Jharkhand Crime News: జార్ఖండ్‌లో దారుణ ఘటన జరిగింది. వివాహ వేడుక నుంచి తిరిగి వస్తున్న ఐదుగురు గిరిజన బాలికలపై కొందరు కిరాతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం 18 మంది మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో కుంతిలో జరిగింది. ఓ వివాహ వేడుక నుంచి బాలికలు ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో18 మంది కిరాతకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 16 ఏళ్లకు పైబడిన వారిని పెద్దలుగా పరిగణించి విచారణ కొనసాగిస్తామని పోలీసులు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన 18 మంది మైనర్లే అని తెలిపారు. బాధిత బాలికలకు ప్రభుత్వం తరుఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా చెప్పారు.
ALSO READ: CISF Recruitment: గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇంకెందుకు ఆలస్యం..
ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఇలాంటి కిరాతకులు ఇలాంటి పనులు చేయకుండా ఉండాలంటే 16 ఏళ్లకు పైబడిన వారిని పెద్దలుగా పరిగణించాలని ఆయన తెలిపారు. ఈ కేసులో 12 నుంచి 17 ఏళ్ల గల నిందితులను జువైనల్ హోమ్‌కి పంపించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన శుక్రవారం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అన్నారు. సామూహిక అత్యాచారానికి గురైన బాలికలకు వైద్య పరీక్షలు జరిపించామని తెలిపారు. ఐదుగురు గిరిజన బాలికలపై బాలురు సామూహిక అత్యాచారం చేశారని, బాలికల్లో ముగ్గురు 12 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారని, ఆ అమ్మాయిలు రానియా ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ALSO READ: NAFED Recruitment: ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ భయ్యా.. నెలకు రూ.1,50,000 జీతం.. ఇంకా మూడు రోజులే..!
దీనిపై బాధిత బాలికల కుటుంబీకులు రానియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని ఖుంటీ పోలీస్ అధికారులు తెలిపారు. నిందితులపై పోక్సో, అత్యాచార చట్టాల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.