Jaat Release Date: 2025లో సంక్రాంతికి సినిమాల పోటీ ముగిసింది. ఇక అందరి తరువాతి టార్గెట్ సమ్మర్. ఏప్రిల్ నుండే సినిమాల సందడి మళ్లీ షురూ కానుంది. ముఖ్యంగా ఏప్రిల్‌లోని ఒక తేదీపై చాలావరకు మేకర్స్ అందరి కన్నుపడింది. తాజాగా మరొక సినిమా కూడా అదే రోజున రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అదే ‘జాట్’. గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇదొక భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ అని ఇప్పటివరకు విడుదలయిన పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. తాజాగా ‘జాట్’కు సంబంధించిన రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
మాస్ కాంబో
దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తెలుగులో మాస్ ఆడియన్స్‌కు నచ్చే ఎన్నో హిట్స్ ఇచ్చాడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. సన్నీ డియోల్ లాంటి సీనియర్ హీరోతో కలిసి సినిమా చేస్తున్నట్టుగా అనౌన్స్‌మెంట్ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. గత కొంతకాలంగా బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌కు కూడా సరైన హిట్స్ లేవు. కానీ కొన్నాళ్ల క్రితం విడుదలయిన ‘గదర్ 2’ వల్ల మళ్లీ ఆయన ఫామ్‌లోకి వచ్చాడు. అలా గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూకు, సన్నీ డియోల్ (Sunny Deol) టాలీవుడ్ డెబ్యూకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తాజాగా వీరి కాంబినేషన్‌లో మూవీ ఎప్పుడు విడుదల కాబోతుందో రివీల్ చేశారు మేకర్స్.
అదే తేదీ
ఏప్రిల్ 10న ‘జాట్’ (Jaat) విడుదల కానుందని ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌తో అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే అదే తేదీలో మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయిన విషయం తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా ఏప్రిల్ 10న ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ మూవీ విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ గత కొన్నాళ్లుగా ఈ మూవీ అనుకున్న తేదీకి రావడం లేదని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మేలో విడుదల కావాలనుకున్న సినిమాలు అన్నీ కాస్త ముందుగానే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అందులోనూ ముఖ్యంగా ఈ సినిమాలు అన్నింటికి ఏప్రిల్ 10 పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అని ఖరారు చేసేశారు.
Also Read: దాడిపై స్పందించిన సైఫ్.. పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం చెప్పాడంటే..?
అన్నీ తప్పుకోవాల్సిందే
ప్రస్తుతం ఏప్రిల్ 10న ‘జాట్’తో పాటు మరో మూడు సినిమాలు విడుదల తేదీని ఖరారు చేసుకున్నాయి. అందులో ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఇడ్లీ కడాయ్’, అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కూడా ఉన్నాయి. ‘జాట్’ మూవీ తమిళ భాషలో కూడా విడుదల కానుంది. ఇక ఆ భాషలో ధనుష్, అజిత్ లాంటి హీరోలతో పోటీపడి ‘జాట్’.. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలదా అని నిపుణుల్లో సందేహం మొదలయ్యింది. దీన్ని బట్టి చూస్తే ‘రాజా సాబ్’ వాయిదా పక్కా అని కూడా అర్థమవుతోంది. ఒకవేళ ప్రభాస్ మూవీ అదే రోజున విడుదలయ్యే పరిస్థితి ఉంటే.. ‘జాట్’తో పాటు మిగతా సినిమాలు అన్నీ తప్పుకునే అవకాశాలు ఎక్కువే అని తెలుస్తోంది.
Action Superstar @iamsunnydeol is coming to the big screens with UNRESTRICTED ACTION & UNFATHOMABLE AURA 💥💥#JAAT GRAND RELEASE WORLDWIDE ON APRIL 10th ❤️🔥
In Hindi, Telugu & TamilMASS FEAST GUARANTEED 👊
Directed by @megopichand
Produced by @MythriOfficial &… pic.twitter.com/HyOUSVQx9s— Mythri Movie Makers (@MythriOfficial) January 24, 2025