OTT Movie : ఒక అదిరిపోయే బెంగాలీ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనిని హారర్ థ్రిల్లర్ జానర్ లో రూపొందించారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఒక గ్రామంలో జరిగే వరుస మరణాలకు, మంత్రాలే కారణం అని గ్రామస్తులు భావిస్తారు. ఆ తర్వాత అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ బెంగాలీ వెబ్ సిరీస్ పేరు ‘డైనీ’ (Dainee). 2025 లో విడుదలైన ఈ సిరీస్ కు నీర్ఝర్ మిత్ర దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ హోయ్‌చోయ్ (Hoichoi), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీని స్టోరీ మూఢనమ్మకాలు, మంత్రగత్తెను వేటాడటం వంటి దారుణమైన సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఇందులో మిమీ చక్రబొర్తి, కౌశనీ ముఖర్జీ, బిస్వజిత్ దాస్, శ్రుతి దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు.
స్టోరీలోకి వెళితే
పాటా, లతా అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉంటారు. తండ్రితో గొడవపడి ప్రియుడితో వెళ్ళిపోతుంది పాటా. ఇక చెల్లి లతా ఒంటరిగా ఇంటి దగ్గరే ఉండిపోతుంది. కొన్ని సంవత్సరాల తరువాత పాటా ఇండియాకి తిరిగి వస్తుంది. ఆమె తల్లిదండ్రులు చనిపోవడంతో, ఆ ఇంటిని అమ్మి మళ్ళీ వెళ్లిపోవాలని అనుకుంటుంది. అయితే చెల్లెలు కూడా సంతకం పెట్టాల్సి రావడంతో, ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే తన సోదరి లతా ఒక గ్రామంలో మంత్రగత్తె ఆరోపణలు ఎదుర్కొంటూ, దారుణంగా దెబ్బలు తింటూ ఉంటుంది. ఆ గ్రామంలో వరుస మరణాలకు లతాను కారణంగా చూపి ఇలా చేస్తుంటారు. ఆమెను గ్రామస్తులు సజీవదహనం చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ దారుణమైన సంఘటనను చూసిన పాటా తన సోదరిని రక్షించడానికి వెళ్తుంది.
గ్రామస్తుల మూఢనమ్మకాలు, అణచివేత ధోరణితో పాటా ధైర్యంగా పోరాడుతుంది. గ్రామంలోని జాన్ గురు అనే శక్తివంతమైన వ్యక్తి, గ్రామస్తుల భయాలను సాకుగా చూపి వారిని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. పాటా తన డ్రైవర్ సహాయంతో ఈ క్రూరమైన హింసను ఆపడానికి ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తుంది. పాటా, లతా గతంలో దూరమైనప్పటికీ కష్ట సమయంలో ఇప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తారు. చివరికి అక్క, చెల్లెల్ని కాపాడుతుందా ? గ్రామంలో జరిగిన సంఘటనలకు కారణం ఎవరు ? లతను మంత్రగత్తెగా ఎందుకు అనుమానించారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూడండి.
READ Also : పెళ్ళికి అడ్డు వస్తోందని, ప్రియురాలి మర్డర్ కి స్కెచ్ … ఈ ప్లాన్ చూస్తే మెంటలెక్కడం ఖాయం మావా