BigTV English
Advertisement

Dhoni Brothers : ధోని, అతని సోదరుడి మధ్య గొడవలు.. కారణమేంటి !

Dhoni Brothers : ధోని, అతని సోదరుడి మధ్య గొడవలు.. కారణమేంటి !

Dhoni Brothers : టీమిండియా మాజీ కెప్టెన్  మహేంద్రసింగ్ ధోనీ కి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అతను అవార్డు అందుకునేందుకు వెళ్లలేదు. ఆ సమయంలో వ్యవసాయం చేసుకుంటూ సోషల్ మీడియాలో కనిపించాడు. ఇదిలా ఉంటే.. ముఖ్యంగా వేగానికి పెట్టింది పేరు.. కళ్లు మూసి కళ్లు తెరిచేంతలో చాలా స్పీడ్ గా స్టంపింగ్ చేయడంలో దిట్ట. అదేవిధంగా క్రికెట్ లో సాధారణంగా కెప్టెన్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. కానీ ధోనీ ఎప్పుడూ కూడా ఒత్తిడిలో కనిపించలేదు. మైదానంలో కూల్ అండ్ కామ్ గా ఉండేవాడు. కెప్టెన్ గా కీలక నిర్ణయాలు తీసుకునే వాడు. ఈ విషయాలు అన్ని దాదాపు అందరికీ తెలిసే ఉంటాయి. ధోనీ హెలికాప్టర్ షాట్లతో పరుగులను రాబట్టాడు. జట్టుకు అవసరమైన సమయంలో అద్భుతంగా రాణించేవాడు. ఈ నేపథ్యంలో ధోనీ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.


Also Read :  Indian Team Captains: ధోని, రోహిత్ సక్సెస్.. గిల్ కు మాత్రం కోహ్లీ దరిద్రం… టీమిండియా వరుసగా ఓడిపోవడం ఖాయమైనా?

ఈ ‘ధోనీ’ ల మధ్య గొడవ.. 


మహేంద్ర సింగ్ ధోనీ, అతని సోదరుడు నరేంద్ర సింగ్ ధోనీ మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. నరేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంధ్ర సింగ్ ధోనీ కి అన్నయ్య. దాదాపు 10 సంవత్సరాలు పెద్దవాడు. నరేంద్ర సింగ్ ధోనీ పేరిట ఓ ఖాతా ఉంది. ఇటీవలే స్థానిక క్రికెట్ టోర్నమెంట్ కి అతను ముఖ్య అతిథిగా కూడా విచ్చేశాడు. వాస్తవానికి నరేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ కూడా తన సోదరుడు MS ధోనీతో బహిరంగంగా కనిపించలేదన్నది నిజం. ధోనీ క్రికెట్ కెరీర్ ప్రారంభంలో సోదరి జయంతి గుప్త కీలక పాత్ర పోషించింది. MS ధోనీ తండ్రి పాన్ సింగ్ ధోనీ, తల్లి దేవకి దేవి ఫోటోలు కూడా కనిపించాయి. అన్నయ్య లేని కుటుంబాన్ని ధోనీ బయోపిక్ మూవీ ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ లో కూడా చూపించడం గమనార్హం. నరేంద్ర రాజకీయ వేత్త అని కూడా కొన్ని నివేదికలు వెల్లడించాయి.

చివరికి ఇలా.. 

2013లో సమాజ్ వాది పార్టీలో చేరారు. అంతకు ముందు ఆయన బీజేపీలో కొనసాగారు. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారనే విషయం మాత్రం ఎలాంటి సమాచారం లేదు. నవంబర్ 21, 2007లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె కలరు. వీరిద్దరూ 2009లో గొడవపడ్డారు. ధోనీ క్రికెట్ లోకి వెళ్లడం వాళ్ల అన్నయ్యకి ఇష్టం లేదని కొందరూ.. వీరికి ఆస్తి గొడవలు అని మరికొందరూ ఇలా చాలా మంది రకరకాలుగా పేర్కొనడం గమనార్హం. మొత్తానికి వీరు   కొద్ది సంవత్సరాల వరకు వీరు మాట్లాడుకోలేదు. చివరికీ గత మూడు సంవత్సరాల నుంచి మాత్రమే వీరు మాట్లాడుకుంటున్నారు. వీరు ప్రస్తుతం కలిసి రాంచీలో సంతోషంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ధోనీ ఇటీవల ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. తొలుత చెన్నై జట్టు కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నాడు. అతను గాయాల కారణంగా దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ కి ఎం.ఎస్. ధోనీ 2025 సీజన్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో కొనసాగడం విశేషం.

Related News

Shreyas Iyer: చావు దాక వెళ్లి వ‌చ్చాడు, ఇప్పుడు బీకినీ పాప‌ల‌తో బీచ్ లో ఎంజాయ్ !

IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్‌…రంగంలోకి రోహిత్ శ‌ర్మ‌..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?

IPL 2026: చెన్నైలోకి సంజు.. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు కొత్త కెప్టెన్ ఎవ‌రంటే ?

Shubman Gill: ఫ్రెంచ్ మోడల్ తో శుభ్‌మ‌న్ గిల్ సహజీవనం..షాకింగ్ ఫోటోలు ఇదిగో!

Virat Kohli Restaurant: గోవాపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోట‌ల్ లాంచ్‌, ధ‌ర‌లు వాచిపోతాయి

Hong Kong Sixes 2025: మ‌రోసారి ప‌రువు తీసుకున్న పాకిస్తాన్‌…బ‌ట్ట‌ర్‌ ఇంగ్లీష్ రాక ఇజ్జ‌త్ తీసుకున్నారు

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

Big Stories

×