Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలకు తానే స్వయంగా కనిపించాలని వారితో మాట్లాడాలని ఆరు అనుకుంటుంది. నువ్వే స్వయంగా వెళ్లాలనుకుంటున్నావా…? అని గుప్త అడగ్గానే.. నేను వెళ్లాలనుకున్నా ఎలా వెళ్లగలను అంటూ.. తనకు శక్తులు ఉన్న విషయం గుర్తు చేసుకుని సోదమ్మ వేషంలో పిల్లల దగ్గరకు వెళ్లాలనుకుంటుంది ఆరు. గుప్త కూడా పిట్టలదొర వేషంలో వస్తాడు. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లి పిల్లలకు సోదీ చెప్తామని అంటారు. వాళ్లను చూసిన మనోహరి ఈ టైంలో వీళ్లు వస్తున్నారేంటి..? ముందు వీళ్లను బయటకు పంపించాలి అనుకుని వాళ్లను బయటకు వెళ్లిపోండి అంటుంది.
ఇంతలో పిల్లుల పిట్టలదొర వేషంలో ఉన్న గుప్తను ఆశ్చర్యంగా చూస్తుంటారు. తన మాటలతో గుప్త పిల్లలను నవ్విస్తాడు. మనోహరి మాత్రం వాళ్లను బయటకు వెళ్లమని చెప్తుంది. ఇంతలో మిస్సమ్మ లోపలి నుంచి ఒక్క నిమిషం అంటూ వస్తుంది. మీరు లోపలికి రండి అని పిలుస్తుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్ ఏంటి వచ్చేది నేను చెప్తే వినిపిచడం లేదా..? బయటకు వెళ్లండి అంటుంది. మిస్సమ్మ కోపంగా నేను చెప్తే నీకు వినిపించడం లేదా..? నేను రమ్మని చెప్తున్నాను కదా..? ఈ ఇంటి కోడలిని నేను ఈ ఇంట్లో ఎవరుండాలి..? ఎవరు వెళ్లాలి అని చెప్పేది నేను నువ్వు కాదు.. ఇలాంటి వాళ్లను గుమ్మం ముందు నుంచి పంపిచేయడం కరెక్టు కాదు. మీరు రండమ్మా అంటూ వాళ్లను ఇంట్లోకి తీసుకెళ్తుంది మిస్సమ్మ.
మరోవైపు ఇంటికి వెళ్తున్న అమర్ కారు మధ్యలో ట్రుబుల్ ఇవ్వడంతో అంజును జాగ్రత్తగా చూసుకోమని మిస్సమ్మకు చెప్పాలి అనుకుంటాడు. మరోవైపు విసుగ్గా రూంలోకి వెళ్లిపోతుంది మనోహరి. కరెక్టుగా ప్లాన్ చేస్తున్న టైంలో ఈ సోది వాళ్లు వచ్చి కూర్చున్నారు అని ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. ఇంతలో రణవీర్ కాల్ చేస్తాడు. ఈ రణవీర్ ఒకడు ఇక్కడ సిచ్యుయేషన్ తెలియదు.. ఏమీ తెలియదు.. అని తిట్టుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది. రణవీర్ తాను కారులో రెడీగా ఉన్నాను మనోహరి అంజలిని బయటకు పంపించు అని చెప్తాడు. దీంతో మనోహరి ఇప్పుడు కుదరదు కాసేపను ఆగు అని చెప్తుంది.
అంత టైం లేదని చెప్పాను కదా.. అమర్ ఇంటికి తిరిగి వచ్చే లోపు పని జరిగిపోవాలి. అంటూ కోప్పడతాడు రణవీర్. ఆ విషయం నాకు తెలియదా..? కానీ పిల్లలు భాగీ కలిసి సోది చెప్పించుకుంటున్నారు. సొదమ్మతో పాటు ఒక పిట్టల దొర కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి అంటూ మనోహరి చెప్తుంటే.. మనోహరి ఇప్పుడు ఆ సోదంతా నాకెందుకు చెప్తున్నావు అంజలిని ఎప్పుడు బయటకు పంపిస్తావో అది చెప్పు అంటాడు రణవీర్. ఒక్క పది నిమిసాలు వెయిట్ చేయ్ నేను ఏదో ఒకటి చేసి పంపిస్తాను అంటుంది. సరే ఓకే అంటూ కాల్ కట్ చేస్తాడు రణవీర్.
బయట హాల్లో పిట్టల దొర గెటప్‌లో ఉన్న గుప్త తన మాటలతో పిల్లలను ఎటర్‌టైనర్ చేస్తాడు. గుప్త ఫర్మామెన్స్‌కు పిల్లలు పడి పడి నవ్వుతారు. అంకుల్ మీరు బలే చెప్పారు అంటుంది అంజు. ఏదేదో మాట్లాడారు కానీ చాలా బాగుంది అంటుంది అమ్ము. బాగుంది అనేది ఇష్టం అమ్మా..! భలే ఉంది అనడం ప్రశంస అమ్మ.. ఈ రెండింటికీ ఈ పిట్టల దొర మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు అంటాడు గుప్త. గుప్తను ఆరు ఆశ్చర్యంగా చూస్తుంది. నావంక ఎందుకు చూస్తావు నువ్వు చెప్పేది చెప్పు అంటాడు గుప్త. దీంతో ఆరు నువ్వు రా తల్లి అంటూ అమ్మును పిలిచి నువ్వు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నావు అని అడుగుతుంది.
అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని అమ్ము చెప్పగానే.. ఆరు షాక్ అవుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మ మమ్మల్ని వదిలి దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. మమ్మల్ని చూసుకోవడానికి మిస్సమ్మ ఉంది. మరి పైన మా అమ్మ ఎలా ఉందో చెప్తారా..? అని అడగ్గానే ఆరు ఎమోషనల్‌గా ఫీలవుతూ.. అమ్మూ అని పిలుస్తుంది. అందరూ షాక్ అవుతారు. మనోహరి కోపంగా ఏయ్ తన పేరు అమ్ము అని నీకెలా తెలుసు అంటుంది. నాదేం ఉందే తల్లి పైన అమ్మ పలికిందే ఇక్కడ నేను పలుకుతాను అని ఆరు చెప్తుంది. మీ అమ్మ చల్లగా ఉందే తల్లి.. చాలా సంతోషంగా ఉందే తల్లి అని చెప్తుంది. ఆరు మాటలకు పిల్లలందరూ ఎమోషన్ అవుతారు. దీంతో మిస్సమ్మ పిల్లలను రూంలోకి పంపిస్తుంది.
తర్వాత మనోహరి పిల్లల దగ్గరకు వెళ్లి రూంలో ఉంటే ఇలాగే బాధగా అనిపిస్తుంది. బయటకు వెళ్లి ఏదైనా గేమ్ ఆడుదామని చెప్తుంది. పిల్లలు కూడా సరే అంటారు. అందరూ కలిసి గార్డెన్‌లోకి వెళ్లి పుట్‌బాల్ అడుతుంటారు. బయట అంజు కోసం కారులో రణవీర్ వెయిట్ చేస్తుంటాడు. పుట్‌బాల్ అడుతున్న మనోహరి కావాలనే బాల్ బయట పడేటట్టు చేస్తుంది. బాల్ కోసం అంజు బయటకు వెళ్తుంది. అంజును కిడ్నాప్ చేయాలని రణవీర్ వెళ్తుంటాడు. అప్పుడే మిస్సమ్మ, అంజు కోసం బయటకు వెళ్తుంది. మరో వైపు నుంచి అమర్ కారులో వస్తుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?