BigTV English

Balineni Srinivasa Reddy: బాలినేని జంప్..? పార్టీ మారేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం..? జనసేన కేనా..?

Balineni Srinivasa Reddy: బాలినేని జంప్..? పార్టీ మారేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం..? జనసేన కేనా..?

Balineni Srinivasa Reddy Planned to Join in Janasena: ప్రకాశం జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగలబొతుందా..? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఒంగోలులో ఘోర పరాజయం చవి చూసిన మాజీ మంత్రి బాలినేని పొలిటికల్ ఫ్యూచర్‌పై లెక్కలు వేసుకుంటున్నారంట. కొడుకుతో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారంట. మూడో కంటికి తెలియకుండా ఆ దిశగా అంతర్గత చర్చలు జరుగుతున్నాయంట. ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మొదట్లోనే వ్యతిరేకించిన బాలినేని. జగన్ ఆదేశాలతో తర్వాత సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడా కోపంతోనే ఆయన పార్టీ మారే ఆలోచనలో పడ్డారంట.


బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన నేత. ఒంగోలు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. మెన్నటి కూటమి గాలిలో టీడీపీ అభ్యర్ధి దామచర్ల జనర్ధన్ చేతిలో మూప్పై వేల ఓట్ల తేడాలో ఘోర ఓటమిని చవిచూసారు. ఎన్నికల ముందు గ్రౌండ్ వర్క్ ఎంత చేసుకున్నా.. ఓట్లు పడక పొవడంతో పొలిటికల్ ఫ్యూచర్‌పై బాలినేని ఆలోచనలో పడ్డారంట.

ఎన్నికల టైంలో టీడీపీ కన్నా ఎక్కువ నగదు, బియ్యం బస్తాలు, మటన్ , చిక్కన్‌లు పంచారు వైసీపీ నేతలు.. వాటిని జనం బానే తీసుకున్నారు. దాంతో కనీసం వైసిపి అభ్యర్ధిగా ఉన్న బాలినేని ఐదు వేల ఓట్లతో అయినా బయట పడతానని కాన్ఫిడేంట్ గా కనిపించారు. అయితే సీన్ రివర్స్ అయింది. వైసీపీకి పక్కగా పడుతాయన్న ఓట్లే పోల్ కాలేదని అర్థమవ్వడంతో.. బాలినేని కౌంటింగ్ రోజు మూడో రౌండ్‌కే కౌంటింగ్ హల్ నుంచి వెళ్ళిపొయారు. ఇంత దారుణంగా ఓడిపోతానని ఊహించలేదని బాలినేని సన్నిహితుల వద్ద వాపోతున్నారంట.


Also Read: పద్ధతికి ప్యాంటు, షర్టు వేసినట్లు కొడాలి నాని విమర్శలు.. ఈ మార్పు దేనికి సంకేతం ?

ఒంగోలులో 20 వేల ఇళ్ళపట్టాలు పంపిణీ చేయించిన బాలినేనికి ఓటమి పెద్ద షాకే ఇచ్చింది. బాలినేని ఫాలోయర్‌గా ఉన్న ఒంగోలు మేయర్ గంగడ సుజత టీడీపీ లోకి వెళ్లడం ఖాయమైంది. ఇప్పటికే ఆమె టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల టీంతో టచ్ లో ఉన్నారంట. ఒంగోలు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్ లలో 43 స్థానాలు వైసీసీ గెలుచుకోగా ఒక స్థానం జనసేన మిగిలిన స్థానాలను టీడీపీ గెలిచింది. రాష్ర్టంలో అధికారం మారటంతో కార్పొరేటర్లు టీడీపీ వైపు చూస్తున్నారు. దాంతో ఒంగోలు నగరపాలక సంస్థ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుంది. ఇదంతా బాలినేని మాస్టర్ ప్లాన్ అన్న టాక్ నడుస్తుంది.

ఏపీలో అక్కడక్కడా జరుగుతున్న గొడవలపై బాలినేని ఎక్స్ వేదికగా స్పందించిన తీరుతో అసలు సిసలైన అనుమానం జనాల్లో మొదలైంది. ‘అఖండ విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మాక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హర్షణీయం.. శాసనసభ్యునిగా నా 25ఏళ్ల రాజీకియ జీవితంలో ఎటువంటి హింసాత్మాక ఘటనలకు తావులేదు. అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూలేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మాక ఘటనలు, అక్రమ కేసులు , భౌతిక దాడులపై మీరు స్పందించాలని కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు’ అని బాలినేని ట్వీట్ చేశారు.

Also Read: Chiranjeevi received invitation: చిరంజీవికి ప్రత్యేకంగా చంద్రబాబు ఇన్విటేషన్, సాయంత్రం విజయవాడకు..

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు ఉండగా.. పవన్‌ పేరే ప్రస్తావించే ఎందుకు ట్వీట్ చేశారన్నది ఇప్పుడు వైసీపీ, జనసేన అభిమానుల్లో చర్చగా మారింది. వాస్తవానికి పవన్-బాలినేని మధ్య కొత్త పరిచయమేమీ అక్కర్లేదు. ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా బాలినేనికి చాలా మంది నిర్మాతలతో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య పవన్ కల్యాణ్ సినిమాకు బాలినేని కోట్లలో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు.

ఆ క్రమంలో జనసేనలోకి వెళితే తన వారసుడు ప్రణీత్ రెడ్డికి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందని.. తనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలతో మళ్లీ మునుపటి రోజులు తెచ్చుకోవచ్చని బాలినేని భావిస్తున్నారట. అందుకే వైసీపీని వీడి.. పవన్ సమక్షంలో జనసేనలో చేరడానికి మంత్రాంగం మొదలుపెట్టారంట. ఒంగోలుతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని తన అనుచరులను కాపాడుకోవాలంటే జనసేనలోకి వెళ్ళటం మంచిదని ఫిక్స్ అయ్యారంట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రిప్లై కోసం ఎదురు చూస్తున్నారట. పవన్ సానుకులంగా స్పందిస్తే జనసేనలోకి బాలినేని సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read: ఐదేళ్ల పోరాటానికి ముగింపు.. అమరావతీ.. ! ఊపిరి పీల్చుకో.. బాబు వచ్చాడు

గతంలో పవన్ కల్యాణ్ చేనేత వస్త్రాలు ధరించాలని బాలినేనికి ట్విట్టర్ ఛాలెంజ్ చేసినప్పుడు.. బాలినేని చేనత వస్త్రాలు ధరించి ఛాలెంజ్ తీసుకున్నారు. అప్పుడు వైసీపీలో బాలినేని వ్యవహారంపై పెద్ద రచ్చ నడిచింది. వైసీపీలో తనకు జగన్ వల్ల చాలా అవమానాలు ఎదరయ్యాయని బాలినేని తనవారి దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. జగన్ ఓన్లీ ఐప్యాక్ టీం మీద ఆధారపడి.. సీనియర్ల సలహాలు తీసుకోలేదని.. సజ్జల వంటి ఒకరిద్దరు నేతలు, అధికారులను నమ్ముకుని పార్టీని నాశనం చేశారని అంటున్నారంట.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌కు దగ్గర బంధువైన బాలినేని పార్టీ మారితే ప్రకాశం జిల్లాలో వైసీపీకి కోలుకోలేని స్ట్రోక్ తగిలినట్లే. బాలినేని వైసీపీని వీడతారన్న వార్తలను ఇంతవరకూ బాలినేని గానీ.. ఆయన కుటుంబ సభ్యులు కానీ ఖండించడం లేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా రియాక్ట్ కాకపోవడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. మరి బాలినేనికి ముహూర్తబలం ఎప్పటికి కుదురుతుందో చూడాలి.

Related News

BJP Politics: ముగ్గురూ ముగ్గురే.. ముఖం చాటేస్తున్న లీడర్లు

AP Politics: టీడీపీకి పిల్లి సత్తిబాబు రాజీనామా.. కారణం ఇదేనా?

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Srikakulam Politics: దువ్వాడ కుల రాజకీయం

KCR: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

Big Stories

×