియా కోసం వెంపర్లాడడం చూపించారు. అంతేకాకుండా తమ జాతి అని తెలియడానికి నెంబర్స్ ముద్రలు వేయించడం చూపించి భయపెట్టేశారు. పేదలు ఎప్పటికీ ఇలా కొట్టుకుంటూ ఉంటే.. ధనవంతులు.. అధికారమదంతో వారిని అణగదొక్కడంచూపించారు.
Sobitha Dhulipalla: అక్కినేని కోడలి తెలుగుదనం పెళ్లి వరకేనా.. ?
అధికార మదంతో వీర్రవీగే పాత్రలో ఉపేంద్ర కనిపించాడు. మీ ధిక్కారానికి కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ అని ఉపేంద్ర చెప్పే డైలాగ్ తో వీడియో ఎండ్ అయ్యింది. ఈ వీడియో చూసాక.. నిజంగానే 2040 అంత భయంకరంగా ఉండబోతుందా అని నెటిజన్స్ భయపడడం మొదలుపెట్టారు. ఇక కొంతమంది మాత్రం ఇంత రా అండ్ రస్టిక్ సినిమాలు తీయడం ఉపేంద్రకే సాధ్యం అని కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఉపేంద్ర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.