Big Stories

Yamaha Aerox S Launch: యమహా నుంచి కీలెస్ స్కూటర్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు ఇవే!

Yamaha Aerox S with Keyless Ignition: మార్కెట్‌లో స్కూటర్‌ల హవా కొనసాగుతుంది. రోజుకో కొత్త మోడల్ రిలీజ్ అయి వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇక స్కూటర్ ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు కూడా కొత్త కొత్త మోడళ్లలో రకరకాల వేరియంట్లను తీసుకువస్తున్నాయి.

- Advertisement -

ఇందులో భాగంగానే తాజాగా ఓ బ్రాండెడ్ కంపెనీ తన మోడల్‌లో మరో వేరియంట్‌ను రిలీజ్ చేసింది. ఆ బ్రాండెడ్ కంపెనీ మరేదో కాదు.. యమహా మోటార్ ఇండియా. ఈ కంపెనీ తాజాగా ఏరోక్స్ స్కూటర్ కొత్త వేరియంట్‌ ఏరోక్స్ ఎస్‌ను విడుదల చేసింది. ఇందులో కీలెస్ ఇగ్నిషన్, కొన్ని ఇతర ఫీచర్లు అటాచ్ చేయబడ్డాయి.

- Advertisement -
Yamaha Aerox S
Yamaha Aerox S

కాగా ఈ కొత్త వేరియంట్ రూ.1,50,000 ధర వద్ద లాంచ్ చేయబడింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే రూ.3300 ఎక్కువ. ఈ వేరియంట్ సిల్వర్, రేసింగ్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే స్మార్ట్ కీపై బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా స్కూటర్‌ను సులభంగా గుర్తించవచ్చు.

Also Read: మార్కెట్‌లోకి మరో కొత్త యమహా బైక్.. ఫీచర్స్ అదుర్స్.. ధర రూ.1.36 లక్షలే!

దీన్ని ప్రెస్ చేసినపుడు స్కూటర్ లైట్స్ మెరిసిపోవడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ప్రత్యేక సౌండ్ కూడా చేయబడుతుంది. అయితే ఆ స్కూటర్‌లో ఓ ప్లేస్‌లో ఒక నాబ్ అందించబడింది. దాన్ని తిప్పడం ద్వారా స్కూటర్‌ను స్టార్ట్ చేయవచ్చు.

Yamaha Aerox S వేరియంట్‌లో.. స్మార్ట్ కీతో ఇమ్మొబిలైజర్ ఫీచర్ కూడా అందించబడింది. స్మార్ట్ కీ స్కూటర్ పరిధి నుండి బయటకు వెళ్లినప్పుడు.. ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా స్కూటర్‌ను లాక్ చేస్తుంది. ఇవి కాకుండా మరి ఇంకే మార్పులు ఈ వేరియంట్‌లో చేయలేదు.

మునుపటిలాగే.. ఈ స్కూటర్‌లో LED లైటింగ్, ఛార్జింగ్ సాకెట్, స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 14-అంగుళాల ముందు, వెనుక టైర్లను కలిగి ఉంది. Aerox S స్కూటర్ 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీని కలిగి ఉంది.

Also Read: అదిరిపోయే బైక్‌.. కేవలం రూ. 2 లక్షలకే.. ఇదే మంచి తరుణం.. కొనేయండి

సాధారణ వేరియంట్ మాదిరిగానే కొత్త యమహా ఏరోక్స్ ఎస్ కూడా 155cc, సింగిల్-సిలిండర్ VVA ఇంజన్‌తో వస్తుంది. ఇది 8,000rpm వద్ద 15bhp శక్తిని, 6500rpm వద్ద 13.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో CVT గేర్‌బాక్స్ ఉంది. అందువల్ల మంచి ఫీచర్లు కలిగిన స్కూటర్‌ను కొనుక్కోవాలని భావిస్తే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News