Bangalore Akanksha: ఏరో స్పేస్ ఇంజనీర్ ఆకాంక్ష మృతి వెనుక అసలు గుట్టు వీడింది. ప్రేమ కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు జలంధర్ పోలీసులు తేల్చారు. ఆకాంక్ష కుటుంబసభ్యులు ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. యువతి మృతిపై లోతుగా విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఊహించి నిజాలు వెలుగుచూశాయి.
అసలు స్టోరీ ఏంటి?
కర్ణాటకలో దర్మస్థలంలోని బోళియార్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఆకాంక్ష మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఢిల్లీలోని ఓ విమానాల కంపెనీలో పని చేస్తున్న ఆకాంక్ష, ప్రేమ వైఫల్యం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఈనెల 17న కర్ణాటక నుంచి పంజాబ్ వెళ్లింది ఆకాంక్ష.
విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నందున సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు పంజాబ్‌లోని ఫగ్వాడ ప్రాంతంలోని ఎల్ పీయూ విద్యా సంస్థకి వెళ్లింది. విద్యాసంస్థకు చెందిన భవనంలోని నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆకాంక్షది హత్య అని భావించిన కుటుంబసభ్యులు జలంధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత అనుమానాస్పద కేసు నమోదు చేశారు.
ఆకాంక్ష వ్యవహారంపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయినా పేరెంట్స్ అవేమీ పట్టించుకోలేదు. తమ కూతురు ఆకాంక్ష హత్య అని భావించారు ఆమె పేరెంట్స్. ఈ క్రమంలో రాష్ట్రపతి, కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తమ కూతురు మృతి అనుమానాస్పద మృతి వెనుక నిజాలు నిగ్గుతేల్చాలని అందులో ప్రస్తావించారు.
ALSO READ: లారీని ఢీ కొట్టిన టూరిస్టు బస్సు, నలుగురు మృతి, 20 మందికిపైగా గాయాలు
ప్రేమలో పడిన ఆకాంక్ష
రంగంలోకి దిగిన జలంధర్ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తొలుత ఎల్ పీయూ విద్యా సంస్థకు వెళ్లారు. అక్కడ ఆకాంక్ష జూనియర్ విద్యార్థులతో మాట్లాడారు. ఆ తర్వాత విద్యాసంస్థ అధ్యాపకులతో మాట్లాడారు. ఇదే క్రమంలో అక్కడి ప్రొఫెసర్ మ్యాథ్యూతో ప్రేమలో పడినట్టు తేలింది.
కేరళలోకి కొట్టాయంకు చెందిన బిజిల్ మ్యాథ్యూ అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఆయనతో లవ్‌లో పడంది ఆకాంక్ష. ఆయనకు ఇదివరకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు కూడా. శుక్రవారం కాలేజీకి వెళ్లిన ఆకాంక్ష, నేరుగా మ్యాథ్యూ ఇంటికి వెళ్లింది. తనను మ్యారేజ్ చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అందుకు ఆయన ససేమిరా అన్నారు.
అక్కడి నుంచి కాలేజీకి వచ్చింది. కాలేజీలో కూడా ఆకాంక్ష-మ్యాథ్యూ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. పెళ్లి చేసుకునేది లేదని ఆయన తెగేసి చెప్పేయడంతో మోస పోయానని భావించిన ఆకాంక్ష భవనంలోని నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆకాంక్ష చావుకు కారణమైన జిబిల్ మ్యాథ్యూపై జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురు ఆకాంక్ష ప్రేమ విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యుల షాకయ్యారు. ఈ విషయం మాకు చెప్పినా బాగుండేదని, తనలో తాను కుమిలిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టిందని వాపోయారు.