Bengaluru Crime: విద్యార్ధులకు విద్యాబుద్దులు నేర్పే వారినే గురువు అంటాం. కానీ వాళ్లే మృగాళ్లుగా ప్రవర్తిస్తే.. తాజాగా బెంగళూరులో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రముఖ ప్రైవేట్ కళాశాలలో ఇద్దరు లెక్చరర్లు కలిసి.. ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో.. అసలు నిజాలు బయటకొచ్చాయి.
అమ్మాయితో చనువు – నోట్స్ ఇస్తాననే నమ్మకం
వివరాల్లోకి వెళితే.. ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర.. బాధిత విద్యార్థినితో చనువు పెంచుకున్నాడు. తరచూ పాఠ్యాంశాలపై మాట్లాడుతూ.. నాకు దగ్గర మంచి నోట్స్ ఉన్నాయి.. వాటితో నీ మార్కులు బాగా వస్తాయి అని చెబుతూ నమ్మకం కలిగించాడు. చదువులో అభ్యాసానికి సహకరిస్తున్నాడని భావించిన విద్యార్థిని, అతడితో కాస్త స్నేహంగా వ్యవహరించింది. కానీ ఆ స్నేహాన్ని నరేంద్ర దుర్వినియోగం చేశాడు.
మారతహళ్లిలో నరేంద్ర దుర్మార్గం
ఒక రోజు నరేంద్ర విద్యార్థినిని మారతహళ్లిలోని.. తన మిత్రుడు అనూప్ నివాసానికి నోట్స్ చూపుతానని పిలిచాడు. అక్కడ ఆమెను మోసం చేసి, మానసికంగా బలహీనపరిచి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై వీడియో తీసి తన వద్ద ఉంచుకున్నాడు. అనంతరం తన స్నేహితులు.. బయాలజీ లెక్చరర్ సందీప్, అనూప్‌తో కలిసి విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డారు.
బ్లాక్‌మెయిలింగ్.. ఫోటోలతో బెదిరింపులు
నరేంద్రతో విద్యార్థిని ఉన్న సన్నిహిత ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెప్పి, సందీప్, అనూప్ కలిసి ఆమెను బెదిరించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేస్తామని భయపెట్టిస్తూ, వారిద్దరూ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది ఒకసారి కాదు.. పలు సందర్భాల్లో విద్యార్థినిని బెదిరించి, ఆమెపై లైంగిక దాడులు జరిపినట్టు బాధితురాలు తెలిపింది.
విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో
ఈ భయంకర పరిస్థితుల మధ్య బాధితురాలు.. చివరకు ధైర్యంగా ముందుకొచ్చింది. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు వెల్లడించింది. వారు వెంటనే మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
నిందితుల అరెస్టు – కోర్టు ముందు హాజరు
ఫిర్యాదు నమోదు చేసిన కొద్ది గంటల్లోనే.. పోలీసులు నిందితులు నరేంద్ర, సందీప్, అనూప్‌లను అరెస్టు చేశారు. విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
గతంలోనూ ఇతర విద్యార్థినులతో
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు.. గతంలోనూ కళాశాలలోని ఇతర విద్యార్థినులతోనూ.. ఇదే తరహాలో ప్రవర్తించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల యాజమాన్యంపై, ఇతర విద్యార్థులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా ఎవరైనా బాధితులుగా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
Also Read: గండికోటలో ఇంటర్ స్టూడెంట్ హత్య.. వాడే చంపేశాడా?
ఈ ఘటన విద్యాసంస్థల భద్రత, గురువుల బాధ్యతపై ఎన్నో సందేహాలు కలిగిస్తోంది. విద్యార్థినులు భద్రంగా చదువుకునే హక్కు కలిగి ఉన్నా, కొందరు లెక్చరర్లు తమ హోదాను దుర్వినియోగం చేసుకుంటున్నారు. విద్యాసంస్థలు, పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప, ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగకుండ ఉంటాయి.
విద్యార్థినిపై లెక్చరర్ల అఘాయిత్యం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్!
బెంగళూరులో మూడబిదిరెలోని ఓ ప్రముఖ కళాశాలలో దారుణం
ఓ విద్యార్థినిపై ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర, బయాలజీ లెక్చరర్ సందీప్, వారి స్నేహితుడు అనూప్ కలిసి పలుమార్లు లైంగికదాడి
బాధిత విద్యార్థినితో చనువు పెంచుకుని..… pic.twitter.com/gTY2GjU5Sk
— BIG TV Breaking News (@bigtvtelugu) July 16, 2025