World Bee Day| మనుషులకు రుచికరమైన, ఆరోగకరమైన తేనె అందించే తేనెటీగలు ప్రకృతిలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. తేనెటీగలు లేని ప్రకృతిలో మనుషులు ఎక్కువ కాలం బతికి ఉండలేరని పరిశోధనలో వెల్లడైంది. మే 20న ప్రతీ సంవత్సరం తేనెటీగల దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటారు. ఈ నేపథ్యలో తేనెటీగల ప్రాముఖ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ దినోత్సవాన్ని జరపడం వెనుక ప్రధాన ఉద్దేశం – తేనెటీగల ప్రాధాన్యతను ప్రపంచానికి గుర్తుచేయడం, వాటిని సంరక్షించాల్సిన అవసరాన్ని కలిగించడమే. తేనెటీగలు చిన్న జీవులు కావచ్చు, కానీ ప్రకృతి సమతుల్యత, మానవ ఆహార భద్రత, వ్యవసాయ అభివృద్ధిలో వీటి పాత్ర అపారంగా ఉంటుంది. తేనె, మోముతో పాటు, పంటల ఫలదీకరణంలో తేనెటీగల సహకారం అమూల్యమైనది.
రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. భూమిపై తేనెటీగలు లేకపోతే మనిషి కేవలం నాలుగేళ్లే బతకగలడు. దీనిని ప్రముఖ శాస్త్రవేత్త ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్ కూడా స్వయంగా వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోతోంది. సుమారు 90 శాతం తేనెటీగలు ఇప్పటికే అంతరించిపోయాయి. ఇప్పుడు కేవలం 10 శాతం మాత్రమే మిగిలినవి. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో తేనెటీగలను ల్యాబ్‌లలో ప్రత్యేకంగా పెంచాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ఇది పర్యావరణానికి, మన భవిష్యత్తుకు కూడా చాలా ప్రమాదకరం.
తేనెటీగల పాత్ర వ్యవసాయంలోనూ అమోఘం. ప్రపంచవ్యాప్తంగా పండించే 100 రకాల పంటలలో 90 రకాల పంటల ఫలదీకరణం తేనెటీగల వల్లనే జరుగుతుంది. అంటే మనం తినే పదార్థాల్లో అధిక శాతం తేనెటీగల కృషి ఉంది. తేనెటీగలు పూల నుంచి పుప్పొడి (పాలెన్)ను ఒక పుష్పం నుండి మరొకదానికి తరలించటం ద్వారా ఫలదీకరణ ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేస్తాయి. ఈ ప్రక్రియ లేకపోతే పంట దిగుబడులు భారీగా తగ్గిపోతాయి.
Also Read: ఏఐ ఉందిగా అని ఉద్యోగులను తొలగించిన కంపెనీ.. నిండా మునిగింది
ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరగడం తేనెటీగలకు కొత్త ముప్పుగా మారింది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ తేనెటీగల దిశా జ్ఞానాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇవి తేనెటీగలు తమ గూడుకు తిరిగి చేరడంలో ఇబ్బంది పడేలా చేస్తున్నాయి. దీంతో తేనెటీగలు ఆహారం లేక మరణిస్తున్నట్లు పలు శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
మన జీవవైవిధ్యాన్ని కాపాడాలంటే తేనెటీగలను కాపాడటం అత్యవసరం. ప్రకృతిలో ప్రతి జీవానికి బతికే హక్కు ఉంది. అయితే మనిషి స్వార్థం ఇతర జీవులను నాశనం చేస్తున్నాడు. స్వార్థం కోసం మిగతా జీవుల ఉనికిని ముప్పుపెట్టే విధంగా వ్యవహరించడం ఎంత పెద్ద తప్పు అనేది అంతరించి పోతున్న తేనెటీగల ద్వారా వచ్చే ప్రమాదంతో తెలుస్తోంది. తేనెటీగలు లేనిదే ప్రకృతి వ్యవస్థ స్థిరంగా ఉండకపోవడం, ఆ ప్రభావం చివరకు మానవ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే అవకాశం ఉండడం గమనించాల్సిన విషయం.
ఈ ప్రపంచ తేనేటీగల దినోత్సవం సందర్భంగా.. వాటిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమే అని గుర్తు పెట్టుకోవాలి.