Electric Bike Blast: చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం పేలి మృతి చెందింది ఓ మహిళ.. ఎలక్ట్రిక్ స్కూటికి చార్జింగ్ పెట్టిన తర్వాత ఒక్క సారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. పక్కనే సోఫాలో నిద్రిస్తున్న లక్ష్మమ్మ అక్కడికక్కడే మంటల్లో కాలిపోయి మృతి చెందారు. కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రోజూ ఉదయం తెల్లవారు జామున కడప జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ఎలక్ట్రిక్ బైక్ ఇంటి ఆవరణంలో పార్క్ చేసి అక్కడే నిద్రిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ అయినందున నైట్ మొత్తం బ్యాటరీ చార్జింగ్ పెట్టడం వల్ల ఈ రోజూ తెల్లవారుజామున ఒక్కసారిగా స్కూటీ పేలడంతో పక్కనే నిద్రిస్తున్న లక్ష్మమ్మ మంటల్లో కాలిపోయి అక్కడే సజీవదహనం అయ్యి మృతి చెందింది. అయితే దీనికి సంబంధించి నైట్ మొత్తం చార్జింగ్ పెట్టడం వల్ల అది హిట్ అయ్యి బైక్ పేలినట్టు తెలిపారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి ఎవరంటే?
ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వారు ఎక్కువగా ఉపయోగించిన తర్వాత వేడిగా ఉంటే, బ్యాటరీని ఛార్జ్ చేసే ముందు చల్లబరచండి. మీరు మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే బ్యాటరీలను ఛార్జ్ చేయడం మరియు అగ్ని ప్రమాదం జరిగితే మీరు త్వరగా స్పందించగలిగేలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు నిద్రపోతున్నప్పుడు లేదా ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు బ్యాటరీలను ఛార్జ్‌లో ఉంచవద్దు.