Hyderabad Crime: తెలంగాణ రాజ్‌భవన్ చోరీ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు చోరీ గురించి దర్యాప్తు చేస్తుంటే నిందితుడికి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు శ్రీనివాస్ మామూలోడు. ఈ వారంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు కేసులో ఊహించని విషయాలు బయటకువచ్చాయి.
శ్రీనివాస్ మామూలోడు కాదు
నిందితుడు శ్రీనివాస్ ఓ బ్లాక్ మెయిలర్. రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేస్తున్న విషయాన్ని మరిచిపోయాడు. తన మనసులోని ఆలోచనలను బయటపెట్టాడు. రాజ్‌భవన్‌లో పని చేస్తున్న తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేశాడు. ఓ మహిళను భయభ్రాంతులకు గురి చేశాడు. తోటి మహిళకు మార్ఫింగ్ చేసిన ఫోటోలను చూపించాడు.
తనకు ఈ ఫోటోలు ఎవరో పంపించారు, జాగ్రత్త అని చెప్పివారిని అలర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. వాటిని ఆమెకు పంపాలని భావించాడు. పరిస్థితి గమనించిన ఆ మహిళా ఉద్యోగి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆ మార్ఫింగ్ ఫోటోలు చేసింది శ్రీనివాస్ అని తేల్చారు.
వాటిని బయట వ్యక్తి పంపినట్టు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేయడం, ఆపై రిమాండ్‌కు తరలించడం చకచకా జరిగిపోయింది. ఈ విషయం తెలియగానే రాజ్‌భవన్ అధికారులు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. జైలుకు వెళ్లిన శ్రీనివాస్ రెండురోజుల తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యాడు.
ALSO READ: ఘనంగా పెళ్లి.. అంతలోనే ఊహించని షాక్
ఇదీ అసలు జరిగింది?
నేరుగా రాజ్‌భవనకు వెళ్లాలని ప్రయత్నం చేశాడు. సస్పెండ్ చేసిన విషయాన్ని తెలుసుకున్నాడు. జైలు నుండి వచ్చిన తర్వాత రాత్రి వేళ అక్కడి సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. మొదటి అంతస్తులోని సుధర్మ భవన్‌లోకి హెల్మెంట్ పెట్టుకుని ప్రవేశించాడు. నాలుగు హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్లాడు.
సీసీటీవీ ఫుటేజ్‌లో శ్రీనివాస్ హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్తున్నట్లు కనిపించింది. హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో వాటిని డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన మే 14న జరిగింది. ఫుటేజ్ పరిశీలన అనుమానాస్పద వ్యక్తి కనిపించడం, హార్డ్ డిస్కులు మాయం కావడంతో రాజ్‌భవన్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు, ఎట్టకేలకు శ్రీనివాస్‌ని అరెస్టు చేశారు. సెక్యూరిటీని మాయ చేసి నైట్ టైమ్‌లో రాజ్ భవన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వారంలో రెండుసార్లు శ్రీనివాస్ అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. చోరీ చేసిన హార్డ్ డిస్క్‌లో ఎలాంటి కీలక సమాచారం లేదని తెలిపారు పోలీసులు.