BigTV English

Loan Default Zerodha : అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న భారతీయులు.. జెరోదా సిఈఓ హెచ్చరిక

Loan Default Zerodha : అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న భారతీయులు.. జెరోదా సిఈఓ హెచ్చరిక

Loan Default Zerodha | భారతీయుల్లో పెరుగుతున్న అప్పుల ధోరణిపై జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. ‘విపరీతంగా పెరుగుతున్న వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల వినియోగం ఆర్థిక ఇబ్బందులకు దారితీయొచ్చు. రాబోయే త్రైమాసికాల్లో ఈ అప్పుల ప్రభావం ఎలా ఉంటుందో స్పష్టమవుతుంది.’ అని ఆయన హెచ్చరించారు.


ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తరపున సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేష్నల్ ఫైనాన్స్ (సిఆర్ఐఎఫ్) జారీ చేసిన రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబర్ 2024 వరకు గణాంకాలు చూస్తే.. భారతీయులు ఏకంగా రూ.13.7 లక్షల కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. వీటిలో ప్రభుత్వం రంగం బ్యాంకుల నుంచి 38 శాతం లోన్లు తీసుకోగా.. 33 శాతం లోన్లు ప్రైవేటు బ్యాంకులు జారీ చేశాయి. మరో 24 శాతం లోన్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జారీ చేశాయి.

ఈ అప్పులు తీసుకుంటున్న వారిలో మధ్యతరగతికి చెందిన వారి సంఖ్య బాగా పెరుగుతోందని.. నితిన్ కామత్ హెచ్చరించారు. ఇటీవలి కాలంలో చిన్నమొత్తం లో అప్పులు ఇచ్చే ఫిన్‌టెక్ యాప్‌లు పెరిగపోవడంతో అవసరం లేకున్నా ప్రజలు అప్పులు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పులను త్వరగా తిరిగి చెల్లించడం చాలా ముఖ్యమని లేకపోతే ఆర్థికంగా కష్టాలు కొనితెచ్చుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. అప్పుల భారం ఉన్నవారు మానసిక ప్రశాంతత కోల్పోయి.. దాని ప్రభావం వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగా కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు.


అందుకే అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఆర్థిక నిపుణుల ఈ జాగ్రాత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

అప్పుల అవసరం vs అపరిమిత వినియోగం
అవసరమైనప్పుడు మాత్రమే రుణం తీసుకోవాలి. అయితే ఫిన్‌టెక్ యాప్‌లు త్వరితగతిన రుణం ఇస్తామంటూ ప్రచారం చేస్తూ, అనవసర రుణాలకు ఆహ్వానిస్తున్నాయి. రూ.10వేల లోపు తక్షణ రుణాల ప్రకటనల వలన చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు. ఈ యాప్ లో ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండానే అప్పులు ఇచ్చేస్తున్నాయి. కానీ వాటిపై అధిక వడ్డీ కూడా గుంజుతున్నాయి. దొరికింది కదా ఈ యాప్ లలో అప్పులు తీసుకొని అవి తిరిగి చెల్లించకుంటే ముందుగా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. ఆ తరువాత రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలవుతాయి. అందుకే అనవసరంగా అప్పులు చేయకూడదు.

అధిక వడ్డీ రుణాలను ముందుగా చెల్లించాలి
అధిక వడ్డీ రుణాలు మీపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అందుకే, ముందుగా ఈ రుణాలను తీర్చడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత మిగిలిన మొత్తాన్ని పెట్టుబడుల కోసం వినియోగించండి. మీ రుణాలను ఒక జాబితా చేయండి, వాటిలో అధిక వడ్డీ రేట్లు ఉన్న వాటిని ప్రాధాన్యంతో చెల్లించేయండి. ఇలా చేయడం ద్వారా భారం త్వరగా తగ్గుతుంది. అధిక వడ్డీ అప్పుల్లో క్రెడిట్ కార్డు రుణాలు కూడా ఉంటాయి. అందుకే క్రెడిట్ కార్డు నిర్వహణ చాలా జాగ్రత్తగా చేయాలి.

Also Read: సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.10 లక్షలు.. బిహార్‌లో బంపర్ స్కామ్

క్రెడిట్ కార్డుల నిర్వహణ

బడ్జెట్ సిద్దం చేయండి: క్రెడిట్ కార్డును ఉపయోగించడానికి ముందు మీ ఆదాయానికి సరిపడే ఖర్చుల బడ్జెట్ రూపొందించండి. ఇలా చేయడం వల్ల క్రెడిట్ కార్డు లోన్ కోసం బడ్జెట్ కేటాయించడం సులవు అవుతుంది.
సరైన కార్డు ఎంపిక: రాయితీలు ఎక్కువగా ఉండే, వడ్డీ రేట్లు తక్కువగా ఉండే కార్డును ఎంచుకోవాలి. వార్షిక రుసుము లేకుంటే మరీ మంచిది.

బిల్లుల చెల్లింపు: క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో పూర్తిగా చెల్లించడం ఉత్తమం. లేకుంటే జరిమానా భారం పడుతుంది. వీలైనంత వరకు బిల్లు మొత్తం చెల్లించండి. కనీస మొత్తం చెల్లించడం సులభంగా అనిపిస్తుంది. కానీ అలా చేయడం వల్ల మీ రుణాలపై అధిక వడ్డీ పడుతుంది.

అనుసరించవలసిన నిబంధనలు: చెల్లింపు తేదీలు, ఆలస్య రుసుములు, క్రెడిట్ పరిమితి లేని విధానాలను తప్పక తనిఖీ చేయాలి.

వ్యక్తిగత రుణాల కోసం ప్రణాళిక
మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి రుణం తీసుకోవాలి. ఆదాయం, ఖర్చులు, ఇప్పటికే ఉన్న రుణాలను పరిగణనలోకి తీసుకున్నాకే రుణం తీసుకోవాలి.
రుణం కోసం దరఖాస్తు చేసేముందు మంచి క్రెడిట్ స్కోరు సాధించండి.

అవసరాలకు సరిపోయే రుణాలను మాత్రమే తీసుకోవాలి. అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడం ఆర్థిక భారం పెంచుతుంది.
రుణాల చెల్లింపుల కోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవాలంటే అప్పుల నిర్వహణపై శ్రద్ధ పెట్టడం అత్యంత అవసరం. మీ ఖర్చులపై నియంత్రణతో పాటు సరైన ఆర్థిక వ్యూహాలను అనుసరించండి. ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మీ ఆర్థిక భవిష్యత్తు మరింత మెరుగవుతుంది.

Related News

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Big Stories

×