SCR Special Trains: ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని తీర్చడానికి సోమ, మంగళ, బుధవారాల్లో చర్లపల్లి నుంచి యలహంక, షాలిమార్ వైపు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రటించింది.
⦿ డిసెంబర్ 8న రాత్రి 10 గంటలకు చర్లపల్లి నుంచి యలహంకకు రైలు నంబర్ 017187, యెలెహంక నుంచి చర్లపల్లికి రైలు నంబర్ 07188ను నడిపినట్లు తెలిపింది.
⦿ డిసెంబర్ 9న మధ్యాహ్నం 1 గంటలకు చర్లపల్లి నుంచి షాలిమార్‌కు రైలు నంబర్ 07148 బయల్దేరుతుంది. డిసెంబర్ 10న మధ్యాహ్నం 12.10 గంటలకు షాలిమార్ నుంచి చర్లపల్లికి రైలు నంబర్ 07149 బయల్దేరుతుంది.
⦿ డిసెంబర్ 8న చర్లపల్లి నుంచి హెచ్. నిజాముద్దీన్ వరకు రైలు నంబర్ 07021 రాత్రి 9.45 గంటలకు బయలుదేరుతుంది. డిసెంబర్ 10న రైలు నంబర్ 07022 హెచ్. నిజాముద్దీన్ నుంచి చర్లపల్లికి ఉదయం 4 గంటలకు బయలుదేరుతుంది.
⦿ రైలు నంబర్ 07085 హైదరాబాద్ నుంచికొట్టాయం డిసెంబర్ 8న రాత్రి 9.50 గంటలకు బయల్దేరింది. రైలు నంబర్ 07086 డిసెంబర్ 10న ఉదయం 7.45 గంటలకు కొట్టాయం నుంచి హైదరాబాద్ కు ప్రారంభమవుతుంది.
గత కొద్ది రోజులుగా విమాన ప్రయాణ గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ఈ రైళ్లను నడుపుతుంది. జోనల్ రైల్వేలు షాలిమార్, చెన్నై, ముంబై, ఇతర గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లను నడిపాయి. వీటి ద్వారా దాదాపు 4,000 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంటుంది. బెంగళూరు, ఇతర ప్రాంతాల నుంచి పూణే, కోల్‌కతా, నిజాముద్దీన్ వైపు వెళ్లే ప్రత్యేక రైళ్లు జోన్ పరిధిలోని కాచిగూడ, విజయవాడ, ధర్మవరం స్టేషన్ల మీదుగా వెళ్తాయని తెలిపారు.
రైల్వే బోర్డు వీక్లీ సర్వీసును ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపినట్లు SCR ప్రకటించింది. రైలు నంబర్ 17425/17426 తిరుపతి – సాయినగర్ షిర్డీ – తిరుపతి (గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, సి శంభాజీనగర్ వయా) డిసెంబర్ 14న తిరుపతి నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డిసెంబర్ 9న ఉదయం 10 గంటలకు తిరుపతి- సాయినగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్ మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభిస్తారు. తిరుపతి నుంచి ఈ సర్వీసులు మంగళవారాల్లో, సాయినగర్ షిర్డీ నుంచి శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
Read Also: లోయర్ బెర్త్ విషయంలో కీలక నిర్ణయం, అసలు విషయం చెప్పేసిన అశ్విని వైష్ణవ్!
ఈ ఎక్స్ ప్రెస్ గూడూరు, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్ల గుండా వెళుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో అత్యాధునిక LHB కోచ్‌లు ఉంటాయి. రెండు AC II టైర్, 10 స్లీపర్ క్లాస్, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ఉంటుందని అధికారులు తెలిపారు.
Read Also: అద్భుతం.. తిరుపతికి బుల్లెట్ రైలు, ఎక్కడి నుంచి ఎక్కడికంటే?