EPAPER

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Israel vs Hezbollah War: హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌ ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటి?

Hezbollah’s Dangerous Operation: హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణంతో మధ్యప్రాశ్చం రగిలిపోతోంది. ఇజ్రాయెల్ సంబరాలు చేసుకుంటుంటే.. హిజ్బుల్లా, దాని మిత్రపక్షాలు సరికొత్త యుద్ధ వ్యూహాలకు పదను పెడుతున్నారు. తమ నాయకుణ్ని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోడానికి హిజ్బుల్లా డేంజరస్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యింది. దీని కోసం, ప్రపంచంలో అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన హిజ్బుల్లా ‘బ్లాక్ యూనిట్-910’ను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్‌కు చెందిన ముసాద్ లాంటిదే ఈ యూనిట్‌-910. ఇంతకీ, ఈ డేంజరస్ యూనిట్ ఏం చేయబోతోంది..? హిజ్బుల్లా, ఇరాన్, హమాస్‌లు ప్రతీకారం తీర్చుకుంటాయా? శత్రువుల ప్లాన్‌లను ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కోనుంది..?


దెబ్బకు దెబ్బ.. రక్తానికి రక్తం.. ఇదే యుద్ధ నీతి. దానికే లెబనాన్‌లోని హిజ్బుల్లా సిద్ధమయ్యింది. తాజాగా హిజ్బుల్లా హెడ్, హసన్ నస్రల్లాను బాంబులతో పేల్చిసిన ఇజ్రాయెల్‌పై ఇప్పుడు తీవ్రమైన పగతో రగలిపోతుంది హిజ్బుల్లా. ఇటీవల కాలంలో దాదాపు 19 మంది హిజ్బుల్లా లీడర్లను మట్టుబెట్టింది ఇజ్రాయెల్. గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఆకస్మిక దాడి తర్వాత జరిగిన పరిణామాలే ఇవన్నీ. అయితే, హమాస్‌కు సపోర్ట్‌గా ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి పలు రాడికల్ గ్రూపులు కూడా రంగంలోకి దిగాయి. అందులో ఒకటే లెబనాన్ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్లా. రాడికల్ సంస్థగా ఏర్పడి, లెబనాన్ పార్లమెంట్‌లో బలమైన ప్రాతినిధ్యం పొందే వరకూ ఎదిగిన అత్యంత పవర్ ఫుల్ గ్రూపు. అయితే, తమను 30 ఏళ్లు నడిపించి, ఇంత స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు నస్రల్లా ఇప్పుడు లేడు. లెబనాన్‌లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ఉద్యమానికి వెన్ను దన్నన్నుగా ఉన్న నస్రల్లా మరణాన్ని హిజ్బుల్లాతో పాటు ఇరాన్ కూడా చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోడానికి ఒక డేంజరస్ ప్లాన్‌ చేసింది. దాని కోసం హిజ్బుల్లా సీక్రెట్ యూనిట్ 910ను రంగంలోకి దించుతోంది.

ప్రపంచంలోని అత్యంత రహస్య, ప్రమాదకర యూనిట్లలో ఒకటి హిజ్బుల్లాకు చెందిన బ్లాక్ యూనిట్ 910. నస్రల్లా హత్యకు ప్రతికారంగా ఈ యూనిట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీలు లక్ష్యంగా ఆపరేన్లు షురూ చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, ఒక్క ఇజ్రాయెల్‌లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ, కోవర్ట్ ప్లాన్ ప్రారంభించినట్లు సమాచారం. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీలను లక్ష్యంగా చేసుకున్న ఈ షాడో యూనిట్ హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థల్లో కోవర్ట్ విభాగంగా పనిచేస్తుంది. గతంలో అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియాల్లో ఇజ్రాయెల్ వాసులపై పలు దాడులు చేసింది. దాదాపు 32 ఏళ్ల క్రితం కూడా నాటి హిజ్బుల్లా నాయకుడు, నస్రల్లా గురువు అయిన అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు చంపిన సమయంలోనూ ఈ యూనిట్ ప్రతీకార దాడులకు దిగింది.


హిజ్బుల్లాకు షాడో యూనిట్‌గా పనిచేసే అత్యంత రహస్య, ప్రమాదకర యూనిట్లలో దీనిని ఒకటిగా భావిస్తారు. తలాల్ హమియా అలియాస్ అబు జాఫర్ దీనికి నాయకత్తవం వహిస్తున్నాడు. లెబనాన్ బయట హిజ్బుల్లాకు చెందిన రహస్య దాడులన్నింటినీ ఇదే నిర్వహిస్తుంది. ఈ యూనిట్ నేరుగా హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాకు రిపోర్ట్ చేసే సంస్థ. ఇది ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కోర్‌‌తో కలిసి పనిచేస్తుంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులతో కూడా టచ్‌లో ఉంటుంది. ఈ యూనిట్ చేసిన గత దాడులను బట్టి, చూస్తే చాలా తక్కువ సమయంలోనే భారీగా ప్రతీకార దాడులను ప్రారంభించగల సామర్థ్యం ఉన్న గ్రూపు. అంతర్జాతీయ దాడుల్లో ఆరితేరిన ఈ గ్రూపుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక షియా నెట్‌వర్క్‌లు, నేర సంస్థల సాయం ఉంటుంది. మరో కంటికి తెలియకుండా పనులు పూర్తి చేయడంలో ఇజ్రాయెల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ ముసాద్ కంటే మించిపోయింది.

Also Read: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పనిచేయడమే యూనిట్ 910 లక్ష్యం. ఈ యూనిట్, మిడిల్ ఈస్ట్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సమాచారాన్ని సేకరిస్తుంది. అలాగే, ఇరాన్ పాలనకు వ్యతిరేకులు, ముల్లాల విధానాన్ని వ్యతిరేకించేవారు, ఆయుధాల మద్దతుదారుల కోసం అన్వేషణ సాగిస్తుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి కార్యకలాపాలతో పాటు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్‌కు గూఢచారి స్టేషన్‌లుగా పనిచేస్తుంది. దీనికి పలు దేశాల్లో అనేక క్లయింట్ సెల్‌లు కూడా ఉన్నాయి. ఈ డేంజరస్ యూనిట్… హిజ్బుల్లా, ఇరాన్, అరబ్ విదేశీ ప్రయోజనాలకు ముప్పు కలిగించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, హత్యలకు పాల్పడుతుంది. దీని ప్రత్యేక ఇంటర్‌లాకింగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్‌ను అర్థం చేసుకోవడం ఇజ్రాయెల్ ముసాద్, అమెరికా సీఐఏకు కూడా సాధ్యం కాదంటేనే ఇది ఎంత డేంజరస్సో తెలుస్తుంది. ఈ యూనిట్‌కు పలు ఆపరేషనల్ యూనిట్‌లు కూడా ఉంటాయి. ఇవి అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్‌లో కలిసి పనిచేస్తుంటాయి.

లెబనాన్‌లో కాకుండా ఇతర దేశాల్లో పుట్టిన కుటుంబాల నుండి వచ్చిన వారే ఈ యూనిట్‌లో సభ్యులుగా ఉంటారు. ప్రధానంగా వీళ్లంతా లెబనీస్ షియాల చిన్న చిన్న సమూహాలుగా ఉంటారు. వీరిలో దాదాపు అందరికీ విదేశీ గుర్తింపు పొందిన డాక్యుమెంట్లు ఉంటాయి. వీటి ద్వారా వీళ్లంతా పర్యాటకులగానో లేదంటే, వ్యాపారవేత్తలుగానో.. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తుంటారు. క్షేత్ర స్థాయిలో భద్రత, రహస్య కార్యకలాపాలు, విధ్వంసక పద్ధతులు, రహస్య ఆపరేషన్లు.. అవసరమైతే, ఏ దేశం నుండి అయినా పారిపోడానికి కావాల్సిన అన్ని వ్యవస్థలను ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. పని ముగించుకొని దేశం దాటడానికి కావాల్సిన అధికారిక అనుమతులను అందించడానికి ఈ యూనిట్‌కు చెందిన బలగాలన్ని సిద్ధంగా ఉంటాయి. దీని కోసం, ఈ యూనిట్‌లో సభ్యులకు ప్రత్యేకంగా, సుదీర్ఘమైన, సంక్లిష్టమైన భద్రతా శిక్షణను కూడా ఇస్తారు. దాదాపు ఆరు సంవత్సరాలు దీనికి సంబంధించిన కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న తర్వాతే ఇందులో రహస్య సైనికులుగా మారతారు.

ఒక విధంగా, యూనిట్ 910 ఆపరేషన్లలో సక్సెస్ రేటు 90 శాతానికి ఎక్కువగానే ఉంటుందన్నది అంతర్జాతీయ టెర్రరిస్ట్ విశ్లేషణా నివేదికలు చెబుతున్న మాట. ఇలాంటి బలమైన, క్రూరమైన గ్రూపును ఇప్పుడు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోడానికి హిజ్బుల్లా ప్రయోగించాలని అనుకుంటుంది. అయితే, నస్రల్లా హత్య తర్వాత యూనిట్ 910 కార్యకలాపాలను ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్‌గా ఆపరేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే, ఇజ్రాయెల్, యూనిట్ 910 ఎంట్రీని ఊహించింది. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెలీ నేతలను కూడా అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే, పాశ్చాత్య దేశాలు కూడా యూనిట్ 910 ఏం చేయబోతుందో అనే అంచనాలు వేస్తున్నారు. దీనికి సంబంధించి, ఇజ్రాయెల్ స్వదేశంలోనే కాక విదేశాల్లో కూడా తమ నిఘా సంస్థలను సిద్ధం చేసింది. ఒక వైపు, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై యుద్ధం కొనసాగిస్తూనే, అంతర్జాతీయంగా తమ వారిని కాపాడుకోడానికి నానా ప్రయత్నాలూ చేస్తుంది.

 

Related News

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

Bigg Boss 8 Day 33 Promo1: మార్నింగ్ మస్తీ.. చిలకజోస్యంతో అదరగొట్టిన మణికంఠ..!

×