MS Dhoni: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( IND VS SA) మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 3 వన్డేలు జరగనున్నాయి. అయితే మొట్ట మొదటి వన్డే సిరీస్, జార్ఖండ్ రాజధాని రాంచిలో ఉన్న JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ లో ( JSCA International Stadium Complex, Ranchi )
జరగనుంది. ఈ మేరకు టీమిండియా ప్లేయర్లు రాంచికి చేరుకున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ కూడా ఉన్నారు. రేపటి నుంచి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టనున్నారు టీమిండియా క్రికెటర్లు.
దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదటి వన్డే ఆడేందుకు రాంచీకి దక్షిణాఫ్రికా అలాగే టీమిండియా జట్లు వచ్చాయి. ఈ జట్టులో విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ కూడా ఉన్నారు. ఈ తరుణంలో టీమిండియాను కలిసేందుకు స్టేడియానికి నేరుగా మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు. ధోనిది కూడా రాంచీ అన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే, రాంచికి వచ్చిన టీమిండియా ప్లేయర్లకు దావత్ ఇవ్వాలని ధోని నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో నేరుగా రాంచీ స్టేడియంలో ఉన్న టీమిండియా ప్లేయర్లను కలిసి దావత్ కు ఇన్వైట్ చేశాడు. రేపు సాయంత్రం తన ఇంటిలో పార్టీ నిర్వహించేందుకు ధోని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. రాంచీ వేదికగా నవంబర్ 30వ తేదీన వన్డే ఉండ నేపథ్యంలో, రేపు అంటే నవంబర్ 28వ తేదీన దావత్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఇక ఈ పార్టీకి టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా సిబ్బందిని కూడా ఇన్వైట్ చేశాడు ధోని. రేపు కచ్చితంగా ఆ పార్టీకి హాజరవుతామని టీమిండియా ప్లేయర్ లందరూ ధోనికి హామీ ఇచ్చారట. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం తాను రాబోనని ముఖం మీదే చెప్పేసినట్లు తెలుస్తోంది. తాను ఢిల్లీకి వెళ్లాల్సిన పని ఉందని వెళ్లిపోయాడట.
టీమిండియా ప్లేయర్లు ఉన్న రాంచీ ( JSCA International Stadium Complex, Ranchi ) స్టేడియానికి మహేంద్రసింగ్ ధోని బైక్ పైనే వచ్చేసాడు. ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్లను ( Team India) కలిసి విందుకు ఆహ్వానించాడు ధోని. అనంతరం బైక్ పైనే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ధోని అంటే సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అంటూ ఈ వీడియోని చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Ms Dhoni leaving JSCA stadium Ranchi today when Rohit Sharma, Virat Kohli and other team members practicing there.❤️ https://t.co/EsrpFBFLum pic.twitter.com/eZXZgLKNmD
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 27, 2025
🚨MS DHONI HOSTS DINNER FOR ROHIT -VIRAT & INDIAN TEAM🚨
"Rohit Sharma, Virat Kohli, and the entire Indian team may receive an invitation from MS Dhoni for dinner at his home tomorrow. Whenever the Indian team comes to Ranchi, Dhoni often invites team over for dinner". pic.twitter.com/EnFAkYIlZ5
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 27, 2025