Hyderabad News: హైదరాబాద్ సిటీ పరిధిలో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. టూ వీలర్‌ని టిప్పర్ ఢీ కొన్న ఘటనలో ఆరేళ్ల బాలుడు స్పాట్‌లో మృతి చెందాడు. పాఠశాలకు బాలుడ్ని స్కూటీపై తల్లి తీసుకుని వెళ్తోంది. కొంతదూరం వచ్చాక వేగంగా వచ్చిన టిప్పర్ టూ వీలర్‌ని ఢీ కొట్టింది.
రోడ్డుపైకి వెళ్లేటప్పుడు జాగ్రత్త అంటూ పదే పదే పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ హైదరాబాద్ సిటీ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయ ని నివేదికలు చెబుతున్నాయి. అయినా వాహనాల జోరు ఏ మాత్రం తగ్గేలేదు.
తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతమైన దుండిగల్ పరిధిలోని మల్లంపేట్ ఏరియాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లితో పాటు బాలుడు స్కూటీపై వెళ్తున్నాడు. వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన టిప్పర్ బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో బాలుడు కిందపడగా, వెంటనే బాలుడి పైనుంచి టిప్పర్ వెళ్లింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందు కొడుకు చనిపోవడాన్ని ఆ తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది. ఆమెని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు.
మృతుడు ఆరేళ్ల అభిమన్యురెడ్డిగా గుర్తించారు. బాలుడి సొంతూరు నిజామాబాద్‌కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటోంది. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్తే క్రమంలో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ALSO READ: ఛార్జింగ్ పెడుతుండగా పేలిన ఎలక్ట్రిక్ బైక్
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ సిటీలో టిప్పర్లు, క్రేన్‌లు ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ల మీదకు వస్తున్నాయి. అడ్డదిడ్డంగా నడుపుతున్న సందర్భాలు వెలుగు చూశాయి. ఇలాంటి వాహనాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉన్న సమయంలో ఆయా వాహనాలను రోడ్లపైకి రాకుండా చేయాలని కోరుతున్నారు.
జూన్ మొదటివారంలో తమిళనాడులోని చెన్నైలోని పెరంబూరు పేపర్ మిల్స్ రోడ్డులో ఇలాంటి సంఘటన జరిగింది. తల్లితో కలిసి పాఠశాలకు వెళుతున్న 10 ఏళ్ల బాలికను లారీ ఢీ కొట్టింది. స్పాట్‌లో బాలిక మృతి చెందింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
Sensitive Content Alert 🚨
Maintain sufficient CAS from heavy vehicles.https://t.co/80Dmzlcn8V
— DriveSmart🛡️ (@DriveSmart_IN) June 27, 2025