BigTV English

Karan Bhushan Singh: బైక్‌పైకి దూసుకెళ్లిన బ్రిజ్ భూషణ్ కొడుకు కాన్వాయ్.. ఇద్దరు మృతి (వీడియో)

Karan Bhushan Singh: బైక్‌పైకి దూసుకెళ్లిన బ్రిజ్ భూషణ్ కొడుకు కాన్వాయ్.. ఇద్దరు మృతి (వీడియో)

2 Died as Karan Bhushan Singh’s Convoy runs over a motorcycle: ఆ కారుపై పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉంది. బుధవారం ఓ ప్రముఖ వ్యక్తి కాన్వాయ్ లోని ఓ కారు అదుపు తప్పి బైక్ పై దూసుకెళ్లింది. దీంతో ఆ బైక్ పై వెళ్తున్న ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు పాదాచారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. లోక్ సభ ఎన్నికల వేళ ఘటన చోటు చేసుకోవడంతో మరోసారి దేశవ్యాప్తంగా ఆ ప్రముఖ వ్యక్తి పేరు చర్చల్లోకి వచ్చింది. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అంటారా..? అయితే ఈ వార్త చూడండి.


బీజేపీ సిట్టింగ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ కుమారుడు, కైసర్ గంజ్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్ లోని ఓ కారు బీభత్సం సృష్టించింది. హుజూర్ పూర్ – బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలో అతివేగంతో వెళ్తూ ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో ఆ బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు పాదాచారులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కు పంపించారు. అనంతరం బీభత్సం సృష్టించిన కారును పరిశీలించగా ఆ కారు కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్ లోని కారుగా గుర్తించారు. ఆ కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. దానిపై పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉన్న స్టిక్కర్ ను కూడా గుర్తించారు.


అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగినంక వారు కారును అక్కడే వదిలేసి పారిపోయారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ఐదేళ్లుగా డేటింగ్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

కాగా, గతంలో కూడా కరణ్ భూషణ్ వ్యవహరం విషయమై దేశవ్యాప్తంగా నిరసనలు వెళ్లువెత్తాయి. రైతులపై నుంచి కారును తీసుకెళ్లడంతో పలువురు రైతులు మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా కరణ్ భూషణ్ పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి కూడా అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అయితే, అతివేగంగా వచ్చి ఢీ కొన్న ఆ కారులో కరణ్ భూషణ్ ఉన్నాడా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Breaking news: టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. 33 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం

Building Collapse: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఐదేళ్ల చిన్నారి తల నరికి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Big Stories

×