OTT Movie : దెయ్యాలు ఎంత భయపెడుతున్నా సినిమాలను చూడటం మానట్లేదు ప్రేక్షకులు. ఎందుకంటే ఈ జానర్ ఇచ్చే కిక్కే వేరు. అందుకే ఈ సినిమాలంటే భయపడే వాళ్ళు కూడా ఎవరినైనా తోడు పెట్టుకుని మరీ చూస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకొబోయే మలయాళ సినిమా అతీంద్రియ భయం, మానసిక సమస్యల చుట్టూ తిరిగే భయంకరమైన సంఘటనలను చూపిస్తుంది. ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డెప్త్‌కు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా 2022 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో బెస్ట్ యాక్ట్రెస్ (రేవతి), బెస్ట్ సౌండ్ డిజైన్ అవార్డులను కూడా గెలుచుకుంది. అలాగే జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో నామినేషన్లు పొందింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
కథలోకి వెళ్తే
అశోకన్ అనే యువకుడు, తన తల్లి వినీతతో కలసి కేరళలోని ఒక పాత ఇంట్లో నివసిస్తుంటాడు. వినీత ఒక స్కూల్ టీచర్ గా జాబ్ చేస్తుంటుంది. అయితే మానసిక సమస్యలతో బాధపడుతూ, మద్యపానం, ఒంటరితనంతో సతమతమవుతుంటుంది. అశోకన్ కి ఉద్యోగం లేకపోవడం, తండ్రి మరణం, ప్రియురాలితో బ్రేకప్, తల్లితో విభేదాల కారణంగా తీవ్ర నిరాశలో ఉంటాడు. ఈ సమయంలో ఒక రాత్రి, ఇంట్లో వింత శబ్దాలు, డోర్లు మూసుకోవడం, వస్తువులు కదలడం వంటి అతీంద్రియ సంఘటనలు జరుగుతాయి. వినీత ఈ సంఘటనలను ఆత్మల వల్ల వస్తున్నాయని నమ్ముతుంది. కానీ అశోకన్ వాటిని భ్రాంతులుగా భావిస్తాడు. ఈ సంఘటనలు వీళ్ల ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత ఒత్తిడికి గురిచేస్తాయి. అశోకన్ స్నేహితుడు, ఒక పూజారి సహాయంతో ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. గతంలో ఆ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఇది వినీత గతంతో కూడా ముడిపడి ఉంటుంది.
ఇంట్లో జరిగే అతీంద్రియ సంఘటనలు ఎక్కువవుతాయి. ఇవి వినీత మానసిక స్థితిలో భాగమా, నిజమైన ఆత్మల వల్ల వస్తున్నాయా అనే సందేహం పెరుగుతుంది. అశోకన్ తన స్నేహితురాలి సహాయంతో, ఇంటి గత యజమాని గురించి తెలుసుకుంటాడు. ఇది ఒక విషాద కథను బయటపెడుతుంది. కథలో సౌండ్ డిజైన్ వణుకు పుట్టించే వాతావరణాన్ని పెంచుతుంది. ఇక క్లైమాక్స్ మరింత ఉత్కంఠంగా ముగుస్తుంది. ఆ ఇంటి గతం ఏమిటి ? వినీత చూస్తున్న విజువల్స్ నిజమైనవేనా ? వినీత ఈ పరిస్థితి నుంచి బయట పడుతుందా ? అనే విషయాలను ఈ సైకలాజికల్ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.
ఎందులో స్ట్రీమింగ్ అంటే
‘భూతకాలం’ (Bhoothakalam) 2022లో విడుదలైన మలయాళ సైకలాజికల్ హారర్ చిత్రం. ఇందులో షేన్ నిగం, రేవతి ప్రధాన పాత్రల్లో నటించగా, రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. సైజు కురుప్, గాయత్రి అశోక్, అభిరామ్ రాధాకృష్ణన్ సహాయక పాత్రల్లో నటించారు. 2022 జనవరి 21 నుంచి ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 7.4/10 రేటింగ్ ఉంది.
Read Also : ఆడవాళ్ళపై పగబట్టే సీరియల్ కిల్లర్… శవాల చర్మం వలిచి… స్పైన్ చిల్లింగ్ సైకో థ్రిల్లర్