Annamaya District News: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ములకల చెరువు మండలం పెద్దచెరువులో నీట మునిగి నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పోలీసులు వివరాల ప్రకారం.. ములకలచెరువు మండాలనికి చెందిన ఈశ్వరమ్మ అనే మహిళ బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లింది. అయితే ఈశ్వరమ్మ తనతో పాటు పిల్లలను కూడా చెరువు వద్దకు తీసుకెళ్లింది. అయితే అక్కడే చెరువు పక్కనే ఈశ్వరమ్మ కూతరు లావణ్య, కొడుకు నందకిశోర్ ఆడుకుంటూ చెరువులోని నీటిలోకి దిగారు. ఆ ఇద్దరి పిల్లలతో పాటు మరో చిన్నారి నందిత కూడా నీళ్లలోకి దిగింది. అయితే వీరు నీళ్లలో దిగడం.. ఈశ్వరమ్మ గమనించలేదు. ముగ్గురు పిల్లలు మునిపోవడం ఆలస్యంగా గమనించిన ఈశ్వరమ్మ తన భర్త మల్లేష్ కు సమాచారం ఇచ్చింది. వారిని కాపాడేందుకు మల్లేష్ ప్రయత్నించాడు.
ALSO READ: Crime News: తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన కసాయి కొడుకు
అయితే నీటిలో ముగినిన ముగ్గురు పిల్లలతో పాటు, వారిని కాపాడేందుకు వెళ్లిన మల్లేష్ కూడా నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు చెరువులో నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Hyderabad News: హైదరాబాద్‌లో 230 మంది పాకిస్థానీలు.. తిరిగి వెళ్లకుంటే..?