BigTV English

పది నిమిషాల్లో ల్యాండ్ కొనేయండి.. వావ్, ఆ యాప్ నుంచి సరికొత్త సర్వీస్!

పది నిమిషాల్లో ల్యాండ్ కొనేయండి.. వావ్, ఆ యాప్ నుంచి సరికొత్త సర్వీస్!

మన ఇంట్లో ఏ సరుకులు అయిపోయిన కేవలం 10 నిమిషాల్లో మీ తలుపు ముంగిట తెచ్చి పెడతామని అనేక ఈ కామర్స్ కంపెనీలో మార్కెట్లోకి ప్రవేశించాయి. అలాంటి కంపెనీల్లో మొదటి దశలో ప్రవేశించింది జెప్టో. క్విక్ కామర్స్ పేరిట కేవలం పది నిమిషాల్లోనే కస్టమర్ చేతికి సరుకులు అందజేస్తామని ఛాలెంజ్ తీసుకొని ఈ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశించి అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే టెన్ మినిట్స్ డెలివరీ పైన విమర్శలు ఉన్నప్పటికీ, క్విక్ కామర్స్ మార్కెట్ ఈ కామర్స్ రంగంలో వేగంగా విస్తరిస్తుంది అన్న సంగతి గుర్తించాల్సిందే. ఒకప్పుడు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థల్లో సరుకులు బుక్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చేవి. కానీ మార్కెట్లోకి జెప్టో ప్రవేశించిన తర్వాత క్విక్ కామర్స్ పేరిట గేమ్ ప్లాన్ మొత్తం మారిపోయింది. ముఖ్యంగా గ్రోసరీస్ కేవలం 10 నిమిషాల్లోనే కస్టమర్ల గుమ్మం ముందు పెడతామని సవాలు విసిరి వస్తున్నారు. ఎలాగైతే ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో తరహాలోనే జెప్టో సరుకులను కస్టమర్ల ఇంటి వద్ద సరఫరా చేస్తూ అత్యంత వేగంగా విస్తరించింది.


ఇప్పుడు ఇదే జెప్టో రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) తో కలిసి ఒక కొత్త ఇనిషియేటివ్ ప్రారంభించింది. ఇందులో బాగంగా జెప్టో అలాగే HoABL సంయుక్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఢిల్లీ NCR ప్రాంతంలో బృందావన్ భూములను 10 నిమిషాల్లో కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రకటించాయి. ఇది క్విక్ కామర్స్ మార్కెట్లో ఒక సరికొత్త ఒరవడి అని చెప్పవచ్చు. ఇంతకాలం సరుకులు బియ్యం ఉప్పు పప్పు వంటి వస్తువులను మాత్రమే డెలివరీ చేసే సంస్థలు. ఇప్పుడు ఏకంగా విలువైన భూములను సైతం 10 నిమిషాల్లోనే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి అంటే మార్కెటింగ్ ఏ స్థాయికి చేరుకుందాం తెలుసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే మనదేశంలో విస్తరిస్తున్న మార్కెట్ విలువ ఇప్పటికే దాదాపు 5 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఇటీవల స్టాటిస్టా అనే నివేదికలో తేలింది. ముఖ్యంగా ఇది 2030 నాటికి దాదాపు 12 బిలియన్ డాలర్లు దాటి అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్విక్ కామర్స్ కంపెనీలకు పెరుగుతున్న ఆదరణను అటు పలు సంస్థలు తమ మార్కెటింగ్ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం పైన పేర్కొన్నటువంటి రియల్ ఎస్టేట్ ఆఫర్ కూడా ఈ కోవలోకి చెందినది అని చెప్పవచ్చు.


క్విక్ కామర్స్ మార్కెట్ దిగ్గజం జెప్టో కు పోటీగా అటు అనేక కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించాయి. ప్రముఖ దేశీయ రిటైల్ దిగ్గజం రిలయన్స్ రిటైల్స్ ఐటం జియో మార్ట్ యాప్ పేరిట క్విక్ కామర్స్ సెగ్మెంట్ లోకి ప్రవేశించింది. దీంతో పాటు అటు జొమాటో, స్విగ్గీ సైతం క్విక్ కామర్స్ సెగ్మెంట్లోకి కొత్త యాప్స్ తో ప్రవేశించాయి. మొత్తానికి కస్టమర్ల డిమాండ్ అనుగుణంగా ఈ తరహా మార్కెటింగ్ జరుగుతూ ఉండటం గమనించవచ్చు.

Related News

Mugdha 2.0: కూకట్ పల్లిలో సరికొత్తగా ముగ్ధా 2.0.. ప్రారంభించిన ఓజీ బ్యూటీ ప్రియాంక మోహనన్!

Diwali Offers: దీపావళి రీఛార్జ్ ఆఫర్లు తెలుసా?.. బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్‌టెల్, వీఐ స్పెషల్ ప్లాన్స్ ఇవే!

Amazon Offers: అమెజాన్ షాపింగ్ పై 10% అదనపు క్యాష్‌బ్యాక్ .. సిఎస్‌బి బ్యాంక్ కొత్త ఆఫర్!

Cheque Clearance: ఇకపై గంటల్లోనే చెక్ క్లియరెన్స్.. ఇవాళ్టి నుంచి కొత్త రూల్ అమలు!

2 Thousand Note: మీ దగ్గర ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? ఈ వార్త మీకోసమే

Recharge plan: Vi మెగా మాన్సూన్ సర్‌ప్రైజ్ ఆఫర్.. రీచార్జ్ ప్లాన్‌పై భారీ డిస్కౌంట్

Diwali offers 2025: దీపావళి షాపింగ్ బోనాంజా.. మొబైల్స్, డేటా ప్లాన్లు, క్యాష్‌బ్యాక్‌ల వరద

Airtel Offers: ఎయిర్‌టెల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌.. కేవలం రూ.155కే అపరిమిత కాల్స్! కానీ..

Big Stories

×