Betting App Suicide: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ వ్యసనం నుంచి బయట పడేందుకు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. బయటకు వచ్చినవాళ్లు కొందరైతే, ఆ ఊబి నుంచి బయటకు రాలేక ఈ లోకాన్ని విడిచిపెట్టేవాళ్లు చాలామంది ఉన్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వ్యసనం నుంచి భర్తను బయట పడేయాలని భావించింది. మారలేదని తెలియడంతో పిల్లలతో కలిసి ఆ తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్కడి వాళ్లని కంటతడి పెట్టించింది.
అసలేం జరిగింది?
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన మల్లేష్ లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. మల్లేష్ భార్య రాజేశ్వరి డిగ్రీ వరకు చదువుకుంది. మల్లేష్-రాజేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు.నిత్యం పిల్లల సందడితో ఆ ఇల్లు చాలా సందడిగా ఉండేది. ఆ ఫ్యామిలీలో సంతోషాలకు కొదవలేదు. ఆడుతూ పాడుతూ సాగుతున్న రాజేశ్వరి సంసారంలో బెట్టింగ్ యాప్ చిచ్చు పెట్టింది. కొన్నాళ్లలో ఆమె ఆశలు ఆవిరయ్యాయి.
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు రాజేశ్వరి భర్త మల్లేష్ అలవాటు పడ్డాడు. దీని బారినపడి పదులు, వందలు, వేలు కాదు.. ఏకంగా 20 లక్షల వరకు అప్పు చేసింది. బంధువులు, మహిళా సంఘాలు ఇలా తెలిసివారి నుంచి అప్పులు తెచ్చింది. అప్పులు ఇచ్చినవారు ఇంటి కొచ్చి గొడవ చేశారు. చివరకు అన్నదమ్ములు, భర్త ఉన్న ప్లాట్ అమ్మి కొంత అప్పు తీర్చారు.
జీవితాలను నాశనం చేసింది
ఇకపై ఇలాంటి ఆటలు ఆడేది లేదని భార్యపై ఒట్టు వేశాడు. అయినా భర్త బెట్టింగ్ ఊబి నుంచి బయటకు రాలేకపోయాడు భర్త మల్లేష్. కొద్ది రోజులకే అటువైపు మనసు లాగేసింది.. మళ్లీ అప్పుచేసింది. చివరకు అప్పులవాళ్లంతా ఇంటి ముందు ఆందోళనకు దిగారు.
ALSO READ: పెళ్లయిన రెండువారాలకే భర్తను లేపేసింది
దీన్ని అవమానంగా భావించి ఏడేళ్లు కొడుకు అనిరుద్, నాలుగేళ్ల చిన్న కుమారుడు హర్షవర్ధన్ లను వాటర్ ట్యాంకులోకి నెట్టేసింది కన్న తల్లి. చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. బెట్టింగ్ వ్యసనం నుంచి బయటకు రాలేకపోయిన మల్లేష్ చివరకు ఒంటరివాడు అయ్యాడు. అంతా పొగొట్టుకున్న తర్వాత తెలుసుకున్నాడు.
ఒంటరైన మల్లేష్
తనకు జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదని, బెట్టింగ్ యాప్ ప్రమోటర్లని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భార్య, పిల్లలు పొగొట్టుకుని కన్నీరు మున్నీరు అవుతున్నాడు మల్లేష్. ఇలాంటి బెట్టింగ్ యాప్‌లతో తస్మాత్ జాగ్రత్త. ఏడాది కిందట ఈ ఘటన జరిగ్గా, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.