Vizag: విశాఖ సిటీలో మరో అద్భుత నిర్మాణానికి సాక్ష్యంగా నిలవనుంది ‘ది డెక్’. సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ నౌకను తలపించేలా చేసిన డిజైన్ చేసిన ఐకానిక్ భవనం రెడీ అయ్యింది. ఇంతకీ ది డెక్ స్పెషల్ ఏంటి? ఎందుకు? అనేది చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న.
విశాఖ సిటీలో అద్భుతాల గురించి చెప్పనక్కర్లేదు. మెయిన్ రోడ్డు నుంచి ఎటువైపు వెళ్లినా ప్రతీ రోడ్డులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నగరానికి సంబంధించి ఆనవాళ్లు కళ్ల ముందు కనిపిస్తాయి. ఓ వైపు సముద్రం, మరోవైపు ఎత్తైన కొండలు. చాలామందిని టూరిస్టులు విశాఖను గోవాతో పోల్చుతారు. సింపుల్‌గా చెప్పాలంటే ఏపీకి ఇదొక ఆర్థిక రాజధాని.
ఈ సిటీలో కొలువుదీరిన పరిశ్రమలు అన్నీఇన్నీకావు. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. విశాఖ సిటీ నడిబొడ్డున విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన మల్టీలెవల్ కార్ పార్కింగ్ భవనం ‘ది డెక్’ ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది.
సీఆర్‌రెడ్డి సెంటర్‌లో నౌక ఆకృతిలో నిర్మించిన ఈ భవనం అక్కడికి వచ్చిన పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాలుగు రోడ్డు కూడలిలో నిర్మించిన ఈ భవనంలో 11 అంతస్తులున్నాయి. అందులో 4 అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించారు. మిగిలిన 7 అంతస్తులు వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నారు.
ALSO READ: ఐఆర్సీటీసీ అకౌంట్‌తో ఆధార్ లింక్.. సింపుల్‌గా ఇలా చేయండి?
విశాఖ నగరానికి వచ్చే టెక్ కంపెనీలకు అద్దె ప్రాతిపదికన దీన్ని కేటాయించాలని ఆలోచన చేస్తున్నారు అధికారులు. ది డెక్ పైభాగం నుంచి విశాఖ సిటీని మొత్తం చూడొచ్చు. సౌర విద్యుత్ కోసం పై భాగంలో సోలార్ పలకలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ భనవం ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఈ భవనమంతా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది.
యోగా కోసం రేపో మాపో విశాఖకు రానున్నారు సీఎం చంద్రబాబు. అప్పుడు ఈ భవనాన్ని ప్రారంభించే అవకాశముంది. పార్కింగ్ ఏరియాకు 1.90 లక్షల చదరపు అడుగులు కేటాయించారు. వాణిజ్య అవసరాలకు 1.64 లక్షల చదరపు అడుగులు స్థలం ఉంది. ఈ లెక్కన వైజాగ్ సిటీలో ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
సింపుల్ గా చెప్పాలంటే 430 కార్లు అందులో పార్కింగ్ చేయవచ్చు. టూవీలర్స్ అయితే 400 పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ భవనమంతా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది. ఐటీ కంపెనీలు, హోటల్స్ అవసరాలకు అనుకూలంగా నిర్మించారు. సిటీకి అదొక కొత్త అందాన్ని తీసుకొచ్చింది. రూ. 90 కోట్లతో ఈ భవన నిర్మాణం జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే వాల్తేరుకి అదొక ల్యాండ్‌మార్క్ అన్నమాట.
?igsh=OWg2Yzc5M3RrYWxp