Telangana Movement: అది 1996.. ఉద్యోగాలు లేవు. నీళ్లు లేవు. నిధులు అస్సలే లేవు. ప్రజలు అరిగోస పడుతున్న సమయమది. ఎక్కడ చూసినా కరువే ఉన్నది. పంటలు పండక.. నీళ్లు లేక.. కరెంటు అందక రైతులు ఆత్మహత్యలు పడుతున్న సమయం. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పరిస్థితి. ఇన్ని బాధల మధ్య అప్పుడే మలి దశ ఉద్యమం మొదలయ్యింది. ప్రజా సంఘాలు పుట్టుకొచ్చాయి. ఇక అప్పటి నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తింది.
1948, 1952 ముల్కీ ఉద్యమం, 1969 ఉద్యమంలో పోరాడినా?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష.. అసలు ఎట్టా సాధించుకున్నాం.. తెలంగాణ ఉద్యమ చరిత్ర.. శానా గొప్పది.. ప్రపంచంలో మరెక్కడా లేని గొప్ప ఉద్యమ చరిత్ర మన తెలంగాణది.. తెలంగాణ ప్రజలది. కొన్ని ఏళ్ళు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రం ఈ తెలంగాణ. 1947 ఆగస్ట్ 15న దేశమంతా స్వాతంత్రం వచ్చినా.. తెలంగాణకు మాత్రం రాలే. ఓ వైపు దేశ ప్రజలంతా.. సంతోషంగా జీవిస్తుంటే.. తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనలో నానా ఇబ్బందులకు గురయ్యారు. ఇలా తెలంగాణ సాయుధ పోరాటం, 1952 ముల్కీ ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమంలో వేల మంది ప్రజలు అమరులైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాలేదు.
ప్రజలంతా ఏకమయ్యారు..
ఇక 1996లో షురూ అయ్యింది తెలంగాణ మలిదశ ఉద్యమం. అన్ని ఉద్యమాలు ఒక ఎత్తు ఐతే.. మలి దశ ఉద్యమం మరో ఎత్తు. ఈ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఒక తాటిపైకి వచ్చి పోరాడారు. మలిదశ ఉద్యమంలో ఒక రాజకీయ పార్టీనో.. కొన్ని ప్రజా సంఘాలో పోరాడితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాలేదు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు.. ఒకే నినాదంపై రోడ్ల మీదకు వచ్చి పోరాడితే.. ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. దీనికి తోడుగా.. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంత సపోర్టుగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు.. కాంగ్రెస్ తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రధాన పాత్రను పోషించాయి.
విద్యార్ధులే రియల్ ఉద్యమ హీరోలు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అందరి కన్నా కీలక పాత్ర యువతది.. విద్యార్థులది.. అసలు నిజం చెప్పాలంటే మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడడానికి కారణమే విద్యార్థులు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. ఉద్యోగాలు వస్తాయని.. విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. శ్రీకాంతా చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాది రెడ్డి ఇలా వందల మంది.. తెలంగాణ సోదరులకు ఉద్యోగాలు వస్తాయని.. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ యువతకు కొలువులు వస్తాయని సూసైడ్ చేసుకున్నారు. ఒకరు నిప్పు అంటించుకుని.. మరొకరు తుపాకీతో కాల్చుకొని.. ఇంకొకరు పార్లమెంట్ సాక్షిగా ఉరి వేసుకొని రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించారు. ఇలా వందల మంది విద్యార్థులు ప్రాణాలు ఆర్పిస్తే.. చివరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. 2014 ఫిబ్రవరి 20 న రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యింది. తెలంగాణ తల్లి సాక్షిగా.. ఆ సూర్య కిరణాలు తెలంగాణ గడ్డను ముద్దాడాయి. అప్పటి నుంచి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అధికారంగా జరుపుకుంటున్నారు. ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. కానీ ఆ తర్వాత ఏమైంది..?
ALSO READ: Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం స్కీమ్.. మొదటి లిస్టు రెడీ
ఏమైందంటే..?
పదేళ్లు పాలించిన పార్టీ నిరుద్యోగుల కడుపు కొట్టింది. ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి.. విద్యార్థులను మోసం చేసింది. పదేళ్ల పాటు తెలంగాణ యువత తల్లడిల్లింది. పరీక్షలు పెట్టడం.. పేపర్లు లీక్ చేయడం.. ఆ పదేళ్లు అంతా ఇదే జరిగింది. అందుకే విద్యార్థులు గట్టి బుద్ధి చెప్పారు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా యాది చేసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం.. పరీక్షలు పెట్టడం వెంటనే ఫలితాలు ఇవ్వడం.. అపాయింట్ మెంట్ లెటర్ లు ఇవ్వడం మొదలెట్టింది. ప్రస్తుతం ఉన్న రేవంత్ సర్కార్ జాబ్ కాలెండర్ ను విడుదల చేసి.. దానికి ఆచరణ పెట్టే పనిలో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు, రైతులు, మహిళలు.. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు.. ఇది కదా అసలైన ప్రజా పాలన అంటే.. రాష్ట్ర ప్రజలందరికీ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు… జై తెలంగాణ.. జై జై తెలంగాణ..