Bhupalpally Crime news: అగ్నిసాక్షిగా తాళి కట్టిన ఇంటి పెద్దాయన రూటు మార్చాడు. తన అంతర్గత వ్యవహారాలకు కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించాడు. కొడుకుని చంపేస్తే తనకు ఎలాంటి సమస్య ఉండదని భావించాడు. చివరకు అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం.
స్టోరీలోకి వెళ్తే..
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లికి చెందిన కాసం ఓదేలుకు అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి పరకాల మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన దేవితో వివాహం జరిగింది. ఓదేలుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెళ్లి జరిగి దాదాపు దశాబ్దమున్నర అయ్యింది. ఆయన తల్లిదండ్రులు ఓదేలు దగ్గర ఉంటున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ ఫ్యామిలీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి.
ఓదేలు తండ్రి మొండయ్య కోడలి దేవితో వివాహేతర సంబంధం మొదలైంది. ఈ విషయాన్ని బయటకు తెలీకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. నిజం ఎప్పుడైనా తెలుస్తుంది. ఓదేలు విషయంలో అదే జరిగింది. ఈ వ్యవహారంలో తండ్రి-కొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. చివరకు ఆ గ్రామంలో పంచాయితీలు సైతం జరిగాయి. అయినా తండ్రి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు.
కోడలితో వివాహేతర సంబంధం
సోమవారం ఓదేలు మ్యారేజ్ రోజు కావడంలో కేట్ కట్ చేసి కాస్త సందడి చేశారు. ఈ క్రమంలో తండ్రీ కొడుకుల మధ్య మళ్లీ గొడవ రాజుకుంది. దీంతో ఇరుగు పొరుగువారు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు నచ్చజెప్పడంతో ఆ వివాదం కాస్త సద్దు మణిగింది. కానీ ఓదేలు తండ్రి మాత్రం పగతో రగిలిపోతున్నాడు. చివరకు కొడుకుని హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు మొండయ్య.
ALSO READ: 9 మంది భార్యలకు విడాకులు ఇచ్చిన యువకుడు, పదో భార్య ఆ పని చేసిందని హత్య
సోమవారం రాత్రి బయట పడుకున్న ఓదేలు తలపై రోకలి బండతో బలంగా కొట్టాడు. దీంతో అక్కడికక్కడే కొడుకు ఓదేలు చనిపోయాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు మొండయ్య. జరిగినదంతా వాళ్లకు వివరించాడు. అంతకుముందే ఓదేలు భార్య దేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వయస్సులో కొడుకుని చంపి చేయరాని తప్పు చేశాడు కన్నతండ్రి.