Woman tied to tree, Burnt Alive By Her Sons: త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిని ఏకంగా కుమారులే సజీవ దహనం చేశారు. 62 ఏళ్ల వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి నిప్పు అంటించారు. దీంతో ఆమె అక్కడే సజీవ దహనమైంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. కుటుంబ కలహాలతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్ బరిలో 62ఏళ్ల వృద్ధురాలిని కన్న కుమారులే చెట్టుకు కట్టి సజీవ దహనం చేశారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. ఒక మహిళను బతికుండగానే సజీవ దహనం చేశారని తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. విచారణలో ఆ వృద్ధురాలిని తన ఇద్దరు కుమారులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.
చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు జిరానియా సబ్ డివిజినల్ పోలీసు అధికారి కమల్ పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు
గతేడాది ఆ మహిళ భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు మొత్తం ముగ్గురు కుమారులు ఉండగా.. ఓ కుమారుడు అగర్తలాలో నివసిస్తున్నాడు. భర్తను కోల్పోయిన తర్వాత అప్పటినుంచి ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది. అయితే గత కొంతకాలంగా ఆమెతో ఆ ఇద్దరు కుమారులు తరుచూ గొడవలకు దిగేవారని పోలీసులు విచారణలో తేలింది.
శనివారం సాయంత్రం ఆమెకు ఇద్దరు కుమారులకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయంలోనే కోపంతో ఉన్న ఆ ఇద్దరు కుమారులు చంపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి ఆ మహిళను చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు. దీంతో ఆమె సజీవ దహనమైంది. పోలీసులు మొదట ఎవరైనా చంపి నిప్పు పెట్టారనే అనుకొని విచారణ చేశారు. కానీ కుమారులే తల్లి బతికి ఉండగానే చంపినట్లు తేలింది.
చెట్టుకు కాలిన మృతదేహాం వేలాడుతూ కనిపించింది. దీనిని చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అలాగే కాలిన మృతదేహాన్ని చెట్టు నుంచి వేరుచేసి పోస్టుమార్టం పంపించామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని జిరానియా సబ్ డివిజనల్ పోలీసు అధికారి జిరానియా కమల్ కృష్ణ కోలోయ్ తెలిపారు.