E-Paper
Advertisement

Amazon Care Fraud: అమెజాన్ కస్టమర్ కేర్‌ పేరుతో టోకరా, క్షణాల్లో లక్షన్నర హాంఫట్!

Amazon Care Fraud: అమెజాన్ కస్టమర్ కేర్‌ పేరుతో టోకరా, క్షణాల్లో లక్షన్నర హాంఫట్!
Advertisement

Hyderabad Cyber fraud:హైదరాబాద్‌ లోని గాంధీనగర్‌లో నివసిస్తున్న 62 ఏళ్ల  వ్యక్తి నవంబర్ 14న అమెజాన్‌ లో తనకు నచ్చిన ఓ వస్తువుకు ఆర్డర్ చేశాడు. నాలుగు రోజుల తర్వాత అంటే నవంబర్ 18న అతడికి ఓ కాల్ వచ్చింది. తప్పుడు డెలివరీ అడ్రస్ కారణంగా, ఆర్డర్ రద్దు చేయబడిందని అతడికి చెప్పాడు. ఆ తర్వాత ను మరోసారి ఆర్డర్ పెట్టుకున్నాడు. అది కూడా అనుకున్న సమయానికి డెలివరీ కాలేదు. నవంబర్ 22న అతడు అమెజాన్ కస్టమర్ కేర్ కోసం గూగుల్ లో వెతికాడు. టోల్ ఫ్రీ నంబర్‌ ను తెలిసుకుని, కాల్ చేశాడు.

అమెజాన్ పేరుతో ఘరానా మోసం

అతడు కాల్ చేసిన తర్వాత,  అమెజాన్ సపోర్ట్ అనే పేరుతో తెలియని నంబర్‌ల నుండి వాట్సాప్ కాల్స్ వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తి రూ.10 వెరిఫికేషన్‌ గా డిపాజిట్ చేయకపోతే ఆర్డర్ మళ్లీ రద్దు చేయబడుతుందని చెప్పాడు. రూ.10 వెరిఫికేషన్‌  అవసరమని చెప్తూ ఒక OTPని షేర్ చేయమని అడిగాడు. సదరు వ్యక్తి వారిని నమ్మి ఓటీపీని షేర్ చేశాడు. ఈ OTP ని ఉపయోగించి, సైబర్ కేటుగాళ్లు ఆయన అకౌంట్ లోని రూ.1,36,890 కొల్లగొట్టారు.ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఆయన కేసును పోలీసులు విచారిస్తున్నారు. అదే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన కాల్స్ కు ఎలాంటి వ్యక్తిగత వివరాలు షేర్ చేయకూడదని చెప్పారు.

సైబర్ నేరస్తుల వలలో చిక్కకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు  

Advertisement

⦿ నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, OTP మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

⦿ ప్రముఖ కంపెనీల కస్టమర్ కేర్ ప్రతినిధుల వలె నటించే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Advertisement

⦿ Google లో కనిపించే కస్టమర్ కేర్ నంబర్లను నమ్మకూడదు.

⦿ ఆయా కంపెనీలకు సంబంధించిన అధికారిక యాప్/వెబ్‌ సైట్ లో వివరాలను మాత్రమే సరైనవిగా నిర్ధారించుకోవాలి.

⦿ ఓటీపీలు, పిన్‌ నెంబర్లు, పాస్‌ వర్డ్‌లు, బ్యాంక్ వివరాలను ఫోన్, వాట్సాప్, SMS ద్వారా ఎవరితోనూ పంచుకోవద్దు.

Read Also: ఐ ఫోన్ బాక్స్.. లంచ్ బాక్స్ గా.. నువ్ మామూలోడివి కాదురా అయ్యా!

⦿ అమెజాన్ లాంటి కంపెనీలు ఆర్డర్ వెరిఫికేషన్, డెలివరీ కన్ఫర్మేషన్, రీఫండ్ ప్రాసెస్‌ కోసం ఎప్పుడూ డబ్బులు అడగరు.

⦿ కస్టమర్ సపోర్ట్ పేరుతో తెలియని నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయకూడదు.

⦿ మీకు అనుమానాస్పద కాల్స్ వస్తే, వెంటనే డిస్‌ కనెక్ట్ చేసి, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.

⦿ సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌ లైన్ నెంబర్ కు కాల్ చేసి చెప్పాలి. లేదంటే www.cybercrime.gov.inలో కంప్లైంట్ చేయాలి.

⦿ సైబర్ మోసాలకు సంబంధించి అత్యవసర పరిస్థితిలో ఈ వాట్సాప్ నెంబర్ (8712665171)కు కాల్ చేయాలి. లేదంటే వాట్సాప్ చేయాలి.

Read Also: బర్త్ డే బంప్స్.. స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పటించి కేరింతలు కొట్టిన ఫ్రెండ్స్, చివరికి…

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×