ChotaNews Lite Theesko :ఛోటా న్యూస్.. చిన్న యాప్.. ప్రపంచం నలుమూలల జరిగే ఏ సంఘటనైనా సరే.. ఇట్టే క్షణాల్లో మీ ముందు ఉంచుతుంది. సుత్తి లేకుండా నేరుగా సమాచారాన్ని మీ వద్దకు చేర్చే బుల్లి పిట్ట లాంటి యాప్ అని చెప్పవచ్చు. అంతేకాదు మీకు కావాల్సిన ఎటువంటి సమాచారాన్ని అయినా సరే ఇందులో మీరు సులభంగా పొందే వీలుంటుంది. అందుకే ఇప్పుడు ఈ యాప్ కి విపరీతంగా ప్రేక్షక ఆదరణ పొందింది . ఈ నేపథ్యంలోనే తమ ఫాలోవర్స్ ను మరింత ఎంటర్ర్టైన్ చేయడం కోసం అలాగే మరిన్ని తెలియని విషయాలని చేరవేర్చడానికి సరికొత్త ప్రోగ్రాంతో మీ ముందుకు రాబోతోంది.
‘లైట్ తీస్కో’ అంటూ సరికొత్త కార్యక్రమం..
ఛోటా న్యూస్.. తాజాగా సరికొత్త కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘లైట్ తీస్కో’ అనే కార్యక్రమంలో నటుడు , ఆర్జే హేమంత్ ఈమధ్య కాలంలో జరిగిన పలు వింత సంఘటనలను అలాగే క్రైమ్ స్టోరీలకు సంబంధించిన విషయాలను డీటెయిల్ గా అనాలసిస్ చేసి మరీ మీకు డిఫరెంట్ స్టైల్లో అందిస్తారు. గత వారం రోజుల్లో జరిగిన టాప్ 5 సంఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియో త్వరలో విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా.. ఇందులో చాలా సింపుల్ గా, షార్ట్ గా, సుత్తి లేకుండా చెప్పి కార్యక్రమం పై హైప్ తీసుకొచ్చారు ఆర్జే హేమంత్. 10:23 నిమిషాల నిడివి ఉన్న ఈ చిన్న వీడియో ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హేమంత్ తన వాక్చాతుర్యంతోనే ఈ కార్యక్రమంపై హైప్ తీసుకొచ్చారు.