Ram Jagadeesh : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా సక్సెస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు అవుతారు కానీ సక్సెస్ అవ్వలేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త దర్శకులుగా అవకాశాలు సాధించుకొని సక్సెస్ లు కూడా కొడుతున్నారు. ముఖ్యంగా నాని నిర్మాతగా కూడా కొత్త దర్శకులను పరిచయం చేసే పని పెట్టుకున్నాడు. ఇతరుల రామ్ జగదీష్ అనే ఒక కొత్త దర్శకుడుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈరోజుల్లో ఒక ఆలోచనను నమ్మి డబ్బులు కట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాంటిది ఒక దర్శకుడిని నమ్మి, ఆ కథపై డబ్బులు పెట్టి అతని ఎంకరేజ్ చేయడమే కాకుండా, సక్సెస్ కొట్టగానే గిఫ్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇంతకుముందు చాలామంది నిర్మాతలు ఇలా చేశారు. కానీ నాని చేసిన ఈ విషయం మాత్రం ఇప్పటివరకు బయటపడలేదు.
కోర్టు సినిమాతో హిట్
కోర్టు సినిమాతో నాని రామ్ జగదీష్ అనే ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రామ్ జగదీష్ ఈ సినిమాని మలిచిన విధానం చాలామంది ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో ప్రియదర్శి పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ ని చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలో మంగపతి అనే పాత్రలో శివాజీ కనిపించిన తీరు ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ సినిమాతో శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ పర్ఫెక్ట్ గా స్టార్ట్ అయింది అని చెప్పాలి. ఈ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లెక్స్ లో అవైలబుల్ గా ఉంది.
రామ్ జగదీష్ కు గిఫ్ట్
కోర్టు సినిమా సక్సెస్ అయిన తర్వాత రామ్ జగదీష్ కు నాని ఒక కొత్త కారుని కొనిచ్చారట. అయితే ఈ విషయం ఇప్పటివరకు బయటపడలేదు. రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ జగదీష్ ను ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్పుకొచ్చారు. మామూలుగా ఇలా ఇచ్చినట్లు నాని ఎవరికీ చెప్పొద్దు అని చెప్పారట. చెప్పాల్సిన అవసరం ఏముంది అని అన్నారట. అందుకోసమే రామ్ జగదీష్ చాలామందికి ఈ విషయాన్ని చెప్పలేదు. లేకపోతే నేను కూడా గట్టిగా చెప్పావని అంటూ తెలిపాడు. ఇక ఈ రోజుల్లో అవకాశం ఇవ్వడమే గగనం అనుకునే తరుణంలో, ఆ దర్శకుడు సక్సెస్ అయిన తర్వాత కారు కొనివ్వడం అనేది నానిని మరో మెట్టు ఎక్కించింది.
Also Read : Harish Shankar: రామ్ చరణ్ తో అలాంటి సినిమా చేయాలి