BigTV English

Deccan Queen’s Birthday: రైలుకు బర్త్ డే.. కేక్ కట్ చేసిన సెలబ్రేట్ చేసిన ప్రయాణీకులు!

Deccan Queen’s Birthday: రైలుకు బర్త్ డే.. కేక్ కట్ చేసిన సెలబ్రేట్ చేసిన ప్రయాణీకులు!

Deccan Queen Train Birthday: భారతీయ రైల్వేలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రైలు దక్కన్ క్వీన్. జూన్ 1తో ఈ రైలు ప్రయాణాన్ని మొదలు పెట్టి 95 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రయాణీకులు దక్కన్ క్వీన్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఫూణే రైల్వే స్టేషన్  ప్లాట్ ఫారమ్ మీద కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేశారు. ఈ ఏడాది రైల్వే ప్రవాసీ గ్రూప్ అధ్యక్షుడు హర్ష షా కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ప్లాట్‌ ఫామ్ నంబర్ మూడుపై ఈ వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారిలో ఎక్కువగా ఈ రైలులో ప్రయాణించే ప్యాసింజర్లు ఉన్నారు. ముందుగా దక్కన్ క్వీన్ రైలును లోకోమోటివ్ ను పూలమాలలు, బెలూన్లు, రిబ్బన్లు కట్టి అలంకరించారు. ఆ తర్వాత కేక్ ను తీసుకొచ్చి.. దాని మీద  స్పార్కిలర్లను కూడా వెలిగించారు. ప్రతి ఏటా జూన్ 1న షా ఫ్యామిలీ ఈ వేడుకలను నిర్వహిస్తున్నది. గత 75 సంవత్సరాలుగా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నది.


96వ వసంతంలోకి అడుగు పెట్టిన దక్కన్ క్వీన్

జూన్ 1, 1930న పూణే నుంచి ముంబైకి దక్కన్ క్వీన్ ప్రయాణం ప్రారంభమైంది. నిన్నటితో 95 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 96వ వసంతోలకి అడుగు పెట్టింది.  పూణే, ముంబై మధ్య అనేక రైళ్లు ఉన్నప్పటికీ, దక్కన్ క్వీన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రయాణీకులకు అత్యంత విశ్వాసపాత్రమైన రైలుగా పేరు తెచ్చుకుంది. ముంబై-పూణే మధ్య ప్రయాణాలకు కొనసాగించాలనుకునే వారి ఫస్ట్ ఛాయిస్ గా దక్కన్ క్వీన్ నిలుస్తోంది. ఈ రైలు ఎక్కినప్పుడల్లా ప్రత్యేక సౌకర్యాలు, తెలియని అనుబంధాన్ని ఫీల్ అవుతారు.


దక్కన్ క్వీన్ కు ఎన్నో ప్రత్యేకతలు

దక్కన్ క్వీన్ రైలు ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. దేశంలో రైళ్లు అనుకున్న సమయానికి రావు అనే విమర్శలు ఉన్నాయి. కానీ, దక్కన్ క్వీన్ ఆ విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. కచ్చితంగా సమయపాలన పాటిస్తుంది. ఈ రైలులో టేబుల్ సర్వీస్, మైక్రోవేవ్ ఓవెన్లు, డీప్ ఫ్రీజర్లు,  టోస్టర్లతో ఆధునిక ప్యాంట్రీ సౌకర్యాలతో కూడిన డైనింగ్ కార్ ఉన్న ఏకైక రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ డైనింగ్ కార్ లో కుషన్డ్ కుర్చీలు, కార్పెట్లు ఉన్నాయి.

విశ్వాసానికి మారుపేరు!

గత 95 ఏండ్లలో రెండు నగరాల మధ్య రవాణా అందించడంతో పాటు అత్యంత విశ్వాసపాత్రమైన సేవలను అందిస్తుందని షా వెల్లడించారు. సమయపాలనకు మారుపేరుగా కొనసాగుతుందన్నారు. దక్కన్ క్వీన్ ప్రారంభించినప్పుడు, మొదట్లో ఏడు కోచ్ లు మాత్రమే ఉండేది. ఆ తర్వాత 16 కోచ్ లకు పెరిగింది. వీటిలో మూడు ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్లు, తొమ్మిది సెకండ్-క్లాస్ చైర్ కార్లు, ఒక విస్టా డోమ్ కోచ్, ఒక డైనింగ్ కార్, ఒక సాధారణ సెకండ్-క్లాస్ కంపార్ట్‌మెంట్,  ఒక గార్డ్ బ్రేక్ వ్యాన్, ఒక జనరేటర్ కారు ఉన్నాయి. ముంబై- పూణే మధ్య ప్రతిరోజూ వేలాది మంది ఈ రైలు ద్వారా రాకపోకలు కొనసాగిస్తారు.

Read Also: రైలులోనే రెస్టారెంట్.. ఎక్కడో కాదు ఇండియాలోనే.. మీకూ అలా జర్నీ చేయాలని ఉందా?

Related News

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Big Stories

×