E-Paper
Advertisement

Alwal Fire Accident: నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు

Alwal Fire Accident: నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులు
Advertisement

Alwal Fire Accident: మేడ్చల్ జిల్లాలోని అల్వాల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సిటిజన్ కాలనీలోని నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఉన్న ఏసీలు ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగి, క్షణాల్లో ఐదో అంతస్తుకు వ్యాపించాయి.ఈ ఘటన జరిగిన సమయంలో హాస్టల్‌లో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు.

భవనం చుట్టూ పూర్తిగా గ్లాస్ ఫిట్టింగ్ ఉండటంతో.. మంటల వల్ల వచ్చిన దట్టమైన పొగ బయటకు వెళ్లే మార్గం లేక లోపలే పేరుకుపోయింది. దీంతో ఊపిరి ఆడక విద్యార్థులు తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పొగ ధాటికి ఆరుగురు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

మొత్తం నాలుగు అంబులెన్సులు, ఒక ఫైర్ ఇంజన్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. స్పృహ కోల్పోయిన విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బిల్డింగ్ డిజైన్ వల్ల పొగ బయటకు పోకపోవడమే ప్రమాద తీవ్రత పెరగడానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

ALSO READ:  లక్షలాది భక్తులకు భరోసా.. మేడారంలో 50 పడకల సూపర్ స్పెషాలిటీ సేవలు

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×