Palnadu Crime : ఉమ్మడి గుంటూరు జిల్లా ఈవూరు లో విషాద ఘటన వెలుగు చూసింది. అప్పుల బాధ, భార్య అనారోగ్య సమస్యలు తట్టుకోలేని ఓ తండ్రి ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చివరి నిముషంలో ప్రాణ భయంతో తన ప్రాణాలు కాపాడుకున్నా… వద్దని బ్రతిమిలాడిన ఇద్దరు పిల్లలు విగతజీవులుగా మారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
పలనాడు జిల్లా వినుకొండ మండలానికి చెందిన నాగాంజనేయ శర్మకు ఇద్దురు ఆడపిల్లలు. స్థానికంగా ఓ పత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది నెలల క్రితం ఇతని భార్య పక్షవాతానికి గురికావడంతో.. మంచానికే పరిమితమైంది. ఈ క్రమంలోనే కుటుంబ పోషణ కోసం ఊరిలో అప్పులు చేశాడు. ఓ వైపు సంపాదన సరిపోకపోవడం, మరోవైపు భార్య అనారోగ్యం, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను మరణిస్తే..తన ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోతాయని ఆలోచించి.. వారిని సైతం చంపేయాలనుకున్నాడు.
బయటకు వెళ్లివస్తామని చెప్పి పిల్లలలో సహా బయటకు వచ్చిన నాగాంజనేయ శర్మ.. నేరుగా సాగర్ కాలువ దగ్గరకు వెళ్లాడు. ఇద్దరు పిల్లల్ని కాలువలో పడేసేందుకు ప్రయత్నిస్తుండగా…పెద్ద కుమార్తె “వద్దు నాన్న. ప్లీజీ.. మమ్మల్ని నీళ్లల్లో పడేయొద్దు.. ప్లీజ్’’ అని ప్రాథేయపడింది. అతని రెండు కాళ్లకు మెలికవేసుకుని ఏడ్చింది.. అయినా ఆ తండ్రి గుండె కరగలేదు.
ఇద్దరు బిడ్డల్ని కాలువలోకి విసిరేసిన నాగాంజనేయ శర్మ.. తర్వాత తాను కాలువలోకి దూకేశాడు. నీటిలో పడిన పిల్లలు కాలువ వేగానికి కొట్టుకునిపోతూ.. కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ల ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పడే.. ప్రాణాల కోసం నాగాంజనేయ శర్మ ప్రయత్నింస్తుండడంతో.. స్థానికులు కాలువలోకి కొబ్బరి మట్టను విసిరారు. దానిని అందుకున్న శర్మ ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ ఘటనలో ఇద్దరు ఆడపిల్లలు నీటిలో కొట్టుమిట్టాడుతూ చనిపోగా తండ్రి మాత్రం క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. తండ్రే తన పిల్లలను చంపే ప్రయత్నం చేయడం.. ప్రాణభీతితో తాను మాత్రం నీటిలోంచి బయట వచ్చేయడం మానవీయతకు మచ్చ. క్షణికావేశంలో శర్మ తీసుకున్న నిర్ణయం తన జీవితంలో మర్చిపోలేని తప్పుకు కారణంగా నిలిచింది. కన్నబిడ్డలను తండ్రే చంపేయడంతో పక్షవాతంలో ఉన్న ఆ తల్లి గుండెలు రోజు పగిలిపోయేలా రోదిస్తోంది. పోలీసుల విచారణలో నాగాంజనేయ శర్మ జరిగిన సంఘటన మొత్తాన్ని కళ్ళకు కట్టినట్ల వివరించగా.. విషయం తెలుసుకున్న స్థానికులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
మొదట ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని అంతా భావించారు. బైక్ పై కాలుక గట్టుపై వెలుతుండగా ప్రమాదం జరిగిందని అనుకున్నారు. కానీ.. నాగాంజనేయ శర్మని అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారణ చేయగా.. తాను చేసిన దుర్మార్గాన్ని స్వయంగా చెప్పుకున్నాడు. దాంతో.. విషయం స్థానికులకు తెలియడంతో.. అతను చేసిన పనికి అంతా విమర్శిస్తున్నారు.
Also Read : ప్రేమతో పెళ్లి.. ఆ తర్వాత హత్య.. నాగర్ కర్నూల్ లో దారుణ ఘటన
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు. కాలువలో నీటిని తగ్గగానే.. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టనున్నట్లు తెలిపారు.